వర్ణనలు
6. పృ :- కళ్యాణ ప్రభాకర రావు .
వి. :- వేంకటేశ్వర స్వామి స్తుతి. పదాలు. 1. మల్లి. 2. జాజి. 3. బంతి . 4. కేతకి . చంపక మాల వృత్తం లో.
చం . నిరతమహింస " మల్లి"యగ నిత్యపు సత్యపు " జాజి " పువ్వు గా
పరమ సు నిగ్రహంబు రస భాసురమౌ ఒక "బంతి "పువ్వుగా
నిరుపమ శౌచ "కేతకి "ని నిశ్చల మిన్ద్రియమన్న మొల్లలున్
తిరుపతి వేంకటేశ్వర పదే పదమై రచియింతు మాలికన్ .
7. పృ :- బి. వెంకట్ .
వి. :- పర దేశం వెళ్ళిన కొడుకును గురించి తల్లి ఆవేదన .
తే . గీ. :- పొరుగు దేశాలలో నున్న పుత్రులెల్ల
సౌఖ్య సంతోషముల తోడ సాగి వచ్చి
విజయ విభవైక రీతి జీవింతు రింక
రమ్య మాతృకా ప్రేమ శ్రీ రామ రక్ష.
8. పృ :- డా . శ్రీమతి , మంగళగిరి ప్రమీలా దేవి .
వి. :- వెన్నెల పాటకు పద్యమ్.
తే . గీ. :- కలువ చంద్రునికై రేయి కలవరించు .
కలల చంద్రుని ప్రేమగా కళ ఫలించు .
దూరమే లేదు ప్రేమ సంసార మందు .
జగతి ప్రేమించు నా జన్మ సఫలమందు ..
9. పృ :- చంద్ర శేఖర శర్మ .
వి. :- పర బ్రహ్మ తత్త్వమౌ దక్షిణా మూర్తి , నాగ ఫణి శర్మ గారయి పాడితే ? పద్యం .
తే . గీ. :- దక్షిణా మూర్తి యా మౌన దీక్ష వీడి
ధన్య రాగాల గళ మాల తాన మనగ
ఉపనిషద్గీత లోకమ్ము లొదుగ పాడు .
జ్ఞాన వైరాగ్య మవధాన జ్ఞాన మనగ .
10. పృ :- ఆత్రేయ శర్మ .
వి. :- లైఫ్ ఆఫ్ పై . చిత్రం లో ఒంటరి కుర్ర వాని మనోభావ తరంగాలు .
తే . గీ. :- ఇలకు వచ్చిన ప్రతివాని నెంచి చూడ
ఒంటరియె వాడు దేవుని నంట వఱకు .
కరుణ ఏకాగ్ర మైన ఏకాకి ఎవరు ?
సాగి పై స్థాయి నందు నీ సాగరమున .