భావన . మానవుని మనుగడకు సమాజ శ్రేయస్సు ఒక దివ్య ఆయుధం . ఏ మానవుడు ఎక్కువగా సమాజాన్ని గురించి ఆలోచిస్తాడో అతని మనుగడకి , జీవితానికి ఒక అర్థం ఒక పరమార్థము ఉంటుంది . మాములు ఆయుధాలకి పదును పోయే అవకాసం ఉన్నది . ఈ మహా ఆయుధానికి సేవ చేసిన కొలది పదునేక్కుతుంది ..కనుకనే అందరు ఈ ఆయుధాన్ని ధరించి దుర్మార్గ , నీచ భావాలకు ఆలవాలమైన ప్రతి ఒక్కరి మనస్సులలో నున్న స్వార్థ పూరిత విష వృక్షాలను చ్చేదించాలి . నిరంతరం ఆనందాన్ని ప్రసాదించే కల్ప వృక్షాలను పెంచి పోషించాలి . ఎవరి హృదయము లో నిరంతరం నిశ్చల , నిర్మల , భావాలు ఉంటాయో వారి హృదయమే దేవాలయం . భావమే మహోత్క్రుస్ట దైవము .
నేనొక సాహితీ ప్రియుడను. సాహితీ ప్రియులన్దరకు నా సారస్వతాభివందనములు.నా సాహితీ పుష్పాల సుగంధాన్ని ఆఘ్రాణించటానికి సవినయంగా, ఆహ్వానం .
18, మే 2012, శుక్రవారం
తృప్తి
తృప్తి మానవునకు ఏంతో ఆనందాన్ని స్తుంది ,ఒకరికి మానసికంగా , మరోకరికి శారీరకంగా. శారీరకంగా పొందే తృప్తి తత్కాలికమే . మానసికం మరువలేని శాశ్విత ఆనందాన్ని యిస్తుంది . సాధారణ మానవులు శారీరకమే కోరుకొంటారు . మహాత్ములు మానసికం కోరుకొంటారు . మహాత్ములకు , సాధారణ మానవులకు ఉన్న తేడ కేవలం మనస్సు . మనస్సు కోరికల పుట్ట . తీర్చటం మొదలు పెడితే కోరటం ఆపదు . క్రమంగా కొన్ని అయిన తీర్చకుండా మనసును మనం అరికడితే , క్రమంగా అది మన దారికి వస్తుంది . దానికి మనకు జ్ఞానము అవసరం . జ్ఞానములోనే విచక్షణ ( చేయ తగిన, తగని పనులు ) ఉంటుంది . జ్ఞానమునకు మూలము గురువు . వారివలన ఒక వంతు వస్తుంది .మిగిలిన మూడు తోటి విద్యార్థులతో ,స్వ శక్తి తో , కాల క్రమము లో వస్తుంది . శ్లో .....ఆచార్యాత్ పాదమాదత్తే , పాదం శిష్య స్వ మేధయా .పాదం స బ్రహ్మచా రిభ్యః , పాదం కాలక్రమేణ చ . కనుక సంపూర్ణ జ్ఞానం రావాలంటే మానసిక పరిపూర్ణత రావాలి . దానికి కొంత అయిన దైవ ఆరాధన , ఆత్మ స్థైర్యం , సేవానురక్తి , పెద్దల యెడ ప్రేమానురాగాలు . అవసరం . ఇలాంటి మనసు తో మనం అందరం తృప్తి గ ఉందామా . ప్రయత్నం చేసి చూడడం తప్పులేదు .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
శోభారాజ్. అన్నమయ్య పురం , పరాభవ ఉగాది .దశావధానం
డా . శోభరాజ్ గారి ప్రస్తుతి పద్యం వేంకటేశుని పాదాలు వినయగరిమ అన్నమయ్యయు పట్టెను హ్లాదమొదవ వాని ఫణుతులు విస్తృత పఱచినట్టి జ్ఞాన శోభాంచి...
-
కాలసర్పమౌతున్న గాలిపటం మాంజా. ఈ రోజు (17.01.2026) నా వెంటపడిన మాంజా కాలసర్పం( దాని పొడవు సుమారు 1000మీ.)భగవానుని కృపతో తప్పుకొన్న నేను. మ...
-
ది. 2. 11. 14 నుండి 9. 11. 2014 వరకు . అవధాన రాజధానీ . ఈ కార్యక్రమం మహోన్నతంగ భారత దేశ రాజధాని అయిన డిల్లి మహానగర...
-
1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...