22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

దేవాలయానికి వెళితే దేవుని దగ్గరకు వెళ్లి నట్లేనా.

 ఉగ్ర వాదుల దుశ్చర్యలకు అమాయకులు బలి అయినందుకు విచారిస్తూ ,22..02.  13 న

చనిపోయిన వారి ఆత్మ శాన్తించాలని మనసార కొరుకొంటున్నాను . వారి వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుకొంటున్నాను .   మానవత్వం మంటకలియకుండా మమ్ములను కాపాడు భగవంతుడా                                                                      
            దేవాలయానికి వెళితే దేవుని దగ్గరకు వెళ్లి నట్లేనా. భగవంతుడిని చూచి తిరిగి యింటికి వచ్చే అదృష్టం మనకు లేదా . మతం ఏదైనా మానవత్వంతో ఆలోచించగలిగే మనసేలేదా . మనుషులు యిలా  మృగాలుగా ఎందుకు మారుతున్నారు . ఉదాహరణకి ,  భర్తృహరి గారి ఒక పద్యం చూద్దాం .

     ఉ.  గ్రాసములేక స్రుక్కిన జరా కృశమైన ,నిశీర్ణ మైన ,సా

          యాసము నైన నష్ట రుచియైన మదేభకుమ్భ  .......

అని సింహము యొక్క పరాక్రమాన్ని వర్ణిస్తూ .  అది యెంత ఆకలి వేసిన ఏనుగు కుంభ స్థలాన్ని మాత్రమె చీలుస్తుంది ,తింటుంది ,కాని గడ్డి తినదు అంటాడు . కనుక సామాన్యుల మీదకు రావటం అలాంటిదే .                     మృ గాలకున్న నీతి కూ డా మనకు లేదా . ఎంతో విజ్ఞానుల మంటూ అన్ని లోకాలికి వెళ్లి వస్తున్నాం . కాని ఏ విజ్ఞానము మనలను కాపాడలేక పోవటం దురదృష్ట కరం

హైదరాబాదు మనకు ఒక భాగ్యనగరం . అనుకునే పరిస్తితులు లేవా . ఈనాడు జరిగిన మరణ కాండ ,మారణ కాండ, దిల్శుఖ్నగర్లో జరిగిన్ది. దిల్ షుఖ్ మనిషికి పేరులో మాత్రమె మిగిలిన్ది. మరి ఇలాంటి స్తితిలో మన జీవితాలు గాలిలో దీపాలెనా .  విద్యయా వినయా వాప్తిహి  ,సాచేత్  అవినయావాహ , కిం కుర్మః కిం ప్రతి బ్రూమః  గరదాయా స్వమాతరి.  .విద్య వలన వినయాది సద్గుణాలు రావాలిదానికి బదులు దుర్గుణాలు  వస్తే అది స్వయముగా తల్లే విషం పెట్టినట్లు అవుతుంది అనేది దీని అర్థమ్. మనం ఏ స్తితిలో ఉన్నామో ఏమి అర్థం కావటంలేదు .  ఉగ్రవాదుల మనస్సులు సమగ్ర ప్రేమ ,మానవతా భావాలతోనిండి మనమందరం క్షేమంగా ఉండాలని త్రికరణ శుద్ధిగా కొరుకొన్దాము. తధాస్తు. 

17, ఫిబ్రవరి 2013, ఆదివారం

అతి సర్వత్ర వర్జయేత్

అతి సర్వత్ర వర్జయేత్ .

నమ్మి చెడ్డవాడు .......అనే సామెత భగవంతుని గూర్చి చెప్పింది . నమ్మకం వ్యతిరేక పదం అప నమ్మకం . కాని అమ్మకు వ్యతిరేక పదం నాన్న కాదు . వినియోగం విలువ తక్కువదే అయితే విలువకే విలువ తక్కువ. గుడ్డి తనం (అపనమ్మకం ) ఎక్కువ అయితేనే కదా చూపు మందగించేది .మోసగించి పై చేయి తెచ్చుకొని మోసగింప బడిన వాని ఎదాన బడి , వాడి మానసిక వేదనకు , ( ఒక్కొక్క సారి ) మరణానికి కారకుడైతే మిగిలేది పై చెయ్యి కాదు . పై లోకమే . ఈనాటి సమాజంలో

            . శ్లో ." యేన కేనాప్యుపాయేన .ప్రసిద్ధః పురుషో భవేత్ " . 


               అనే దానిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళుతున్నామని అనుకోని వెనక్కు వెళుతున్నారు. దాని సరైన అర్థం ఏ మంచి పని అయిన చేసి అని తీసుకొంటే మానవ కల్యాణం జరుగుతుంది. అలాగే నమ్మకం ,ఆశ ఉండాలి , కాని గుడ్డి నమ్మకం , అత్యాశ ,అనర్థ దాయకాలు . 

                       " అతి సర్వత్ర వర్జయేత్ " కదా . 

           ఈనాడే  కాదు ఏనాటి మోసాలకైన ,గుడ్డి నమ్మకం , (మానవుని విషయంగా)అత్యాశే కారణం. 

16, ఫిబ్రవరి 2013, శనివారం

\\నమ్మకం //మానవఖర్మం

 \\నమ్మకం // 

నమ్మకం అనేది మనిషికి చాల అవసరం . ఏ నమ్మకం అయితే మనిషికి మేలిమి బంగారం లాగా మేలు చేస్తుందో అదే నమ్మకం గ్రుడ్డిది అయితే   మనిషిని మసి చేస్తుంది. దీనికి తోడుదొంగ ఆశ . నమ్మకం మీదే ఒక ఆశ కలుగుతుంది. అయితే రెండింటిని సాలోచనాత్మకంగా , సమన్వయ పూర్వకంగా , ముందు చూపుతో , కొంత అనుభవం తో , అంతరాత్మ చెప్పే సత్యాలను నమ్ముతు అడుగులు వేస్తె అనర్థాలకి కొంత దూరంగా ఉండవచ్చు. కాని విధి మనలను కర్మానుభవం వైపే నడుపుతుంది. నమ్మకం యెంత బలమైనదో , ఆశ కూడా అంతే  బలమైనది. అందువల్ల మోసగించే వాడిదే నిరంతరం పై చేయి అవుతున్నది. దానికి తార్కాణమే కోట్లను అవలీలగా సంపాదించాలనే ఆశతో,వస్తాయనే గుడ్డి నమ్మకంతో మనం ముందుకు సాగటమే మన పతనానికి నాంది అవుతున్నది. యిలా జీవితం ఎన్ని పాఠాలు నేర్పినా మనకు రోజు కొత్తే .తప్పులను చూస్తూ కూడా తప్పులు చేయడమేనా మానవఖర్మం కాదు,కాదు మానవ ధర్మం .

5, ఫిబ్రవరి 2013, మంగళవారం

ఆహా అమ్మ భాషకు

          ఆహా  అమ్మ భాషకు అందలమట.


ఎవరి అమ్మ వారికి గొప్పే . లంకను చూచి ఆనంద పడుతూ లక్ష్మణుడు , అన్నయ్య  యిక్కడ చాలా బాగుంది , మనం యిక్కడే ఉందామా అన్నప్పుడు శ్రీరామచంద్రుడు చెప్పిన సమాధానమిది .


   శ్లో ." జననీ జన్మ భూమిశ్చ ,స్వర్గాదపి గరీయసీ,"

 అని  .  ఈ  శ్లోకానికి సార్థకత కల్పించటానికిన్నాళ్ళకు , కాదిన్నేళ్ళకి   ప్రభుత్వమే పూనుకుంటే తెలుగు భాషాభిమాను లందరకు కలిగే సంతోషం వర్ణనా తీతమే, అందరం అమ్మ ఒడిలో ఉన్నఆనందం అనుభవిస్తాము. ఇది ప్రకృతి సహజమేకదా . మనం మనలాగా ఉంటున్నందుకు ఆనందంగా లేదూ . ఈ ప్రయత్నానికి అందరం సహకరించుదాం. 

4, ఫిబ్రవరి 2013, సోమవారం

బంధాలు అనుబంధాలు


బంధాలు అనుబంధాలు 4.02.2013
.
ఇవి మనం ఊహింప గలమా.. . బంధం మనం కల్పించు కొన్నదైతే , అనుబంధం సహజ సిద్ధంగా  ఏర్పడేది . ముందుగ మనం వివాహ పరంగా ఒక బంధం ఏర్పాటు చేసుకొంటాము . సంతానం కలగటం వలన వారికొక అనుబంధం ఏర్పడుతుంది . అనుబంధానికి సంకేతమే ప్రేమ .బన్ధానిది ఒక ప్రేమ .అనుబందాని కి మరొక ప్రేమ .ఈ ప్రేమలు మానవత్వానికి ప్రతీకలుగా ఉంటె, పస్పరం అనుబంధం బలపడి, అవి  కుటుంబానికి ,సమాజానికి , దేశానికి మేలుని చేకూరుస్తాయి . అయితే సమాజంలో ఎక్కువమంది   అసూయా, ద్వేషం, అహంభావం , అనే స్వార్థభావాలు  మూలాలుగా  కలిగియుండుట చేత మనం అనుకునే అనుబంధాలు ,బంధాలు . వ్యర్థ పదాలుగా కేవలం కధలలో, కవితలలో, ఉహలలో  మిగిలి పోతున్నాయి . విడిపోతున్న బంధాలకు , అనుబంధాలకు నిస్స్వార్ధవర్తనమే సరి అయిన పరిష్కారం . జీవితం మనమూహించినంత సుదీర్ఘమైనది కాదు . కనుక యిద్దరి మనసులలో నిస్వార్థంగా , సాంఘిక మర్యాదలతో కలిగే ప్రేమ, అనేక బంధాలకు , అనుబంధాలకు సంకేతమై నిలుస్తుంది. అందుకనే హిందూ ధర్మానుసారం , ఒక వ్యక్తి తల్లి గాని, తండ్రి గాని మరణించి నప్పుడు  పేగు బంధం తెగి పోయినది అనుదానికి సంకేతం గ దీక్షా వస్త్రంలో ఒక భాగాన్ని  చింపి అతని మెడలో వేస్తారు , కార్య క్రమాలు పూర్తి   కాగానే తీసివేస్తారు . మనం వాటిని నిలబెట్టుకోకపోతే మానవత్వానికి , హిందుత్వానికి విలువ ఏముంటుంది . 

25, జనవరి 2013, శుక్రవారం

ముగ్ధ మనోహర మున్నారు

       భారతీయ సోదరు లందరికి  గణ తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
                               
ముగ్ధ మనోహర మున్నారు .    ప్రకృతి  అందాల బాల .  అందరికి  సమానంగ   ఆనందం  పంచుతుంది . మనసు.దోస్తుంది . అలాంటి సుందర , సుకుమార , ప్రాంతమే  మున్నారు .    పచ్చికల, పచ్చదనము  తేయాకుల,  పచ్చదనం , నీల కురుంజి పూల నీలం , కొండలపై వినీల   ఆకాశం , మమ్ములను పరవసిమ్ప జేసాయి .

     ఎటు చూచినా తమనీడలను    సముద్రపు నీటిలో  చూచుకునే  నారికేళ వృక్షాలు , సందర్శకుల   బోటుషికార్లు అలెప్పికి  దైవ మిచ్చిన  వరాలు .  ఆ  అనుభ వాలు .  నా  బ్లాగ్ లో పంచుకుందాం. 

24, జనవరి 2013, గురువారం

ఎరావికులం నేషనల్ పార్క్




ఎరావికులం నేషనల్ పార్క్ :- మున్నారు :-నుండి  15కి.మీ. దూరంలో,97.కి.మీ. వైశాల్యంతో  ఉన్నది .ఇచటి ప్రత్యేక  జంతువు నీలగిరిటార్ ( మేకవంటి జంతువు ).ఈ పార్కులో  అసాధారణమైన శీతాకోకచిలుకలు,జంతువులు ,పక్షులున్నాయి .నీలకురింజి పూలు ,కొండవాలులలో మనకు ప్రత్యేక  దర్శనమిస్తాయి .నీలి రంగు పరదా కప్పినట్లున్నది  .పశ్చిమ కనుమలలోనే కనుపించే ఈ నీల కురింజి 12 సంవత్సరాలకొకసారి వికసిస్తుంది .ఇది 2006లో వికసించినట్లు చెప్పారు . మరల 2018లో మనం వానిని చూడవచ్చు .ఇచట పలురకాల టీ పాకెట్లు అమ్ముతారు .వివిధమైన తేనీరు మనం రుచి చూడవచ్చు. ( ఖరీదు చెల్లించి ). రు 7.కె మనకు పెద్దగ్లాసు         తే నీరు వస్తుంది . మున్నార్ నుండి మనం కేరళ ప్రభుత్వమేర్పాటు చేసిన వాహనాలలోనే పార్కుకి వెళ్ళాలి ఇచటి డ్రైవర్ల ప్రతిభ వర్ణణాతీతం . ఈమాత్రం పొరబాటు జరిగిన మనం కీర్తి శేషులము కాగలము. వారి చేతులలో ప్రతి సారి 30 మంది ప్రాణాలు .వారికి, భగవానునకు మనం కృతజ్ఞులం. ఈ పార్క్ లోనే అనేక ఓషధులున్నాయట .
  టాప్  స్టేషన్ .:- మున్నార్ నుండి 3 మీ.కి. దూరంలో కలదు .ఇది మున్నార్ కొడైకెనాల్ రహదారిలోనున్న ఎతైన ప్రదేశం . ఇక్కడనుండి తమిళనాడును చూడవచ్చు .నీలకురింజి పూలిచట విస్తారంగా ఉంటాయి. దీని శాస్త్రీయ నామం ":స్ట్రాబిలాంతస్ కున్తియానా" .
   పల్లివాసన్ :-కేరళలోని మొదటి విద్యుత్ ప్రణాలికా  కేంద్రం. చిన్నకసల్
  అనునది 2000మీ .ఎత్తునుండి పడే జలపాతం .ఎతిరాపల్లికి 10కి.మీ.
  దూరం లో ఉండే మనోహర జలపాతం .దానిని చూడగానే మా మనసులు
ఈ విధంగా స్పందించాయి .
  సీ .జలపాతముంజూడ ,తలపున మెరయును ,బమ్మెర కవిశ్రేస్టు భక్తి  రసము
       జలపాతముంగాంచ చక్కగ వెల్గును , రవి వర్మ కుంచెన రంగులన్ని
          జలపాతమున్గన్న తలపోయగానగు , స్వామి నరేంద్రుల స్థాయి ఎంతో
          జలపాతమున్దల్ప జాణయౌ బ్రహ్మను , స్వ్మరియిమ్పజాలక సాగలేము  .
తే.గీ . ఎదిరపల్లికి చేరువన్నెగసి పడెడు ,  జలధి సోయగమేమని చాట గలము ?
ప్రకృతి అందాలు భావింప పరవశించు , మనసు తనువెల్ల పులకించి మధుర మగును.

  అలెప్పి.:-ఇది ఎర్నాకులం నుండి 50 కి.మీ దూరంలో నున్న ( బ్యాక్ వాటర్ ) సముద్రపు నీరున్న ప్రాంతము .ఇందులో బోటు షికారు చేస్తారు . బోటులోనే                                     మనయింటిలో మాదిరిగా  సమస్త
సౌకర్యాలుంటాయి. ఈ బొట్లు మనమిచ్చే  డబ్బునుబట్టి ఉంటాయి . రాత్రులందు                                      అందులో నివాసముండే అవకాశముంటుంది .ఆబోటులో ఒక డ్రైవరు ,వంట మనిషి ,                                          ఒక సహాయకుడు ఉంటారు . ఉదయం 8.గం.లకు .అల్పాహారము . మధ్యాహ్నం
2.గం.లకు . భోజనముంటుంది . సముద్రపు నీటిఒడ్డునే చిన్నచిన్న గ్రామాలున్నాయి .
అచ్చటి నారికేళ వృక్షాలు మన సరిహద్దులను  కావలి  కాచే సిపాయిల మాదిరిగా ,
ఒకే వరుసలో ఇరుప్రక్కల ఉండి వాటి క్రమ శిక్షణ ను నీటిలో తొంగి చూసుకుంటున్నాయి
ఆ ప్రకృతి  మనోహర సోయగాలు అవ్యక్త మధురాలు . అనిర్వచనీయాలు,అనుభవైక
బోధ్యాలు. అచటి వంట మాత్రమె కాక .అనాస పండు కోసి పెట్టిన తీరు మమ్ములనెంతో 
 అబ్బురపరచింది . కేరళ నావలు నడిపే పందాలకు ప్రసస్తి. అందుకే ఒకనాటి ఉదయమే
అచటికి విద్యార్థులు వచ్చి నావలను నడుపుతున్నారు. అందులో బాలికలున్డటం ,
విశేషం .వారికి తగిన సూచనలివ్వటానికోక యిద్దరు ఉపాధ్యాయులు వచ్చారు .         అలెప్పి ని చూచినపుడు మా భావమిలాఉన్నది .

సీ. సంద్రంపు నీటిలో సాగిపోవ నా బోటు,సందర్శకాళికి సంతసంబు ,

     అలలపై తేలెడి అందాల అలెపియే ,హృదయంత రాళాల హత్తుకొనును,
    ఆదరమ్బును జూపి యజమాని రప్పించి, ఆనందపర్చు నాయలెపిబోటు,  
    అనుభవించినకొద్ది ఆహ్లాదమిచ్చును ,మధుర యానంబును మరువలేము
తే.గీ .నారికేళపు వృక్షాల నడుమనున్న,బోటు వరుసల శోభల పోల్చగల్గు,
   పదములున్డునే తెలుగునపారజూడ,కాంచగల్గుటయొక్కటే ఘనతయౌను.  

 " ఏటి ఒడ్డు  వారికి నీటి భయం , కాటి ఒడ్డు వారికి చావు భయం ఉండదంటారు "అక్షర సత్యం అనిపించింది.
         16 వ తేది అలెప్పి లో గడపి . 17 ఉ. ఎర్నాకులం వచ్చి. బొట్ మెరైన్ చూచి
ఆ రాత్రి బెంగుళూరికి  తిరుగు ముఖం పట్టాము . మా కన్నా మా పిల్లలు ఎక్కువ
ఆనందాన్ని అనుభవించారు. సహజమేకదా .  మరొకసారి వెళ్లి వచ్చిన  అనుభవాలతో కలుద్దాం .
 నమస్తే.      
   
 .

దుర్గ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు.12.05.26.

 ఆ.వె: చందమామ రేల డెందాలుమురిపించు రేయి బవలు వెల్గు రేడు నీదు మేనమామ; మనసు మెచ్చిన చెలికాడు జీవన పయనాన నావయతడు.1  సీ : ఒకచోట దుర్గమ్మ ఒకచోట ...