

సర్వేజనాః విజయ వాసంత శుభ కామనః
11. 04. 2013
ప్రతి ఉగాది ప్రకృతి ని కను విందు చేస్తుంది
తన నూతన చేతనత్వంతో ,
ఈ యుగాది విజయ నామ ధారియై ,
సకల జీవ రాశులకు విజయ రహదారియై ,
మందార మకరంద సుధామయ జీవితాలలో .
సుధలు చిలకాలని నాంది పలుకుతుంది ..
విజయం వినటానికి చాల బాగుంటుంది . ,
కఠోర పరీక్షల విశ్లేషణ లేకుంటే .
విజయమా అనటానికి బలే బాగుంటుంది ,
అప జయాల ఊసులు లేకుంటే ,
విజయం సు వ్యసనమ్ అయితే ,
పరాజయలన్నీ దుర్వ్యసనాలే .
విజయానికి అలవాటు పడిన ప్రాణి ,
ప్రాణం పోయిన అపజయానికి ఒప్పుకోదు .
వసంతం లోని ప్రతి విజయ చిహ్నమైన ,
చివురు వెనుక బలహీనపు పండుటాకు ఉంటుంది ...
ప్రకృతి తన ధర్మంగా ఒక్కొక్క కాలంలో ,
ఒక్కొక్క దానికి ప్రతిభ,వ్యుత్పత్తి ,కాంతుల నిమ్పుతున్ది.
వసంత ఋతు రాజు కర్తవ్యమ్ గా చరాచర జగత్తుకు ,
ఈనాటి నుండి నూతన శోభలను విజయ పరమ్పరలనన్దిస్తాడు .
వసంత లక్ష్మీ శోభాయమాన సదృశ సహృదయులన్దరకు
విజయ, ఆయు రారోగ్య ఐశ్వర్యా లను ప్రకృతి మాత ప్రసాదిస్తుంది .
మారిన కాలం తో మనం మారి కల కాలం ధర్మా చరణ తో ,
ప్రకృతి మాత పాద పద్మ రజోలేశాలను ,
మన శిరస్సుల ధరిద్దాం , పునీతులమౌదామ్.
। । సర్వే జనాః విజయో భవంతు । ।