సీ. ఒకచోట దుర్గమ్మ ఒకచోట సత్యము
కాలప్రభావమ్ము కలిపెనపుడు
సాప్తపదీనంపు సౌభాగ్య రేఖచే
సంసారసుఖములు సాగుచుండె
పచ్చని తలబ్రాలు పారవశ్యత తల
మీద బోయంగ సమ్మోద మలరె
వేదమంత్రార్ధముల్ వేవేల ఫలియించ
అర్థశతాబ్దంబు సార్థకమయె
తే.గీ. భావికాలాన మీకిల భద్రమస్తు!
సుఖము సౌఖ్యాలు మీయింట శోభలలరు
రాము కరుణార్ద్ర దృక్కులే రహిని వెలిగి
ఆయురారోగ్యభాగ్యాల నలరుగాత!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి