16, ఆగస్టు 2020, ఆదివారం

స్వాతంత్ర్య దినోత్సవం. 20.

 అందరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.15.08.2026.

భరతమాతనుగూర్చి పాడంగ నాగొంతు

                గంభీరమైతోచి గర్వమగును

    భరతవీరుల త్యాగ వైభవంబులజాట

        బులకించి నాగుండె మోదమగును

         భారతి గర్భాన ప్రభవించ నాజన్మ

        తరియించె ననగను తలపులగును

 భారత సంస్కృతిం బరదేశములయందు 

                   శ్రేష్ఠత జాటంగ నిష్ఠయగును

      అట్టి భరతాంబ శృంఖలల్ అన్నిదిశల

           తెగిన పుణ్యదినంబిది తేజమలర

       త్యాగధనులకు శిరము నతంబుజేసి

       జెండ పండుగ జరుపగ రండు రండు! 

       మూడు రంగుల జెండాకు మ్రొక్కుదాము

         తూలనాడెడు ద్రోహుల త్రొక్కుదాము

        నేను భారతీయుడనంచు నిక్కుదాము.

       అమ్మ భరతాంబ పూజించు హక్కుమనది.


కామెంట్‌లు లేవు:

నదీ స్నానం. సోమశిల. 21.11.26.

 .21.11.26. సోమశిల టూర్ ...నదీస్నానం, శివకేశవ దర్శనం.  ఒక పాట.  కేరింతలతో కృష్ణానదిలో మూడు మునుకలను వేద్దామా శివకేశవుల దర్శనాలలో చిత్తము శుభ...