21, నవంబర్ 2026, శనివారం

నదీ స్నానం. సోమశిల. 21.11.26.

 .21.11.26. సోమశిల టూర్ ...నదీస్నానం, శివకేశవ దర్శనం.

 ఒక పాట. 

కేరింతలతో కృష్ణానదిలో మూడు మునుకలను వేద్దామా

శివకేశవుల దర్శనాలలో చిత్తము శుభ్రము చేద్దామా


నదీ స్నానము నమ్మిన దైవం జ్ఞానమార్గమున నిలుపునులే

వన బోనాలు వలచిన రుచులు , వహ్వా వహ్వా పసందులే


వనితలు చేసే దీపారాధన వామదేవునకు కాముతండ్రికే

పురుషులు స్త్రీలు జంపతులు పుణ్యభావనలపునీతులే


ఉపవాసాల భక్తి తత్త్వము ఉమామహేశుని దర్శనభాగ్యం

పావనజీవన ప్రయాణమునకు పరమశిష్టమౌ సౌభాగ్యం


మనముల ప్రేమే చిగురించి మనలో సుమమై విరియునులే

కార్తికస్నానపు కమ్మని పుణ్యము సర్వుల కందును సార్ధకమై.


నదీ స్నానం. సోమశిల. 21.11.26.

 .21.11.26. సోమశిల టూర్ ...నదీస్నానం, శివకేశవ దర్శనం.  ఒక పాట.  కేరింతలతో కృష్ణానదిలో మూడు మునుకలను వేద్దామా శివకేశవుల దర్శనాలలో చిత్తము శుభ...