29, ఆగస్టు 2011, సోమవారం

గయ,, బుద్ధ గయ

బుద్ధ గయని చూచినప్పటి మా భావనలు ... బుద్ధుడు

 హిందూ మతము ననుసరించి విష్ణు అవతారము .

తే గి ౧.  జీవితంబున మోక్షంబు చేరు కొరకు, 

            సత్య శోధన యొక్కటే మార్గ మనుచు

           బోధి వృక్షంపు నీడన పూర్ణ భక్తి ,

           తత్వ జ్ఞానంబు నెరుగగ  తపముజేసె.

౨.         పట్టువీడని పంతాన పరమహంస,

             రూపు గాంచెను బుద్ధుడు చూపునిలిపి,

             అనిమిశున్డయ్యె  నాటితో నద్భుతముగ.

              దివ్య శక్తికి మించిన దేది కలదు ?

౩.           విష్ణు రూపుండు బుద్ధుండు వేద విదుడు, 

             ధర్మ తత్వంబు జీవికి తరచి చూపి
 
              ముక్తి మార్గంబు కల్పింప పూనుకొనియె, 

              స్వార్థ చింతన లేనట్టి సాధు మూర్తి.

కామెంట్‌లు లేవు:

పెనుమర్తి శేఖర్ పదవీవిరమణ.

 పెనుమర్తి శేఖర్ పదవీవిరమణ. 30.05.2026. శ్రీలగురియించు చిన్మయ చేతనంబు నాల్గువేదాల వారాశి నలువరాణి అత్తగారైన శ్రీదేవి యవనరతము "శేఖరు...