21, ఫిబ్రవరి 2020, శుక్రవారం

డా. ప్రతాప దీక్షితులవారిపై స్పందన

శ్రీశ్రీశ్రీ ఆదిశంకర ప్రతిరూపులు డా॥ ప్రతాప దక్షిణామూర్తి దీక్షితుల
          వారి పాదపద్మములకు "అక్షర నీరాజనములు"
             
ఉ: సత్య శివాత్మకంబయిన చక్కనిమోమది స్ఫూర్తిమంతమై
      నిత్యము భారతీయ ఘన నిర్మల వేద సునాద మోదమై
      ప్రత్యణువందు మీ సరళ రమ్య సుశోభిత భాషణమ్ములే
      స్తుత్య పథమ్ములై వెలుగు"సుందరదీక్షిత వర్య"మేదినిన్.
చం: అడగిన నార్షసంపదను హైందవతత్త్వ వివేచనంబులన్
       నడచెడు శంకరార్యువలె నాణెముగా విశదీకరించుచున్
       పుడమిని జ్ఞానశూన్యుల సుబుద్ధి నిబద్ధులజేయు తేజమై
      యడుగులు వేయుచున్న పరమాత్మ!నమస్సులు స్వీకరింపుమా
ఉ: వేదము,విద్య,వైద్యములు విస్తృతరూపమునంద శక్తిమై
      పేదలు భాగ్యవంతులను భేదమొకించుకలేక విజ్ఞులై
      మోదమునందగా దగిన పూర్ణవికాస మనోజ్ఞ క్షేత్రముల్
      పాదుగజేసినారుగద!వందనముల్గొనుడార్య సద్గురూ!
ఉ: వేదమె యాత్మయై పరగ,పీల్చెడు వాయువు ధర్మరూపమై
      నాదవినోదియై సకల నైష్టిక జీవుల ప్రేరకంబుగా
      మోదమునందు మీ పరమపూజ్య విశేష విలాస దీధితుల్
     హ్లాదముగూర్చు సంతతము హాటకగర్భునిరాణి యంశజా!
చం: నడకనె శక్తి పీఠములు జ్ఞానవిరాజిత మోక్షగాములై
       తడయక నూటయెన్మిదిని దర్శనమందిన దీక్షితాగ్రణీ!
       కడు విభవంబు మీకమరె కన్నులపండువెయయ్యె నిండుగా
       తడిసితిరమ్మ సత్కృపను ధన్యులు మీరలు భక్తశేఖరా!
       ది.19.02.2020                      సభక్తి సమర్పణ:

కామెంట్‌లు లేవు:

కోకిల పై మత్తకోకిల పద్యాలు.

 రసజజభర....11. కాకిరం గునుబో లియున్న ను,కావు కావనిబల్కవే నాకెక మ్మనికం ఠముంద నినాట్య మాడెదు గర్వమున్ సోకులా డివిమా యలాడి వి, చోర విద్యను ప్ర...