21, డిసెంబర్ 2012, శుక్రవారం

పరిమళించిన కవితా హృదయం

పరిమళించిన కవితా  హృదయం     తేది 21.12.2012. రంగారెడ్డి జిల్లా ఈనాడు పేపర్ లో పడింది .ప్రపంచ తెలుగు మహా సభల సందర్భముగా మాబోటి వారికి ఒక నూలుపోగు .అంటే చిన్నపరిచయం ..యింటికి వెతుక్కొంటూ వచ్చిన సాహిత్యాభిమానం . వ్యాస కర్త  ఈ నాడు విలేఖరి చిరంజీవి నంద కిషోర్ 

19, డిసెంబర్ 2012, బుధవారం

అమ్మ

తెలుగు బాసల యాసలు తెలుపుచుండు, తెలుగు బంగారు తీగను తెంపి తెంపి ,ఎన్ని నగలను జేసిన ఎట్టులైన ,     విలువ మారదు తగ్గదు విభవమందు .

                                                              అమ్మ పాట 

అమ్మ కరుణ నాకుంటే అవలీలగ  పాటలొచ్చు  ,    అమ్మ కరుణ నాకుంటే అలవోకగ    మాటలొచ్చు  ,   అమ్మ దయయె   నాకుంటే ఆశువుగా పద్యమొచ్చు .అమ్మ కృపయె   నాకుంటే  అనగరాని దేముందీ  , అమ్మ చూపు  నాకుంటే జగమంతట జయమే ,అమ్మ మనసు నావెంటే  నాకెందుకు భయము  , అమ్మ మదిని తడివి చూడ  అమృతంపు ధారలే  . కమ్మగ అవి  త్రాగితే అసహాయపు ధీరులే    , ఆ అమ్మే వీణ పాణి , ఆ అమ్మే నలువ రాణి . మరువబోకు ,మరువబోకు  ,మహిమలన్నీ ఆమేవే . పాదకమల సేవజీసి ప్రాంజలించు భక్తి తోడ. 

18, మే 2012, శుక్రవారం

భావన

  భావన .  మానవుని మనుగడకు సమాజ శ్రేయస్సు ఒక దివ్య ఆయుధం . ఏ మానవుడు ఎక్కువగా సమాజాన్ని గురించి ఆలోచిస్తాడో అతని మనుగడకి , జీవితానికి ఒక అర్థం ఒక పరమార్థము ఉంటుంది . మాములు ఆయుధాలకి  పదును పోయే అవకాసం ఉన్నది . ఈ మహా ఆయుధానికి సేవ చేసిన కొలది పదునేక్కుతుంది ..కనుకనే అందరు ఈ ఆయుధాన్ని ధరించి దుర్మార్గ , నీచ భావాలకు ఆలవాలమైన  ప్రతి ఒక్కరి మనస్సులలో నున్న స్వార్థ పూరిత విష వృక్షాలను చ్చేదించాలి . నిరంతరం ఆనందాన్ని ప్రసాదించే కల్ప వృక్షాలను పెంచి పోషించాలి . ఎవరి హృదయము లో నిరంతరం నిశ్చల , నిర్మల , భావాలు ఉంటాయో  వారి హృదయమే దేవాలయం . భావమే మహోత్క్రుస్ట దైవము .  

తృప్తి

తృప్తి   మానవునకు ఏంతో ఆనందాన్ని స్తుంది ,ఒకరికి మానసికంగా , మరోకరికి శారీరకంగా. శారీరకంగా  పొందే తృప్తి తత్కాలికమే . మానసికం మరువలేని శాశ్విత ఆనందాన్ని యిస్తుంది . సాధారణ మానవులు శారీరకమే కోరుకొంటారు . మహాత్ములు మానసికం కోరుకొంటారు . మహాత్ములకు , సాధారణ మానవులకు ఉన్న తేడ  కేవలం మనస్సు . మనస్సు కోరికల పుట్ట . తీర్చటం మొదలు పెడితే కోరటం ఆపదు . క్రమంగా కొన్ని అయిన తీర్చకుండా మనసును మనం అరికడితే , క్రమంగా అది మన దారికి వస్తుంది . దానికి మనకు జ్ఞానము అవసరం . జ్ఞానములోనే విచక్షణ ( చేయ తగిన, తగని పనులు ) ఉంటుంది . జ్ఞానమునకు మూలము గురువు . వారివలన ఒక వంతు వస్తుంది .మిగిలిన మూడు తోటి విద్యార్థులతో ,స్వ శక్తి తో , కాల క్రమము లో వస్తుంది . శ్లో .....ఆచార్యాత్   పాదమాదత్తే  , పాదం శిష్య స్వ మేధయా .పాదం స బ్రహ్మచా రిభ్యః ,  పాదం కాలక్రమేణ  చ .  కనుక సంపూర్ణ జ్ఞానం రావాలంటే  మానసిక పరిపూర్ణత రావాలి . దానికి కొంత అయిన దైవ ఆరాధన , ఆత్మ స్థైర్యం , సేవానురక్తి , పెద్దల యెడ ప్రేమానురాగాలు . అవసరం . ఇలాంటి మనసు తో మనం అందరం తృప్తి గ ఉందామా . ప్రయత్నం చేసి చూడడం తప్పులేదు .

5, మార్చి 2012, సోమవారం

భయం

భయం ...భయం ...భయం ...


మనసును బాధపెట్టే దేనిని చూచిన భయమే. సంతోషాని కి వ్యతిరేక పదమే ఈ భయం . ముఖ్యంగా ప్రతి జీవికి మరణం అంటే( మృత్యువు) భయం . మనం సహజంగా దేన్ని చూచి భయపడతామో  అదే నిరంతరం మనలను చూచి కవ్విస్తుంది. మన వెంట పడుతుంది ఆంటాడు ఒక మహా కవి . నిజమేమరి సమాజం లో కూడా అదే జరుగుతున్నది . ఎవరు    ( ధర్మ అధర్మ విచక్షణతో ) భయపడతారో వారినే ఎదుటివారు భయపెడతారు . ఎదురు తిరిగేవారిని ఎవరు భయపెట్టలేరు. ఉదాహరణకు మన వెంట ఒక శునకం వెంట పడితే ....మనం భయపడి పరుగిడితే అది వెంటపడుతుంది. అది భయపడి పరుగిడితే మనం వెంట పడతాము .

    మరి ఏసంగతి అయిన యింతే అనుకుంటే పనులు చాల సులువు అవుతవి . మన భయం మరణం గురించి కనుక మనమే దానికి ఎదురు తిరిగితే సరి. అంటే ఆధ్యాత్మకముగా మనసును ధైర్యం చేస్తే మరణం అంటే భయం ఉండదు. యిది ఏనాటికైనా నిత్య సత్యము. కనుక  ఒంటరిదానినని మనసు భావించకుండా దానికి ఏదో ఒక దైవ శక్తిని జోడిస్తే అది ధైర్యం పుంజుకొని మరణాన్ని సైతం జయిస్తుంది. వేదాంతం కాదిది నిజంగా నిజం.  

1, మార్చి 2012, గురువారం

వృక్షో రక్షతి రక్షితః

వృక్షో రక్షతి రక్షితః ...

వృక్షములను మనము రక్షిస్తే అవి మనలను రక్షిస్తాయి. అవి  నిస్వార్థ జీవులు. త్యాగ జీవులు. మన మనుగడ, శ్వాస పైనే ఆధారపడి 
యున్నది. అలాంటి శ్వాసను ( ఆక్సిజన్ ) ప్రతి ఫలాపేక్ష లేకనే  యిచ్చి వాటి త్యాగమయ జీవితాన్ని రుజువు చేసుకొంటున్నాయి వృక్షాలు. అందుకనే ఒక మహాకవి , 

           పరోపకారాయ వహంతి నద్యః , పరోపకారాయ  దుహన్తి గావః ,
           పరోపకారాయ  ఫలంతి వృక్షః . పరోపకారార్థం  యిదం శరీరం.

(పరోపకారం కొరకే నదులు , ఆవులు , వృక్షాలు , మహాత్ములు .పాటు పడుతున్నారు ) అన్నాడు . మహాత్ములావిధం గానే ఉంటారు. వారు  మేలు చేసి మరచి పోతారు. వారిని  మరచి పోయినచొ  వారిపట్ల మనం కృతఘ్నులమే .  కొందరు చెట్టంత పెరుగుతారు కాని చెట్టుకున్నంత  జ్ఞానాన్ని , త్యాగ గుణమును   పొందలేరు. 
అది వారి వారి జన్మ సంస్కారం. అంతేకదా మరి.మనందరం అలా కాకుండా ఉందామా . 

29, ఫిబ్రవరి 2012, బుధవారం

చిరునవ్వు

చిరునవ్వు  ...చిరునవ్వు , 

నవ్వులన్నిటిలో ఆకర్షణీయ మైనది. నవ్వులలో చాలా రకాలున్నాయి. హాసము, మంద హాసము, వికటాట్ట హాసము. హాసము అంటే దంతములు కనబడేటట్లు , నవ్వటం . మంద హాసమంటే దంతములు కూడా కనబడ కుండా నవ్వటము.యిదే చిరునవ్వు . శరీరమంతా చలించే టట్లు  నవ్వ టము .మన సాహిత్య లోకంలో నవ్వు నాలుగందాల చేటు అంటారు . దీనికి కారణం రామాయణంలో రామ పట్టాభిషేక  సమయానలక్ష్మన స్వామి , నవ్వటం . ( లక్ష్మణుడు తన పదునాలుగేండ్ల రామసేవా సమయంలో రాని నిద్రాదేవత యిప్పుడు ,పట్టాభి షేక  సమయంలో వచ్చిందనే భావనతో నవ్వాడు .,) అది అందరికి అన్యార్థం తోచి మనసులలోనే ఆశ్చర్యం వ్యక్తం చేసారు . మంద హాసం చేసి ఉంటె అలాంటి భావం వచ్చేదే  కాదేమో . కనుక మనం మంద హాసం (చిరునవ్వు ) చేయటం ఎంతైనా మంచిది . నవ్వు నాలుగందాల అనర్థం అంటే, వికటాట్ట హాసం విపరీతార్థం యిస్తుంది. అందుకే నవ్వాలి , కానీ పరిధి దాట కుండా. నవ్వటం, యోగం, నవ్వలేక పోవటం రోగం , నవ్వించడం భోగం .

దుర్గ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు.12.05.26.

 ఆ.వె: చందమామ రేల డెందాలుమురిపించు రేయి బవలు వెల్గు రేడు నీదు మేనమామ; మనసు మెచ్చిన చెలికాడు జీవన పయనాన నావయతడు.1  సీ : ఒకచోట దుర్గమ్మ ఒకచోట ...