29, ఆగస్టు 2011, సోమవారం

గయ, వారణాశి

గయలో పొన్నెకంటి సూర్య నారాయణ రావు . పితృ దేవతలకు పిండ ప్రదాన

 మొనర్చి వదలిన వస్తువులు 

తే.గీ ౫. సూర్య నారాయనాఖ్యుండ సూరి వరుడ .
             నేను రంభాఫలంబును, ఇష్టమైన 
             చేమ మద్దిపత్రంబును చివరి దనుక 
             వాడనంచును పల్కితి వాస్తవముగ

బుద్ధ గయ నుండి ....వారణాశి కి చేరిన తరువాత .

కాశి . వారణాశి  ,బెనారస్ .ఒక్కటే .  కాశి లో స్నానం ...ఫలం.

  కం. ౧. గంగా తరంగ డోలిక
            సంగాతమ్ము నే నరుండు సంతస మొప్పన్ 
            భంగంబు గాని భంగిమ 
            లింగార్చన జేయునతడు  లీలన్ శివుడౌ.

తే. గీ ,౨. గంగ మునుగంగ పాపాలు నింగి  కెగయు ,

              గంగ తాకంగ కవితలే పొంగి పొరలు .

             గంగ తలుపంగ తలపులే చెంగలించు , 

             గంగ మహిమలు తెలుపంగ ఘనులు గలరే ? 

కామెంట్‌లు లేవు:

దుర్గ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు.12.05.26.

 ఆ.వె: చదల రేయి వెల్గు చందమామొకడుండె రేయి బవలు వెల్గు రేడు నీదు మేనమామ; మనసు మెచ్చిన చెలికాడు జీవన పయనాన నావయతడు.1  ఒకచోట దుర్గమ్మ ఒకచోట సత్...