తడవర్తి బాపయ్య ఉన్నత పాఠశాల శత వసంత
మహోత్సవము సందర్భముగా వ్రాసిన పద్యాలు.
1. సీ. ఎచ్చోట జదివిన నింజనీర్లై వెల్గి
దేశదేశాలకు థిషణ పంచు
ఎచ్చోట దిరిగిన నింతింత యెదుగుచు
పదిమంది కాదర్శప్రాయులగును
ఎచ్చోట నాడిన నీశ్వరు సైతము
గిర్రున ద్రిప్పుచు గెల్వ గలరు
ఎచ్చోట నేర్చిన నే భాషలోనైన
పరదేశ వాసుల మురియజేయు
ఎచ్చోట మెలగిన నెంతటి కష్టంబు
సహనంబుతోడను సరకుగొనడు
ఎచ్చోట నెరిగిన ప్రేమానురాగముల్
విశ్వవ్యాప్తంబయి వినుతిగాంచు
ఎచ్చోట సంగీత శిక్షణల్ పొందిన
విఖ్యాతిగన్నట్టివిబుథుడగును
తే.గీ. అట్టి ఘనతకు కాణాచి యవనియందు
"థౌతపురి పాఠశాల"యే ద్యోతమగును
సందియంబేల! మదినింక సరసహృదయ!
సత్యమియ్యది యెందైన చాటగలను.
2.సీ. శ్రీలకు నిలయమై చిరునవ్వు పంచుచు
ధర్మార్థములబెంచు "ధౌతపురిని"
గాంథిజి యాత్రలో కాంచన రాసులన్
దానమ్ముజేసిన "థౌతపురిని"
సాంఘిక కార్యాలు శతవిథమ్ములుగాగ
దారిజూపిన ఘన "థౌతపురిని"
రాజకీయములందు రాటుదేలినయట్టి
ధన్యమూర్తులగన్న "థౌతపురిని"
తే.గీ.కల్పవృక్ష సదృశమన నల్పమెయగు
నంతకన్నను మిక్కిలి యనగదగును
వాణి ,శర్వాణి ,లక్ష్ముల పాదస్పర్శ
అణువునణువున నచ్చోట నందగింప.
3.సీ. "బాపయ్య శ్రేష్ఠిదౌ "భవ్యసంకల్పాన
వాణి వేవేల నాల్కలన్ వరలెనచట
"బాపయ్య శ్రేష్ఠిదౌ "భావనాబలమున
కోదండరాముని కోవెలమరె
"బాపయార్యుని "ధర్మపావన గుణాన
అన్నసత్రమచట నవతరించె
"బాపయ్య"యోచనన్ భాసురమైనట్టి
వాసంతశోభిత వనము వెలసె
తే.గీ. "బాపయార్యుడు" తద్ధర్మ పత్ని సుగుణ
. విలసిత మతులైన కతన కలసి మెలసి
ధర్మకామ్యార్థసిద్ధులై ధరణిబరగి
నింగికేగిరి విమల వినీతులగుచు
4.ఆ.వె. "ముళ్లపూడివారి "మోదంపు చట్టునై
ఒనర "థౌతపురిని "నొజ్జనైతి
ఎన్ని జన్మలెత్తి యేరీతిగురువుల
ఋణముదీర్చుకొందు క్షణముక్షణము
5.ఉ.పొందితి బాలబాలికల పూర్ణమనోజ్ఞ విశాలప్రేమలం
బొందితి యాజమాన్యపు ప్రమోదము, నా క్రమశిక్షణమ్మునన్
బొందితి గారవంబులిల పోరులుసల్పుచు కావ్యచర్చలన్
పొందితి సర్వసౌఖ్యము లపూర్వముగాగ కవీంద్రుకైవడిన్
6.ఆ.వె. "థూళిపూడి "చరిత ద్యుమణి వెల్గుల నింపి
రచనజేసి తదియ రసమయముగ.
" తాళమ"దయజూప ధన్యుడనయి
శతకమల్లుకొంటి శాశ్వతముగ.
7.తే.గీ. తల్లికరుణన దనరారి ధన్యుడనయి
ప్రగతిబాటను జేపట్టి ప్రజ్జ్వలించి
ఎల్లజనులకు నుల్లంబు పల్లవింప
"థౌతపురి "యందు ప్రేమను తనిసినాను.
8.ఆ.వె. "మొదలి"వంటివారి మోహనాస్త్రంబులన్
"వేంకటేశ"వరుల విజ్ఞత లను
పరమనియమమూర్తి "బ్రహ్మయ్య"భాషలన్
నేర్చుకొంటి నేను నేర్పుమీర.
9.తే.గీ. "క్రొత్తమాష్టరనగ "కూర్చుంటి నిచ్చోట
వివిధ భాషలందు విజ్ఞులుండ
వారి ప్రేమగొనుచు వర్థిల్లి వర్థిల్లి
ఇంతవాడనైతి వింతగాదె?
10.ఆ.వె. సానబట్టి నన్ను చక్కని యొజ్జగా
చెక్కినట్టి గురుల చిత్తమందు
మరువబోనుగాక మరుజన్మనైనను
పాదమంటి ప్రతిన బల్కుచుంటి.
మహోత్సవము సందర్భముగా వ్రాసిన పద్యాలు.

దేశదేశాలకు థిషణ పంచు
ఎచ్చోట దిరిగిన నింతింత యెదుగుచు
పదిమంది కాదర్శప్రాయులగును
ఎచ్చోట నాడిన నీశ్వరు సైతము
గిర్రున ద్రిప్పుచు గెల్వ గలరు
ఎచ్చోట నేర్చిన నే భాషలోనైన
పరదేశ వాసుల మురియజేయు
ఎచ్చోట మెలగిన నెంతటి కష్టంబు
సహనంబుతోడను సరకుగొనడు
ఎచ్చోట నెరిగిన ప్రేమానురాగముల్
విశ్వవ్యాప్తంబయి వినుతిగాంచు
ఎచ్చోట సంగీత శిక్షణల్ పొందిన
విఖ్యాతిగన్నట్టివిబుథుడగును
తే.గీ. అట్టి ఘనతకు కాణాచి యవనియందు
"థౌతపురి పాఠశాల"యే ద్యోతమగును
సందియంబేల! మదినింక సరసహృదయ!
సత్యమియ్యది యెందైన చాటగలను.
2.సీ. శ్రీలకు నిలయమై చిరునవ్వు పంచుచు
ధర్మార్థములబెంచు "ధౌతపురిని"
గాంథిజి యాత్రలో కాంచన రాసులన్
దానమ్ముజేసిన "థౌతపురిని"
సాంఘిక కార్యాలు శతవిథమ్ములుగాగ
దారిజూపిన ఘన "థౌతపురిని"
రాజకీయములందు రాటుదేలినయట్టి
ధన్యమూర్తులగన్న "థౌతపురిని"
తే.గీ.కల్పవృక్ష సదృశమన నల్పమెయగు
నంతకన్నను మిక్కిలి యనగదగును
వాణి ,శర్వాణి ,లక్ష్ముల పాదస్పర్శ
అణువునణువున నచ్చోట నందగింప.
3.సీ. "బాపయ్య శ్రేష్ఠిదౌ "భవ్యసంకల్పాన
వాణి వేవేల నాల్కలన్ వరలెనచట
"బాపయ్య శ్రేష్ఠిదౌ "భావనాబలమున
కోదండరాముని కోవెలమరె
"బాపయార్యుని "ధర్మపావన గుణాన
అన్నసత్రమచట నవతరించె
"బాపయ్య"యోచనన్ భాసురమైనట్టి
వాసంతశోభిత వనము వెలసె
తే.గీ. "బాపయార్యుడు" తద్ధర్మ పత్ని సుగుణ
. విలసిత మతులైన కతన కలసి మెలసి
ధర్మకామ్యార్థసిద్ధులై ధరణిబరగి
నింగికేగిరి విమల వినీతులగుచు
4.ఆ.వె. "ముళ్లపూడివారి "మోదంపు చట్టునై
ఒనర "థౌతపురిని "నొజ్జనైతి
ఎన్ని జన్మలెత్తి యేరీతిగురువుల
ఋణముదీర్చుకొందు క్షణముక్షణము
5.ఉ.పొందితి బాలబాలికల పూర్ణమనోజ్ఞ విశాలప్రేమలం
బొందితి యాజమాన్యపు ప్రమోదము, నా క్రమశిక్షణమ్మునన్
బొందితి గారవంబులిల పోరులుసల్పుచు కావ్యచర్చలన్
పొందితి సర్వసౌఖ్యము లపూర్వముగాగ కవీంద్రుకైవడిన్
6.ఆ.వె. "థూళిపూడి "చరిత ద్యుమణి వెల్గుల నింపి
రచనజేసి తదియ రసమయముగ.
" తాళమ"దయజూప ధన్యుడనయి
శతకమల్లుకొంటి శాశ్వతముగ.
7.తే.గీ. తల్లికరుణన దనరారి ధన్యుడనయి
ప్రగతిబాటను జేపట్టి ప్రజ్జ్వలించి
ఎల్లజనులకు నుల్లంబు పల్లవింప
"థౌతపురి "యందు ప్రేమను తనిసినాను.
8.ఆ.వె. "మొదలి"వంటివారి మోహనాస్త్రంబులన్
"వేంకటేశ"వరుల విజ్ఞత లను
పరమనియమమూర్తి "బ్రహ్మయ్య"భాషలన్
నేర్చుకొంటి నేను నేర్పుమీర.
9.తే.గీ. "క్రొత్తమాష్టరనగ "కూర్చుంటి నిచ్చోట
వివిధ భాషలందు విజ్ఞులుండ
వారి ప్రేమగొనుచు వర్థిల్లి వర్థిల్లి
ఇంతవాడనైతి వింతగాదె?
10.ఆ.వె. సానబట్టి నన్ను చక్కని యొజ్జగా
చెక్కినట్టి గురుల చిత్తమందు
మరువబోనుగాక మరుజన్మనైనను
పాదమంటి ప్రతిన బల్కుచుంటి.