అనుబంధం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అనుబంధం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, డిసెంబర్ 2019, సోమవారం

అనుబంధం,ఆత్మీయత.


అనుబంధం,ఆత్మీయత...మాలకొండయ్య.
       కొన్ని అనుబంధాలు ఈ జన్మవి కావేమో అనిపిస్తాయి. అంతగా వారు ఏకమౌతారు. ఆత్మీయత అంటే "తననుతానెంత ప్రేమిస్తాడో ఎదుటివానిని కూడ అంతే ప్రేమగా చూడటం." ఈ రెండు కలగలిసి సనాతన సంప్రదాయ గౌరవమర్యాదలకు ఆలవాలమై, సాహితీ ధురంధరుడై, జ్ఞానవయోవృద్ధుడై, విద్యాదానశీలుడై, నా దక్కిన శమంతకమణే శ్రీ ద్రోణాదుల మాలకొండయ్య గారు. (81సం.లు)
       2013వ సంవత్సరములో " భువనేశ్వర్, కాశీ యాత్రలో సహ యాత్రికుడు. సహజంగా సద్గుణశోభితుడు . అలాంటి వ్యక్తి కనబడగనే ఉప్పొంగిపోతాడు, మమేకమై కష్టసుఖాలలో పాలుపంచుకోవాలనుకుంటాడు. తాను సాహితీప్రియుడు కనుక కవిపండితులనభిమానిస్తాడు. ఆనాడు "కాశీయాత్రావిశేషాలను" నేను వ్రాసి గ్రంథస్థం చేయటాని ముఖ్యకారకుడాయనే. ఏమి మాట్లాడినా చివరకు "మాష్టారూ! దానిని ప్రింట్ చేయించుటకు ముందుగా కొంత డబ్బు ఇవ్వమంటారా?" అని అడిగేవారు. తాను పొందిన ఆనందాన్ని అందరకు పంచాలని ఆయన తపన. ఆధ్యాత్మికత భావనలు నిరంతరం సమాజశ్రేయస్సునే కాంక్షిస్తు ఉంటాయి. కనీసం పది రోజులకొకసారైనా నాకు ఫోన్ చేసి "ఎలా ఉన్నారు మీరు, మేడం గారు?"అని మనసారా పలకరించడం ఆయన మంచి మనసునకు నిదర్శనం.  మనస్సు నిరంతరం మాధవపాదాక్రాంతమై యుంటుంది.  భాగవతంలో పోతనగారు                                                             "  మందారమకరంద మాధుర్యమునదేలు               
              మధుపంబువోవునే మదనములకు
  నిర్మల మందాకినీవీచికలదూగు
               రాయంచచనునే తరంగిణులకు
..........................
    అంబుజోదర దివ్యపాదారవింద
    చింతనామృతపానవిశేష మత్త
    చిత్తమేరీతినతరంబు జేరనేర్చు
    వినుతగుణశీలమాటలువేయునేల......అంటారు.
           అట్టి గుణశీలుని 24.01.2018 న కలుసుకునే అవకాశం దొరికింది. వారి స్వగ్రామమైన " ఎడ్లూరిపాడు" వెళ్ళాము. మా ఆనందానికవధులు లేవు. మాకు బ్రహ్మ రథం పట్టారు. ఆయన సహజంగా రామభక్తుడు. ఇల్లంతా రామమయం. నా ఆరాధ్యదైవం రాముడే. నేను తెనుగు జేసిన " సూర్యశ్రీరామం" తన డాక్టరు గారిచే గ్రంథముగా తయారుచేయించి తెప్పించుకొని మరీ చదివారు. భోజనాలకుముందు కాసేపు పద్యపఠనం. సాహితీసమరాంగణ సార్వభౌముని "ఆముక్తమాల్యద"నుండి. విష్ణుచిత్తుని అతిథి సేవాఘట్టం. "నాస్తి శాకబహుళా". ఎంతమధురమనోహర ఘట్టం. "అభ్యాగతః స్వయం విష్ణుః" మాలకొండయ్యగారి దృష్టిలో నేను విష్ణువును. భోజనానంతరం మాదంపతులకు, నా సోదరుడు కాళీజగన్నాథ్ కు బట్టలు పెట్టి ఆత్మీయతను చాటుకున్నారు.
          మన జీవితంలో ఎందరో కలుస్తారు. వారందరు ఆత్మీయులు కాలేరు. ఆరాధ్యులు కాలేరు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.
   తే.గీ.జీవితంబున వెలిగెడి చెలిమికలిమి
          సర్వ సౌభాగ్య భోగముల్ సంతరించు
          స్నేహదీపంబు వెలిగింప చిత్తమందు
          హ్లాదమిచ్చును నిలువెల్ల హాయి గూర్చు.

    తే.గీ.మాలకొండయ్య నెయ్యంబు మరువలేను
           ఉన్నతంబైన సుగుణమహోన్నతుండు
           పుస్తకంబుల పారాడు పురుగనంగ
           సార్థకంబౌను సామెత చక్కగాను.

    

14, జులై 2019, ఆదివారం

మాలకొండయ్య గారి ఆత్మీయత.

అనుబంధం,ఆత్మీయత.

       కొన్ని అనుబంధాలు ఈ జన్మవి కావేమో అనిపిస్తాయి. అంతగా వారు ఏకమౌతారు. ఆత్మీయత అంటే "తననుతానెంత ప్రేమిస్తాడో ఎదుటివానిని కూడ అంతే ప్రేమగా చూడటం." ఈ రెండు కలగలిసి సనాతన సంప్రదాయ గౌరవమర్యాదలకు ఆలవాలమై, సాహితీ ధురంధరుడై, జ్ఞానవయోవృద్ధుడై, విద్యాదానశీలుడై, నా దక్కిన శమంతకమణే శ్రీ ద్రోణాదుల మాలకొండయ్య గారు. (81సం.లు)
       2013వ సంవత్సరములో " భువనేశ్వర్, కాశీ యాత్రలో సహ యాత్రికుడు. సహజంగా సద్గుణశోభితుడు . అలాంటి వ్యక్తి కనబడగనే ఉప్పొంగిపోతాడు, మమేకమై కష్టసుఖాలలో పాలుపంచుకోవాలనుకుంటాడు. తాను సాహితీప్రియుడు కనుక కవిపండితులనభిమానిస్తాడు. ఆనాడు "కాశీయాత్రావిశేషాలను" నేను వ్రాసి గ్రంథస్థం చేయటాని ముఖ్యకారకుడాయనే. ఏమి మాట్లాడినా చివరకు "మాష్టారూ! దానిని ప్రింట్ చేయించుటకు ముందుగా కొంత డబ్బు ఇవ్వమంటారా?" అని అడిగేవారు. తాను పొందిన ఆనందాన్ని అందరకు పంచాలని ఆయన తపన. ఆధ్యాత్మికత భావనలు నిరంతరం సమాజశ్రేయస్సునే కాంక్షిస్తు ఉంటాయి. కనీసం పది రోజులకొకసారైనా నాకు ఫోన్ చేసి "ఎలా ఉన్నారు మీరు, మేడం గారు?"అని మనసారా పలకరించడం ఆయన మంచి మనసునకు నిదర్శనం.  మనస్సు నిరంతరం మాధవపాదాక్రాంతమై యుంటుంది.  భాగవతంలో పోతనగారు  

 "  మందారమకరంద మాధుర్యమునదేలు               
              మధుపంబువోవునే మదనములకు
  నిర్మల మందాకినీవీచికలదూగు
               రాయంచచనునే తరంగిణులకు
..........................
    అంబుజోదర దివ్యపాదారవింద
    చింతనామృతపానవిశేష మత్త
    చిత్తమేరీతినతరంబు జేరనేర్చు
    వినుతగుణశీలమాటలువేయునేల......అంటారు.

           అట్టి గుణశీలుని 24.01.2018 న కలుసుకునే అవకాశం దొరికింది. వారి స్వగ్రామమైన కావలి సమీపంలోని " ఎడ్లూరిపాడు" వెళ్ళాము. మా ఆనందానికవధులు లేవు. మాకు బ్రహ్మ రథం పట్టారు. ఆయన సహజంగా రామభక్తుడు. ఇల్లంతా రామమయం. నా ఆరాధ్యదైవం రాముడే. నేను తెనుగు జేసిన " సూర్యశ్రీరామం" తన డాక్టరు గారిచే గ్రంథముగా తయారుచేయించి తెప్పించుకొని మరీ చదివారు. భోజనాలకుముందు కాసేపు పద్యపఠనం. సాహితీసమరాంగణ సార్వభౌముని "ఆముక్తమాల్యద"నుండి. విష్ణుచిత్తుని అతిథి సేవాఘట్టం. "నాస్తి శాకబహుళా". ఎంతమధురమనోహర ఘట్టం. "అభ్యాగతః స్వయం విష్ణుః" మాలకొండయ్యగారి దృష్టిలో నేను విష్ణువును. భోజనానంతరం మాదంపతులకు, నా సోదరుడు కాళీజగన్నాథ్ కు బట్టలు పెట్టి ఆత్మీయతను చాటుకున్నారు.
          మన జీవితంలో ఎందరో కలుస్తారు. వారందరు ఆత్మీయులు కాలేరు. ఆరాధ్యులు కాలేరు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.

   తే.గీ.జీవితంబున వెలిగెడి చెలిమికలిమి
          సర్వ సౌభాగ్య భోగముల్ సంతరించు
          స్నేహదీపంబు వెలిగింప చిత్తమందు
          హ్లాదమిచ్చును నిలువెల్ల హాయి గూర్చు.

    తే.గీ.మాలకొండయ్య నెయ్యంబు మరువలేను
           ఉన్నతంబైన సుగుణమహోన్నతుండు
           పుస్తకంబుల పారాడు పురుగనంగ
           సార్థకంబౌను సామెత చక్కగాను.

    

25, సెప్టెంబర్ 2014, గురువారం

దసరా ది. 26..09 . 14 న కార్యక్రమము .

           శరన్నవ రాత్రి ఉత్సవముల సందర్భముగా .( దసరా) ది. 26..09 . 14 న కార్యక్రమము .

               శ్రీమాన్ మరింగంటి రాఘవాచార్యుల  వారితో ( అష్ట లక్ష్మి దేవాలయ ప్రధాన అర్చకులు ) పరిచయం.  (ది. 24. 09. 14 న )

   దేవాలయ ప్రాంగణం లో ది. 26. 09. 14. ఉదయము 8. గం .లకు శ్రీమతి  వి. వి. యస్. కృష్ణ  కుమారి , మరియు  శ్రీమతి  పద్మ లత గారు  అన్నమాచార్యుల వారి కీర్తనలు  పాడుటకు  అనుమతి లభించింది . కృష్ణ కుమారి గారు కీర్తన లకు వ్యాఖ్యానం ఉంటే  బాగుంటుందనే ఆలోచన వచ్చి నన్ను చెప్పమని అడిగారు . నేను

అంగీకరించాను . వారి కీర్తనలకు అనుగుణం గ విషయం వ్రాసుకొన్నాను . ఈ రోజు ఆచార్యుల వారి దగ్గర కొంత అభ్యాసం చేయాలని విషయం వారికీ చూపించాలని అంటే వారి యింటికి వెళ్ళాము . నేను వ్రాసిన దానిలో అన్నమయ్య గారిని గురించి కొంచెం తగ్గించి చెప్పమన్నారు . మిగిలినది అంతా బాగున్నది అని అన్నారు . చాలఆనందం గ ఉన్నది. కార్య క్రమం 
విజయవంతమైతే యింకా ఆనందం . క్రొత్త క్రొత్త అనుభవాలు వస్తున్నాయి . 
అయాచితం గ వచ్చే అవకాశాలే మధురానుభూతులను యిస్తాయి . విలువలను పెంచుతాయి. 

.

21, డిసెంబర్ 2013, శనివారం

,పొన్నె కల్లు , హై స్కూల్ కి 21.1 2.1 3.

 గుంటూరు , శ్రీ రామ మామయ్య కార్యక్రమము సందర్భము గ ,పొన్నె కల్లు  , హై స్కూల్ కి 
వెళ్ళినప్పటి చిత్రాలు . 21.1 2.1 3. 
























1, ఏప్రిల్ 2013, సోమవారం

కీ. శే యల్లా ప్రగడ వెంకట నారాయణ రావు గారు.

            కీర్తి శేషులు యల్లా ప్రగడ వెంకట నారాయణ రావు గారు.




వీరు నామాతా మహులు . వాసుదాసు గారి
( ఆంద్ర వాల్మీకి గా ప్రసిద్ధి గాంచిన ,వావిల కొలను సుబ్బారావు
గారికి ) శిష్యులు . వైష్ణవం స్వీకరించారు .. గుంటూరు జిల్లా నగరం
స్వ గ్రామమ్. యేలేటి పాలెం గ్రామానికి కరణం  గా పని చెసారు.
ఈనాడు వేద గాయత్రి అగ్రహారం నిర్మాత అయిన యల్లాప్రగడ
ప్రభాకర శర్మ గారికి పితామహులు .  శిస్టా చార పరాయణులు .
భారత , భాగవత , రామాయణాది గ్రంధములు వారికి కన్థ స్థ మనిన
అతిశయోక్తి కాదు. పరమ భక్తులు . బహుముఖ ప్రజ్ఞాశాలి .
పోలములను కొలిచే సర్వ్ గొలుసు లేకున్డగానే ఆనాడు తన అంగలతో
పోలములను కొలిచే వారు. అది అందరిని ఆశ్చర్య పరచే విధంగా
చాల ఖచ్చితం గ లెక్క ఉండేది  ఒంటి కాలి మీద నిల్చి ఆదిత్య హృదయం  నలుబది రోజులు పారాయణ చేసి తన అభీష్టాన్ని
( కోర్టులో విజయం ) సంపాదించుకొన్న ఘనులు . నిరంతరం
రామ నామ జపమే ధ్యేయంగా పెట్టుకొన్న రామ భక్తులు.
అందరి చేత  దేవుడు తాతయ్య గా పిలిపించుకోనేవారు .ధన్యజీవులు .
                                                                                             


                                                                                 





                               

5, మార్చి 2013, మంగళవారం

సంవత్సర సంతోషం .

                                                 సంవత్సర సంతోషం . కృతఙ్ఞతలు 

    23. 2. 2013. న  హైదరాబాద్ లో, రంగారెడ్డి జిల్లాలోని తుర్క యామ్జల్ లో13 సంవత్సరముల క్రిందట స్తాపింప బడిన  శ్రీ జ్ఞానోదయ విద్యా నికేతన్ లోని  వార్షికోత్సవానికి నాందిగా   జ్యోతి ప్రజ్జ్వలనంచేస్తూ  ముఖ్య అతిధులు, ( బి .వెంకటేశం గారు, ఎం  ,ఇ . ఓ . హీర్యానాయక్ గారు ,ప్రిన్సిపాల్ .                   ( యెన్.పద్మజారాణి  ) సభా సంప్రదాయాన్ని పాటించారు.  .                                                      
 ఈ సందర్భం గానే చిరంజీవి అరుణ్ కిరణ్ ద్వారా  బాల బాలికలలో ,నాయకత్వ లక్షణములను ప్రేరేపించే ఒక కార్య క్రమం , ఊరేగింపు, దానినిగురించి వివరణ జరిగాయి. మానవ జీవితం లో నాయకత్వ లక్షణం ఒక విలక్షణ మైనది . దానిని సద్వినియోగ పరచుకొంటు ముందుకు సాగితే జీవితం సమర్థ వంతం గ , సుఖ వంతం గ సాగుతుంది, దానిని ప్రచారం చెయ్యాలన్న ఒక నాయక లక్షణం ఉన్నవాడే చేయగలుగుతాడు . నాయకుడు సహజంగా జన్మిస్తాడు.( సుభాస్ చంద్ర బోస్ ,అల్లూరి ., మహాత్మా గాంధి జి ,పండిట్ నెహ్రు జి ,లాల్ బహదూర్ శాస్త్రి జీ , టంగుటూరి ప్రకాశం పంతులుగారు , మొదలగువారు యెన్దరో  మహనీయులు )కాని కొంత పరిశ్రమ మీద కూడా కావచ్చు . ఏది ఏమైన, ఈ ప్రయత్నం అభినందనీయం  . ప్రతి విద్యాలయంలో ఇది నిరంతరం కొన సాగాలిసిన్దె. నేటి విద్యార్ధులే రేపటి నాయకులు .. తధాస్తు

దుర్గ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు.12.05.26.

 ఆ.వె: చందమామ రేల డెందాలుమురిపించు రేయి బవలు వెల్గు రేడు నీదు మేనమామ; మనసు మెచ్చిన చెలికాడు జీవన పయనాన నావయతడు.1  సీ : ఒకచోట దుర్గమ్మ ఒకచోట ...