అమ్మ పిలిచింది భయం లేదు రారా యని.
23.08.2015.
నేనే స్వయముగా కారు నడుపుకొంటూ వెళ్లి బెంగుళూరు లోని వైష్ణవీ మాతని దర్శించుకోవాలని నాకు ఉబలాటం . వెళ్ల లేనేమో నని భయం. నిత్యం భయానికి, ధైర్యానికి మధ్య .పోరాటం జరుగుతూనే ఉంటుంది .ఏది ఎక్కువ శాతం ఉంటే అదే జరుగుతున్ది. మన భయమేమిటంటే , అపజయం పొందుతామేమో అని ..అపజయము, విజయము అమ్మ స్తన్యం త్రాగే టప్పటి నుండే మొదలు. అమ్మ ఆశీస్సులే విజయానికి మూలమ్.అపజాలే విజయాలకు సోపానాలు . అందుకే ధైర్యే సాహసే లక్ష్మీ అన్నారు పెద్దలు. అమ్మ వైష్ణవి ని కొంచెం ధైర్యం ప్రసాదించమని అడిగాను, ఆమెని దర్శిం చుకోవటాని కే. ధైర్యం యిచ్చింది అమ్మని దర్శించి క్షేమం గా వచ్చాను.
ధైర్య మన్నది సతతంబు కార్య విజయ ,
హేతు వగునోయి మిత్రమ సేతు లంఘ
నంబు నవలీల గావించె హనుమ నాడు .
పిరికి తనమును మదినుండి పెరుక వలయు .
హేతు వగునోయి మిత్రమ సేతు లంఘ
నంబు నవలీల గావించె హనుమ నాడు .
పిరికి తనమును మదినుండి పెరుక వలయు .