అనుభవాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అనుభవాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, జనవరి 2014, శనివారం

విరూపాక్ష స్వామీజీ దర్శనమ్. ది .18.01 .14.

                                                      విరూపాక్ష స్వామీజీ దర్శనమ్.  ది .18.01 .14. 

విరూపాక్ష స్వామీజి  ఈ రోజు యల్లాప్రగడ ప్రభాకర్ యింటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించారు . 30 మంది శిష్య బృందం తో వచ్చారు . వారిలో చాల నిశిత పరిశీలనా పటిమ కనబడింది . అది వారి తపస్ శక్తికి నిదర్శనం గ కనబడింది . అందరిని ప్రేమ పూర్వకముగా , ఆత్మీయముగా పలుకరించారు. చక్కని సంస్కృత సంభాషణ కలిగి ఉన్నారు  , పాద పూజను సున్నితంగా కాదనుట ద్వారా తమ గురువుల పై గల భక్తీ , ప్రేమ కనబడింది . ప్రభాకర్  ను  సహస్ర గాయత్రి చేయమన్నారు  ,అందరికి ప్రేమతో ఆశీస్సులిచ్చారు .    తద్వారా ఆగ్రహారానికి మేలు జరుగుతుందని అన్నారు . గాయత్రి మాత  జపం నిజంగా ఎంతో శక్తి వంతమైనది . న గాయ త్ర్యాహ్ పరమమ్  మంత్రం   (గాయత్రీ దేవిని మించిన మంత్రం లేదని  అన్నారు మహర్షులు . నిబద్ధత, క్రమ శిక్షణ , నిర్మలత్వం . ప్రేమ ఎక్కడ ఉంటాయో అక్కడే పర మాత్మ స్వరూపమ్ ఉంటుంది నిస్సందేహం గ .  నేను రామ కృష్ణ మఠం వారి ప్రచురణ గ్రంధం  మనసు అనేది ఒకటి యశ్వంతాపూర్ లో కొన్నాను. దాని సారాంశం అంతా శుద్ధ చైతన్య స్వరూపమైన మనసును కలిగిన వాడే దయామయుడై , సత్వగుణ సంపన్నుడై , ఆత్మ స్వరూపమ్ తెలిసికోగలుగు తాడని ఉన్నది.  క్రమం తప్పని అభ్యాసమే , దీని కి పునాది అవుతున్ది. దీని లో ఆత్మను దర్శించటానికి , తద్వారా నీకు , దానికి తేడా లేదని ,( సోహం, అయమాత్మా పరబ్రహ్మ)  దానికి నిరంతర ఓం కారం , లేదా యిష్ట దైవ స్మరణ గాని  దోహద పడుతుందని  పేర్కొన్నారు . నాకు ఆ గ్రంధ సారాంశమే స్వామీజీగా కనిపించారు.  


12, జనవరి 2013, శనివారం

రాయలుగా సూర్య నారాయణ రావు










2005.వ.సం. భట్టిప్రోలు లో ప్రధానోపాధ్యాయిని  పదవీ విరమణ  చేసిన సందర్భంగ భువన విజయము                  శ్రీ కృష్ణ దేవరాయలుగ పొన్నెకంటి సూర్య నారాయణరావు .తిమ్మరుసు గ ముద్దాలీలా మోహన రావు.ఉన్నాము . సన్మాన గ్రహీత  సూర్య నారాయణ రావు. సన్మాన కర్త, విద్యాలయ వ్యవస్థాపకులు పులికొండ రాదా కృష్ణ గుప్తగారు . .

1971వ. సం లో . విద్యాలయంలో చేరినప్పటినుండి నా సోదరుడు మద్దా లీలా  మోహనరావు తోబాటు. అనేక భువనవిజయములు ,ఇందిరా  మందిర సభలు,  అవధానాలలో పాల్గొనటం జరిగింది .లీలా మోహనరావు తిమ్మరు పాత్రనెంతో రక్తి కట్టిస్తూ తనకి తనే సాటి యనిపించుకున్నాడు . నేను రామరాజ భూషణుని గ ,ముక్కు తిమ్మనగ, పింగళి సూరనగా పాలు పంచుకోనటం జరిగింది .రేపల్లెలో పండిత పరిషత్కార్యక్రమాలు జరిగినంత కాలం అదొక స్వర్ణ యుగంగా ఉన్నది.  లీలామోహనరావు ,నేను ఒకే కళాశాలలో కలసి చదువుకొన్నందుకు , దగ్గర,దగ్గర విద్యాలయాలలో( ఒకరు భట్టిప్రోలు ,మరొకరు ధూళిపూడి)  చేరాము. దాని ఫలితంగా 36.సం .కళాశాల లోనే ఉన్నట్లు అనిపించింది .    

24, డిసెంబర్ 2012, సోమవారం

గోపూజ .

                             గోపూజ
 గవాం అన్గేషు స్థితః  సర్వే దేవతః అహం పూజ యామి

ఇది వేద గాయత్రీ అగ్రహారమందలి పవిత్ర గో పూజ

గోవును పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లే . .గోవులు బ్రాహ్మణులు, మహిళలు ,ఎచట పూజింప బడతారో అచట సమస్త శుభాలు జరుగుతాయి.
  










                ఆటవెలది 

గంగి గోవు పాలు గరిటెడైనను చాలు
కడివె డైన నేమి ఖరము పాలు 
భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు 
విశ్వదాభి రామ వినుర వేమ.

ఈ వేమన గారి పద్యం అందరి యెడల సార్థకం కావాలని కోరుకుందాం . సర్వే జనాః సుఖినో భవంతు .సర్వే భద్రాణి పశ్యంతు. 

                                        

            ప్రేమికుల దినోత్సవ సందర్భంగా. గో కౌగిలి. 
         14.02.2023.

అమ్మపాల రుచిని నందలేనటువంటి
           మందభాగ్యునకిది మాతృమూర్తి
కర్షక జీవుల కాడికి కోడెల
           నందించి కాపాడు నమృతమూర్తి
భూసారముంబెంచి ముక్కారు పంటల
             సంపదల్ నింపెడు సాధుమూర్తి
పుణ్య గోమాతయై ముట్టుకొన్ననె చాలు
             స్వర్గమందించు నిస్స్వార్ధమూర్తి
  ఆమె యెవ్వరో యననేల యమలదివ్య
  కామధేనువు సంతతి కరుణనిలయ
  పరమ ప్రేమామృతంబను వర్షమిచ్చి
  తనియజేసెడు శ్రీలక్ష్మి ధన్యురాలు
  కౌగిలింతల మునుగంగ కదలిరండు!                                          

21, డిసెంబర్ 2012, శుక్రవారం

పరిమళించిన కవితా హృదయం

పరిమళించిన కవితా  హృదయం     తేది 21.12.2012. రంగారెడ్డి జిల్లా ఈనాడు పేపర్ లో పడింది .ప్రపంచ తెలుగు మహా సభల సందర్భముగా మాబోటి వారికి ఒక నూలుపోగు .అంటే చిన్నపరిచయం ..యింటికి వెతుక్కొంటూ వచ్చిన సాహిత్యాభిమానం . వ్యాస కర్త  ఈ నాడు విలేఖరి చిరంజీవి నంద కిషోర్ 

29, ఫిబ్రవరి 2012, బుధవారం

చిరునవ్వు

చిరునవ్వు  ...చిరునవ్వు , 

నవ్వులన్నిటిలో ఆకర్షణీయ మైనది. నవ్వులలో చాలా రకాలున్నాయి. హాసము, మంద హాసము, వికటాట్ట హాసము. హాసము అంటే దంతములు కనబడేటట్లు , నవ్వటం . మంద హాసమంటే దంతములు కూడా కనబడ కుండా నవ్వటము.యిదే చిరునవ్వు . శరీరమంతా చలించే టట్లు  నవ్వ టము .మన సాహిత్య లోకంలో నవ్వు నాలుగందాల చేటు అంటారు . దీనికి కారణం రామాయణంలో రామ పట్టాభిషేక  సమయానలక్ష్మన స్వామి , నవ్వటం . ( లక్ష్మణుడు తన పదునాలుగేండ్ల రామసేవా సమయంలో రాని నిద్రాదేవత యిప్పుడు ,పట్టాభి షేక  సమయంలో వచ్చిందనే భావనతో నవ్వాడు .,) అది అందరికి అన్యార్థం తోచి మనసులలోనే ఆశ్చర్యం వ్యక్తం చేసారు . మంద హాసం చేసి ఉంటె అలాంటి భావం వచ్చేదే  కాదేమో . కనుక మనం మంద హాసం (చిరునవ్వు ) చేయటం ఎంతైనా మంచిది . నవ్వు నాలుగందాల అనర్థం అంటే, వికటాట్ట హాసం విపరీతార్థం యిస్తుంది. అందుకే నవ్వాలి , కానీ పరిధి దాట కుండా. నవ్వటం, యోగం, నవ్వలేక పోవటం రోగం , నవ్వించడం భోగం .

దుర్గ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు.12.05.26.

 ఆ.వె: చందమామ రేల డెందాలుమురిపించు రేయి బవలు వెల్గు రేడు నీదు మేనమామ; మనసు మెచ్చిన చెలికాడు జీవన పయనాన నావయతడు.1  సీ : ఒకచోట దుర్గమ్మ ఒకచోట ...