తెలుపు భాష . తెలుగు భాష
వేద విదులు మెచ్చు విబుధ భాష
పాల తెల్ల దనము , పసిపాప నవ్వులు,
కలిపి తెలుపు భాష తెలుగు భాష .
4. తెలుప గల్గు నన్ని తేటతెల్లము గాగ,
నిలుప గల్గు నిన్ను నింగి కంట ,
తులువ లెన్ని మనల దుర్భాష లాడిన ,
తూచ నలవి కాని తూర్పు కొండ .
5. దాని గుండె తెలుపు , ధర్మసూక్ష్మము లెన్నొ
, దాని మోము తెలుపు ధైర్యమెంతొ
దాని పనులు తెలుపు దార్శనికంబని ,
తెలుగు భాష యదియె వెలుగు భాష .
1. గిడుగువారి భవ్య కృషిసారఫలితమై
పండితేతర జన భాషయయ్యె
తెలుగు సరళమౌచు తేనెలుకురియించె
రామమూర్తి వరుడు రమ్యగుణుడు.
2. గిడుగు నడచినట్టి యడుగులజాడయే
భవ్య మగుచు వెలుగు బాటయయ్యె
వారి జన్మదినపు వైభవమందున
నిండుదండమిడుదు నెమ్మనాన.
3. విశ్వ మంత కాంతి విరజిమ్ము నాభాష ,
వేద విదులు మెచ్చు విబుధ భాష
పాల తెల్ల దనము , పసిపాప నవ్వులు,
కలిపి తెలుపు భాష తెలుగు భాష .
4. తెలుప గల్గు నన్ని తేటతెల్లము గాగ,
నిలుప గల్గు నిన్ను నింగి కంట ,
తులువ లెన్ని మనల దుర్భాష లాడిన ,
తూచ నలవి కాని తూర్పు కొండ .
5. దాని గుండె తెలుపు , ధర్మసూక్ష్మము లెన్నొ
, దాని మోము తెలుపు ధైర్యమెంతొ
దాని పనులు తెలుపు దార్శనికంబని ,
తెలుగు భాష యదియె వెలుగు భాష .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి