
శ్లో. గురుర్ బ్రహ్మ , గురుర్ విష్ణుః , గురుదేవో మహేశ్వరః
గురుస్సక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః . )
శ్లో. అజ్ఞాన తిమిరాన్ధస్య జ్ఞానాం జన శాలాకయా
చక్షు రున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః .
మాతృ దేవో భవ, పితృ దేవో భవ ,ఆచార్య దేవో భవ, అతిధి దేవో భవ .
జన్మ నిచ్చిన తల్లి ప్రధమ గురువు . నడక నేర్పిన తండ్రి ద్వితీయ గురువు .నడత నెర్పుతూ , జ్ఞాన భిక్ష పెట్టె వారు త్రి గుణ రూపులైన వారు తృతీయ గురువులు. భగవత్ స్వరూపులైన వారు , హిందూ సంప్రదాయానికి ప్రతీకలైన వారు, తురీయ గురువులు . ఎందరో మహాను భావులు అందరికి వందనములు .
అకలంకంబగు నక్షరంబులను , సర్వార్ధ్హార్ధ సిద్ధం బుగాన్ ,
సుకరం బయ్యెడి రీతిగా మదికి సంస్తూయాత్మ పాండిత్యమున్,
సకలంబున్ దయ జూపి నేర్పిన గురుస్స్వాముల్ విచారింప ..నా
కొకరా యిద్దర ముగ్గురా నలుగురా ఉన్నార లెందెందరో .