23, డిసెంబర్ 2019, సోమవారం

సురభి పై స్పందన

సురభిగారి అవధానమునకభినందన పద్యము.

  సీ : చిరునవ్వు చిందించి స్నేహపరీమళ
                       మీనుపుష్పవనమె తాను సురభి
         సాంఘిక విషయాల సంస్కారవంత స
                 త్కవితల మురిపించు కవియె సురభి
         అవధాన విద్యలో నద్భుత భావాల
                చురుకుగా కురియించు సురభిశర్మ
          నవనవోన్మేష విజ్ఞాన దీధితులెల్ల
                   ప్రసరించు భాస్కరవరుడు సురభి
  తే.గీ: అష్ట పృచ్ఛకాళి కిష్టమౌ ఛందాల
           సుందరసుకుమార   సొబగులలర
           పద్యరాశి సభల ప్రభవించు సురభిరో
           వాణి చరణకరుణ వరలుగాత!

     ఉ: రూపము సుందరంబగు స్వరూప స్వభావ సుభావజాలమే
        ఆ పరమేష్టి జిహ్వపయి హాయిగ నాట్యముజేయు వాణియౌ 
        ఏపదమెంచిజూచిన ననేక విశేష సమాశ్రయంబుగా
        శ్రీపదమై వెలుంగ పరమేశ్వరు డోముత శంకరార్యునిన్.

    తే.గీ: వాణి పాదాల సేవలో వరలుచుండి
             జ్ఞాన వృద్ధుల విజ్ఞాన సారమంది
             ఆయురారోగ్య భాగ్యాలనందుచుండి
             సద్యశుండౌచును "సురభి" సాగుగాత!

              వేదిక: ఓంకారనగరం(కోహిర్)
              ది.19.02.2020                       ‌‌‌‌ఆత్మీయతతో
              భాగ్యనగరం.          పొన్నెకంటి సూర్యనారాయణ రావు

   అలిగిన పార్వతిని బుజ్జగించు శివునిపై
     నా స్పందన.

    తలపైనున్న సురాపగందలచి నీదైనట్టి రాగంబునున్
    కలలోసైతము త్రుంచరాదనుచు శ్రీకంఠుండు గౌరీసత
    న్నలకల్మాన్పగ బుజ్జగించుచును దివ్యౌన్నత్యముం             జూపెగా
    కులకాంతల్కను లెర్రజేయపతికిన్
గోప్యంబె యభ్యాసమౌ.
 కవి రామశర్మ గారి అభినందనపై స్పందన.

    రామ నామాఖ్య సత్కవిరాడ్వరేణ్య!
    పద్యవిద్యను రాణించు పండితార్య!
    పద్యతోరణ సన్మిత్ర ప్రాజ్ఞతముడ!
    ధన్యవాదాలు గైకొండు మాన్యచరిత!

    అమ్మకరుణను జూపించు నంతదనుక
    బుధులు నిష్కర్ష దీవించ పుష్టినొంది
    పద్య సుమముల మాలను భారతాంబ
    పాదములచెంత నుంతునో పరమపురుష!

 
         

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...