బాల భావన శతకం. గురించి రామకృష్ణా రావు గారు జగమెరిగిన చిత్రకవి, విచిత్ర కవి. వారి భావనలు మధుర మనోహరాలు సుకుమారాలు , సమాజ చైతన్య స్పోరకాలు. వారు నన్ను సోదరునిగా భావించి తాను వ్రాసిన బాల భావనలు అను శతకానికి అభిప్రాయం వ్రాయమనుట చాలా సంతోషంగా ఉన్నది.. బాల బాలికలు మనకు అన్ని భావాలు పైకి చెప్పరు కాని చాల సున్నితం గ ఆలోచిస్తారు. రావు గారు వారిలో( పిల్లల్లో ) దూరి వారి స్థాయిలో , శైలిలో చెప్పిన పద్యాలు ఆణి ముత్యాలు. నేటి సమాజానికి ఏది కావాలో అదే చెప్పారు. 4 వ పద్యంలో . ముద్దు చేసి మాకు హద్దులు నేర్పరు-----. హద్దు మీర మమ్ము గ్రుద్దుదురయ.--- హద్దు లెల్ల నేర్ప శ్రద్ధ గా నేర్వమా ----పెద్దలారజ్ఞాన వృద్దు లార . . అంటూ ఆడుతూ పాడుతూ ఆట వెలదులలొ చెప్పారు . మొక్క అయి వంగనిది మ్రానై వంగునా అనే ప్రాచీన సూక్తి యిందులో దాగి ఉన్నది. ముద్దు హద్దు మీర రాదనే విషయం నిత్య సత్యం.
7 వ పద్యం లో . పలక చేతికిచ్చి పద్యాలు వ్రాయించి -----పలుకునటుల జేయ పలుక గలము ---పద్యమొక్కటైన పలుక నేర్ప రదేల. అంటారు. నేటి భాషామతల్లి అందున తెలుగు భాష ఈ విషయం లో ఏటికి ఎదురీదుతున్నది. వీలయినంత వరకు పిల్లలకు తెలుగు పలుకుబడి బడి లోనే కాక యింటిలో కూడా నేర్పాలి. ముఖ్యంగా అమ్మే యీపని చేయాలి. ఆనాడే భారత మాతృ.హృదయం సంతోషిస్తుంది .అమ్మఒక శతకం చదివితే పిల్లలకు చెప్పినట్లే . ఎంత సమాజ స్పృహ . ఇది అందరికి రావాలని కవి గారి తపన.
9.వ పద్యం లో . మాకు నచ్చు విద్య మమ్మన్దుకొనీక------మీకు నచ్చుదాని మాకు పులుమ -----మాకు రాక పోవు మాదోషమా యిది . ------- నిజమే మనకు నచ్చిన పనిని చాల సులువు గ చేస్తాము . నచ్చని పని కేవలం పరుల కొరకే . ఈనాడు చాల మంది విద్యార్ధులు పడుతున్న పట్లే యివి. వారికీ స్వేఛ్చ యివ్వాలని కవి సూచన బాలల పట్ల సద్భావన .
ఇలా ఎన్నో సుకుమార సుందర భావాలతో సమ సమాజ నిర్మాణానికి , దేశ సమైక్యతకు పునాది రాళ్ళు అయిన బాలలకు , మంచి సూచనలతో శతకం వ్రాసిన రామ కృష్ణారావు గారు మిక్కిలి అభినంద నీయులు.
సారస్వత సహోదరుడు. పొన్నకంటి సూర్య నారాయణ రావు. భాగ్యనగరం. .