2, మార్చి 2010, మంగళవారం

About ME

 గుంటూరు జిల్లా పొన్నెకల్లు లో పుట్టి  గుంటూరు కే.వి.కే..సంస్కృత కళాశాలలో 5.సంవత్సరములు సాహితీ మాగాణపు సాగులో  ఆంద్ర విశ్వ విద్యాలయపు  టర్హతాపత్రము(భాషాప్రవీణ ) పొంది, మరల బి,ఓ ,యల్,   . ఎం .ఏ .,(తెలుగు)చేసి  ధూళిపూడి విద్యాలయములో విద్యార్థుల ,గ్రామ పౌరుల హృక్షేత్రాలలో తెలుగు బీజాలు నాటి నాల్గు పదుల కాలాలు నలువ రాణి పాదపద్మ రజోలేశ స్పర్శ చే సాహితీ వనంలో ఫల, పుష్పములు కాయించి, పూయించి ,పదుగురికి పంచి, పంచుతున్న వనమాలిని. సాహితీ రూపకాలు ( భువన విజయము ), అవధానాలు  ,కవితా సదస్సుల లో పాల్గొనే చొరవ , అనుభవమున్నది. రచనా వ్యాసంగం యిష్టమైన ప్రక్రియ. 

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...