టాప్ స్టేషన్ .:- మున్నార్ నుండి 3 మీ.కి. దూరంలో కలదు .ఇది మున్నార్ కొడైకెనాల్ రహదారిలోనున్న ఎతైన ప్రదేశం . ఇక్కడనుండి తమిళనాడును చూడవచ్చు .నీలకురింజి పూలిచట విస్తారంగా ఉంటాయి. దీని శాస్త్రీయ నామం ":స్ట్రాబిలాంతస్ కున్తియానా" .
పల్లివాసన్ :-కేరళలోని మొదటి విద్యుత్ ప్రణాలికా కేంద్రం. చిన్నకసల్
అనునది 2000మీ .ఎత్తునుండి పడే జలపాతం .ఎతిరాపల్లికి 10కి.మీ.
దూరం లో ఉండే మనోహర జలపాతం .దానిని చూడగానే మా మనసులు
ఈ విధంగా స్పందించాయి .
సీ .జలపాతముంజూడ ,తలపున మెరయును ,బమ్మెర కవిశ్రేస్టు భక్తి రసము
జలపాతముంగాంచ చక్కగ వెల్గును , రవి వర్మ కుంచెన రంగులన్ని
జలపాతమున్గన్న తలపోయగానగు , స్వామి నరేంద్రుల స్థాయి ఎంతో
జలపాతమున్దల్ప జాణయౌ బ్రహ్మను , స్వ్మరియిమ్పజాలక సాగలేము .
తే.గీ . ఎదిరపల్లికి చేరువన్నెగసి పడెడు , జలధి సోయగమేమని చాట గలము ?
ప్రకృతి అందాలు భావింప పరవశించు , మనసు తనువెల్ల పులకించి మధుర మగును.

అలెప్పి.:-ఇది ఎర్నాకులం నుండి 50 కి.మీ దూరంలో నున్న ( బ్యాక్ వాటర్ ) సముద్రపు నీరున్న ప్రాంతము .ఇందులో బోటు షికారు చేస్తారు . బోటులోనే మనయింటిలో మాదిరిగా సమస్త
సౌకర్యాలుంటాయి. ఈ బొట్లు మనమిచ్చే డబ్బునుబట్టి ఉంటాయి . రాత్రులందు అందులో నివాసముండే అవకాశముంటుంది .ఆబోటులో ఒక డ్రైవరు ,వంట మనిషి , ఒక సహాయకుడు ఉంటారు . ఉదయం 8.గం.లకు .అల్పాహారము . మధ్యాహ్నం
2.గం.లకు . భోజనముంటుంది . సముద్రపు నీటిఒడ్డునే చిన్నచిన్న గ్రామాలున్నాయి .
అచ్చటి నారికేళ వృక్షాలు మన సరిహద్దులను కావలి కాచే సిపాయిల మాదిరిగా ,
ఒకే వరుసలో ఇరుప్రక్కల ఉండి వాటి క్రమ శిక్షణ ను నీటిలో తొంగి చూసుకుంటున్నాయి
ఆ ప్రకృతి మనోహర సోయగాలు అవ్యక్త మధురాలు . అనిర్వచనీయాలు,అనుభవైక
బోధ్యాలు. అచటి వంట మాత్రమె కాక .అనాస పండు కోసి పెట్టిన తీరు మమ్ములనెంతో
అబ్బురపరచింది . కేరళ నావలు నడిపే పందాలకు ప్రసస్తి. అందుకే ఒకనాటి ఉదయమే
అచటికి విద్యార్థులు వచ్చి నావలను నడుపుతున్నారు. అందులో బాలికలున్డటం ,

సీ. సంద్రంపు నీటిలో సాగిపోవ నా బోటు,సందర్శకాళికి సంతసంబు ,
అలలపై తేలెడి అందాల అలెపియే ,హృదయంత రాళాల హత్తుకొనును,
ఆదరమ్బును జూపి యజమాని రప్పించి, ఆనందపర్చు నాయలెపిబోటు,
అనుభవించినకొద్ది ఆహ్లాదమిచ్చును ,మధుర యానంబును మరువలేము
తే.గీ .నారికేళపు వృక్షాల నడుమనున్న,బోటు వరుసల శోభల పోల్చగల్గు,
పదములున్డునే తెలుగునపారజూడ,కాంచగల్గుటయొక్కటే ఘనతయౌను.
" ఏటి ఒడ్డు వారికి నీటి భయం , కాటి ఒడ్డు వారికి చావు భయం ఉండదంటారు "అక్షర సత్యం అనిపించింది.
16 వ తేది అలెప్పి లో గడపి . 17 ఉ. ఎర్నాకులం వచ్చి. బొట్ మెరైన్ చూచి

ఆనందాన్ని అనుభవించారు. సహజమేకదా . మరొకసారి వెళ్లి వచ్చిన అనుభవాలతో కలుద్దాం .
నమస్తే.
.