26, ఆగస్టు 2011, శుక్రవారం

కోణార్క శిల్పి



1.తే.గీ.సూర్య దేవాలయంబు సంస్తూయమాన 
          సుప్రభా భాసితంబు సుశ్లోక భరిత 
          శ్లాఖ్యదంబు, దాని గనిన సమయమందు
          జన్మ సఫలమన్ దలతురు జగమునందు.

2.కం.  కోణార్క శిల్పి యులి పా
          షాణంబుల బుజ్జగించి సరసత మెరయన్ 
          కోణాలెన్నిట జూచిన 
          ప్రాణంబుల బోసి నింపె బ్రహ్మకు దీటై.

3.కం.  ఉలి కోపమూని శిల చెవి 
          మెలివెట్టుచు కోర్కె దీర మేలిమి శిల్పాల్  
          మలచెను నర్కుని సాక్షిన్ 
          తరమే శిల్పుల బొగడ! విధాతకు నైనన్.

4.తే.గీ సూర్య తేజానకానాడు స్రుక్కిపోయి 
          తెల్లమొగముల వేసిరి తెల్లవారు 
          కొల్లగొట్టుచు శిల్పాల నెల్లవేళ
          తస్కరించి రహస్కరు ముష్కరతను.

5.తే.గీ. భాస్కర రహిత కోణార్క భాగమంత
           వెల్గుకోల్పోయి  చీకటుల్ విస్తరింప 
           కోరి చేసిరి నైచ్యంబు కూళలగుచు
           తుచ్ఛమైనట్టి యాగ్లేయ మ్లేచ్చులకట!.

6.తే.గీ. అంధకారంబు నచ్చట నణచివేసి
           శిల్పి చరితను ఘనముగా నిల్పునట్టి
           యశపుకాంతులు సతతంబు దిశలునిండె
           ఇంత కన్ననుశిల్పుల కేమివలయు?

7.తే.గీ. ఏడుగుఱ్ఱాల రథముపై నెక్కి కరుణ
           బ్రోచుచుండెడు నాభానుమూర్తి సతము
           తనదు కిరణాల ప్రసరించి ధరణినెల్ల
           కోటికాంతుల విరజిమ్ము కోర్కె దీర!



భువనేశ్వర్ కోణార్క

భువనేశ్వర్ లో లింగరాజు ఆలయం గూర్చి ..మా భావాలు.
 ౧. తే.గీ. స్నేహ బంధంబు పెరిగి మనోహరత ,  ఒరిస రాష్ట్రాన సద్భక్తి యోర్మి కలసి ,
   కాంచగల్గితి మేమప్డు కాంక్ష దీర , లింగ రాజుని సద్దయా లీల వలన .
౨.తే.గీ . శ్రీ భువనేశ్వరీ దేవి చిర్నగవున, పత్తనంబెల్ల సద్భక్తి పరవశించే                                                        లింగ రాజ దయామృత లేశమునను.మోక్ష మబ్బును నిచ్చటి పుణ్యులకును

కోణార్క సూర్య దేవాలయం గూర్చి. ....
౩. తే.గీ ..సూర్య దేవాలయంబు సంస్తూయమాన , సుప్రభా భాసితంబు సుశ్లోక భరిత ,
శ్లాఖ్యదంబు ,దాని గనిన సర్వ జనులు , జన్మ సఫలముగా దలతురు జగమునందు . 

కాశి యాత్ర అనుభవాలు.

యాత్ర కు బయలుదేరుటకు ముందు ప్రార్థన.


౧.సీ..శ్రీ రఘు రాము సంసేవనము సతము ,పాపౌఘములనెల్ల పారద్రోలు.
        శ్రీ రమకరుణ చే సిరులెల్ల నిత్యమై ,తనివార శోభిల్లు తరములెల్ల.
        భరతుని సంస్తుతిన్ భవ బంధముల్ బాసి , అహరహమ్బుల  నెల్ల ఆర్తి దొలగు. 
       లక్ష్మను ప్రేమచే లాలిత్య మొందుచు , నిలువెల్ల నెయ్యంబు నిల్చియుండు.

తే.గీ. ఆంజనేయుని సత్కృపన్ హ్లాద  మెపుడు , భక్త జనులకు కలుగంగ పాదు కొల్పి .
      యాత్ర సఫలంబుజేయంగ.నభయ మీయ.ప్రార్ధనంబును నే జేతు ప్రామ్జలిన్ఛి 
.
 యాత్రకి మార్గ దర్శి అయిన నాయుడమ్మ ని గురించి.

౨. తే.గీ .నాయుడమ్మ యనెడు నాయక రత్నమ్ము ,  యాత్ర జేయ నన్ను పాత్రు జేసే  
         వెంక టేశ్వరుండు,విజ్ఞాన  మానిసి,  మాలకొండయార్యు మమత తోడ.

25, ఆగస్టు 2011, గురువారం

కాశి యాత్ర విశేషాలు

కాశి యాత్ర విశేషాలు ...ముందుగ భువనేశ్వర్ లోని లింగరాజు ఆలయం గురించి మా భావనలు .

౧.స్నేహ బంధంబు పెరిగి మనోహరత ,  ఒరిస రాష్ట్రాన సద్భక్తి యోర్మి కలసి ,          కాంచ గల్గితి మేమెప్డు కాంక్ష దీర .లింగ రాజుని సద్డయా లీల వలన.
                                           

23, జులై 2011, శనివారం

విశ్వ ప్రేమకు హద్దులు వినగరావు

౫. విశ్వ ప్రేమకు హద్దులు వినగరావు
     విశ్వమందున కులమత వ్రేళ్ళు త్రుంచి
    వృక్ష శాఖల నల్దిసల్ వృద్ధి  పరచి
    పూలు పూయించు మహనీయు మ్రొక్కు మెపుడు .

౬ .దైవము నరుని రూపాన దరినిజేరి
    మానవత్వంబు కరుణను మహిని జూపి                                           
    తాను లక్ష్యంబునెరవేర్చి దారిచూపి
    విశ్వ ప్రేమను చూపించె విమల మతిని .

౭.విశ్వ ప్రేమయె రూపమై విశ్వ కవిగ     
   జనన మందగ జగతిలో  జాలువారి                                                   
   ప్రేమ మధువులు కవితలై , సామవేద
 సంద్ర మందున అలలుగా సాగి పోయె.

౯.మదరు థెరిసయే త్యాగియై మమత సమత
  పంచి పెంచ  భరత భూమి  పల్లవించె 
దిక్కుమాలిన పేదలే దిక్కు మాకు
 నీవ యనుచు ముదము జెందె నేస్తులగుచు .

9, జులై 2011, శనివారం

స్నేహం


                                                 స్నేహం

తెరవు

        తెరవు 
 తెలుగు పద్యాలు పంపగా తెరవు దొరకె , మీకు తేనెలు కురియించు నింకమీద,                                                                        తెలుగు మధురిమ సతతంబు తెలియజేసి ,ముదము గూర్తునుడెందంబు మోదమలర.

             మానవత్వం 

సత్య సుందర భావన దైవ సమము.

నిత్య సత్య సేవనము నిరవద్య హృద్యము.                                                                                        మానవత్వంబు చూపంగ మార్గ మదియే

దుర్గ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు.12.05.26.

 ఆ.వె: చందమామ రేల డెందాలుమురిపించు రేయి బవలు వెల్గు రేడు నీదు మేనమామ; మనసు మెచ్చిన చెలికాడు జీవన పయనాన నావయతడు.1  సీ : ఒకచోట దుర్గమ్మ ఒకచోట ...