2, జూన్ 2020, మంగళవారం

తెలంగాణ. స్పందన.

పద్యాలతోరణం..2.06.2020.
          తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.
           నా స్పందన..మీపొన్నెకంటి.

          తూర్పుకొండల జీల్చి సందోహమెలర
          బాలభానుని పగిది సంభ్రమముగూర్ప
          ఘనము గాదెచ్చె నవ తెలంగాణ మనగ
          చంద్రశేఖరుడనియెడు సారయశుడు.

          మనసు మెదలిన భావాల మధురగరిమ
          పాట రూపాన మలచుచు పరవశించి
          నృత్య భంగిమల్ వెలయింత్రు కృష్ణుపగిది
          కవులు  గాయకతతికి మా గాణమిదియ.
         

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...