కృతజ్ఞతాంజలులు.
"సూర్యశ్రీరామం" వచనరచనాలోచన నాకు గల్గించిన "శ్రీ సీతారాముల
పాదపద్మములకు మున్ముందు ప్రణామములర్పించుకొనుచున్నాను.
నేను నా "సూర్యశ్రీరామం" రామాయణ వచన కావ్యమునకు మున్నుడి
వ్రాయించుకొనుటకు స్వయముగా తమ దగ్గరకు వస్తానని చెప్పిన వేళ
శిష్యవాత్సల్యముతో "ఈ మండుటెండలలో రావలదని ,పుస్తకము పూర్తి
అయిన తరువాత రావచ్చున"ని చెప్పి నిరంతరం సాహితీసేవలో మునిగి
యుంటు నన్నాశీర్వదిస్తు, గ్రంథసమీక్షచేసి వాట్సాప్ ద్వారా పంపిన బహు
గ్రంథకర్త, బహు సన్మానములను కేంద్ర రాష్ట్రములనుండి పొందిన మాన్య
మా గురుదేవులు ఆచార్య డా. బేతవోలు రామబ్రహ్మం మాష్టారు గారికి
అనేకానేక కృతజ్ఞతాభివందనములు. "నవరత్నమాలిక" పేరుతో నన్ను నా గ్రంథమును గూర్చి చక్కని చిక్కని శైలితో తొమ్మిది పద్యరత్నములను భ్రాతృ వాత్సల్యముతో వ్రాసియిచ్చిన నా ప్రియతమ సోదరులు చిత్రకవితాసమ్రాట్ శ్రీయుతులు చింతా రామకృష్ణా రావు గారికి ధన్యవాదశతములు. "సూర్యా
రామం" పేరుతో నన్ను నా రామాయణమునభినందించుచు లోతైన భావాలతో
తమ యమూల్యాభిప్రాయమును వ్రాసియిచ్చిన నా సంస్కృత కళాశాల
సహాధ్యాయి, మధురకవితా విశారదులు , నిరంతర పద్యరచనాసక్తులు
డా. రామడుగు వేంకటేశ్వర శర్మగారికి ధన్యవాదశతములు. "సంకల్పసిద్ధుడు"
పేరుతో నన్ను నా రామాయణము నభినందించుచు చక్కని పద్యములను
వ్రాసియిచ్చిన నా సీనియర్ ఆంధ్రోపాధ్యాయుడు,విషయపరిశీలనలో రచనలో సహాయపడిన మిత్రుడు శ్రీ జొన్నలగడ్డ జయరామ శర్మగారికి ధన్యవాదాలు.
"మరోవాల్మీకం, సూర్యశ్రీరామం"పేరుతో తమ చక్కని చిక్కని సరససుకుమార
భావాలతో ఆంధ్రప్రభ సీనియర్ ఎడిటర్ గా అనుభవాలను రంగరించి విశ్లేషణను సుదీర్ఘంగా అందించిన మా గౌరవనీయ బావగారు"శ్రీవైయస్సారెస్"
గారికి నమోవాకములు. నా సంస్కృతకళాశాల సహాధ్యాయి , భువనవిజయ
సభలలో మంత్రితిమ్మరుగా ఖ్యాతినందిన నా సోదరుడు నన్ను గురించి నా
సూర్యశ్రీరామం గురించి విశ్లేషణాత్మక అభిప్రాయము నందించినందులకు
మనసా ధన్యవాదాలు. చిరకాల సాహితీమిత్రులు ,అష్టావధాని, టి.వి. మాధ్యమంగా నిరంతరం సాహితీసేవ చేస్తూ నాకును అందు అవకాశం కల్పించిన నా సోదరుడు శ్రీ సురభి శంకరశర్మ గారు కోరగనే అభిప్రాయము
వ్రాసిపంపినందులకు ధన్యవాదాలు.
నా "సూర్యశ్రీరామం" ఆలోచనల నుండి అక్షరాచరణ రూపం వఱకు, గ్రంథ
రూపం వచ్చుటకు ముఖ్యకారకురాలు నా అర్ధాంగి "శ్రీమతి ఇందిర". నా పలుకులో పలుకై పదములో పదమై భావములో భావమై కథాంశమును టైపు చేయుటలో నిరంతర భాగస్వామి యై సంపూర్ణ గ్రంథనిర్మాణమునకు పూనుకొనినందులకు శుభాభినందనలు శుభాశీస్సులు. అటులనే నా అల్లుడు
కుమార్తె, కొడుకు, కోడలు, మనుమరాండ్రు, మనుమడు సూర్యశ్రీరామం
గ్రంథ రూపం ధరించుటకు ఎంతో ఉత్సాహ ప్రోత్సాహములనిచ్చుట ముదావహము. వారెల్లరకు నా శుభాశీస్సులు.
నా యీ గ్రంథమును అందముగా ఆకర్షణీయముగా ముద్రించిన చిరంజీవి
నరసింహ కు శుభాశీస్సులు.
ప్రథమ ముద్రణము....క్రోధి. మార్గశీర్షము. (డిశంబరు 2024)
కాపీలు ..1000.
కాపీ రైట్స్....... చి.ల.సౌ. మాచిరాజు రాధిక. చి. పొన్నెకంటి అరుణ్ కిరణ్.
గ్రంథముల ప్రాప్తి స్ధానము.
ఫోన్. నం. 98666735. 9866675770.
విశ్వకళ్యాణ-"సూర్య-రామాయణ" జ్యోతి.
తే.గీ: శ్రీ"రమాపద్మ"ల హృదయసీమలో -న
లంకరించు -"శ్రీ కళ్యాణ వేంకటేశ్వ
రుండు"-దివ్య శేషాద్రి వాసుండు - శుభము
లొసగి - "సూర్య సత్కవిచంద్రు" నోముగాక!...1
తే.గీ: రమ్యమౌ"తెలుగు కవితారామ"మైన
భారత సనాతనార్ష సువర్ణ శిఖరి
"గర్తపురి"ప్రాచ్యవిద్యార్థి ఘనయశుండు
"సూర్యనారాయణార్యుడు""సుమధురకవి"...2
తే.గీ: "పొన్నెకంటి" వంశసుధాబ్ది - పూర్ణకీర్తి
చంద్ర - "సూర్యనారాయణు" స్వర్ణ- రామ
తారకాక్షర"దివ్యమంత్ర జపఫలము-
భవ్య "సూర్య-రామాయణ" భక్తిసుకృతి....3
తే.గీ: సద్గురు కరుణాపాత్రులు; సంస్కృతాంధ్ర
పండితులు; ఆర్ద్రహృదయులు; భక్తిధనులు
"రామకథ"ను - "శ్రీ సూర్యనారాయణ కవి"
"తెలుగు వాల్మీకి"యై పల్కె, తీయగాను....4
తే.గీ: "ఒంటిమిట్ట" కళ్యాణమహోత్సవంపు
మూర్తులైన - "సీతారామ" పూజ్యపాద
పద్మ పీఠార్పితమగు - కావ్యమ్ము! భక్తి
అక్షరసుమమ్ము! - "సూర్యరామాయణమ్ము"..5
తే.గీ: భవ్యవేద పురాణ సద్భావఝరిగ
సకలకవి, పండిత జనరంజకముగాను
రమ్య "రామాయణ" సుకృతి - రచనచేయ
ధరను- "సూర్యకవి" "కలమ్ము"- ధన్యమయ్యె..6
తే.గీ: జనని "గాయత్రి" మంత్రబీజాక్షరయుత
సప్తకాండ సమన్విత - స్వర్ణరమ్య
"సూర్య - రామాయణజ్యోతి" సుకృతి - ప్రతి
గృహాన - "కళ్యాణ దీపమై" అలరుగాత!..7
తే.గీ: "కనకదుర్గమ్మ" "మల్లేశు కరుణసుధలు
యాదగిరి "శ్రీనృసింహ" దృక్చందనాలు;
"సీతరామచంద్రుల"-పెండ్లి సేసలెపుడు
భువిని "సూర్యేందిర"ల - సదా బ్రోచుగాక!..8
కం: " సూర్య" సుహృదయ శ్రీకృత
" సూర్య శ్రీరామ" రమ్య సుకృతి సుధలిలన్-
ఆర్యజన కల్పలతలై
" సూర్య"ప్రభలలరుదాక - శుభములొసగెడిన్.9
1-01-2025. శుభంభూయాత్!
హైదరాబాద్. మీ ఆత్మీయ "కళ్యాణశ్రీ"
జంధ్యాల వేంకటరామశాస్త్రి.
"ఆర్ష సాహితీ రత్న".9640321630.