1, ఏప్రిల్ 2026, బుధవారం

పెనుమర్తి శేఖర్ పదవీవిరమణ. పి. యం. రెడ్డి పుట్టినరోజు శుభాశీస్సులు.

 పెనుమర్తి శేఖర్ పదవీవిరమణ. 30.05.2026.


శ్రీలగురియించు చిన్మయ చేతనంబు

నాల్గువేదాల వారాశి నలువరాణి

అత్తగారైన శ్రీదేవి యవనరతము

"శేఖరు"కుటుంబ మున్బ్రోచు శ్రేయమలర.1.

       పెనుమర్తివంశ విభవా!

       అనువర్తిగ పెద్దవారి యాశయములనే

       కనుసైగనందికొనుచును

       ఘనకీర్తి వహించి  నావు కార్యాచరణా!.2. 

రామాంజనేయ శర్మయు

రామామణి నీదు తల్లి రాధారాణీ

ధీమంతుడవంచనగను

ప్రేమోదారతలొసంగి పెరిగితివయ్యా!.3.

       కోర్టువారు టైపు కోరిన తడవుగా

       క్షణములోనజేయ ఘనముగాను 

       నరిసిరెడ్డిగారి నవ్యంపుసూచనల్

       వృద్ధిపథము జూపె వేగనీకు. 4.

ఇట్టి ప్రజ్ఞనిన్ను నేయస్వొగాజేయ

జీవితాన ముదము చిగురుదొడిగె

సంఘమందు మిగుల సౌమనస్యముతోడ

గౌరవంబుపెరిగి ఖ్యాతిహెచ్చె.5.

        ఇంతదనుక నీవు హృదయపూర్వక

        మైన సేవజేసి మన్ననంది

        నావు భావికాల నవ్యానుభూతికై

        పదవివదలెనిన్ను పరమప్రేమ.6.

శేషజీవనమ్ము శేషాద్రి వాసునిన్

రమ్యకరుణతోడ రామమణియు

మీకుటుంబమంత మేల్మిసంతోషముల్

ఆయుషంబులంది హాయిమనుడు!7.

24.08.2026. పి.యం.రెడ్డి పుట్టినరోజు శుభాశీస్సులు.

సీ:  నిద్రలేచినదాది నియతి పాలనజేయు

                క్రమశిక్షణాత్మక ఘనుడెవండు

        వృత్తి ప్రవృత్తుల వైవిధ్య ముంజూపి

                 ఆర్ష సిద్ధాంతాల నలరె నెవడు

     గురువులన్మనసార పరమాత్మ గానెంచి

         హృత్కమలములీను హితుడెవండు

             ఏబీసి క్లబ్బులో ఎవరిపండుగకైన

                ఆనందమొందెడు హర్షుడెవడు

              ఎవ్వరి కేరీతి యెంతసాయంబైన

                వెనుదీయకసలుపు విజ్ఞుడెవడు

           పొన్నెకంటినిగాంచి పులకితగాత్రుడై

                    ప్రశ్నలబాణాల వదలునెవడు

          సునిశిత హాస్యంపు సుందరభాషణన్

                    ఆకట్టుకొనునట్టి ఆంధ్రుడెవడు

       ఆత్మాభిమానంబు నభిమతంబుగనెంచి

                    శోభిల్లు సమభావ శూరుడెవడు.

             ఆతడాతడె రెడ్డిమ హాశయుండు

             రామచంద్రుని కరుణ నిరంతరంబు

             జన్మదినమాది కాలంబు సాగుగాత

             ఆయురారోగ్య భోగాలు అమరుగాత! 

      

దుర్గ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు.12.05.26.

 ఆ.వె: చందమామ రేల డెందాలుమురిపించు రేయి బవలు వెల్గు రేడు నీదు మేనమామ; మనసు మెచ్చిన చెలికాడు జీవన పయనాన నావయతడు.1  సీ : ఒకచోట దుర్గమ్మ ఒకచోట ...