ఫేస్ బుక్ లోని విషయం . 11... 20.
11. కం తుప్పల దాగిన సర్పము , చెప్పుల శబ్దంబు తాకి చెంగున నెగురన్
ముప్పని నెఱిగిన శ్రీహరి , తప్పక సమరమును జేయదగుగా నరయన్ .
12. కం. కప్పము పేరిట ప్రజలను , తిప్పలు బెట్టంగ జూచు తిమ్మిరి రాజున్
ఎప్పగిది జూడ నిరతము , తప్పక సమరమును జేయదగుగా నరయన్ .
13. కం. తప్పుల తడకలు వ్రాయుచు , చెప్పిన నర్థంబు కాని శిష్యుని భాషన్
గొప్పగ దీర్చగ నొజ్జకు , తప్పక సమరమును జేయదగుగా నరయన్ .
14. కం. ఒప్పుల తప్పుల దేల్చెడి , నిప్పును న్యాయాధిపతియె నేరముజేయన్
విప్పుచు నాతని చరితము ,తప్పక సమరమును జేయదగుగా నరయన్ .
15. కం. గొప్పగు కళలను నేర్వగ, మెప్పించుచు సద్యశమ్ము మేలునుబొందన్
అప్పా యేరికి నైనను , తప్పక సమరమును జేయదగుగా నరయన్ .
16. కం. గుప్పెడు మనమును కదలక , నొప్పుగ నుండగజేయు నోర్పది కలుగన్
గొప్పగు సద్గురువైనను , తప్పక సమరమును జేయదగుగా నరయన్ .
17. కం. నొప్పుల కూర్చిన తరుణి కి , రెప్పలు వాలంగ నపుడు రేయింబవలున్
తిప్పలు మోడలింది రాగా , తప్పక సమరమును జేయదగుగా నరయన్ .
18. కం. ఎప్పుడు కాలమును బట్టని ,తప్పొప్పులు తెలియరాని తామస గుణికిన్
ముప్పుగా కవితలు వ్రాయగ ,తప్పక సమరమును జేయదగుగా నరయన్ .
19. కం. చెప్పిన నీతులు వినకను, దెప్పుచు నేనాటి ఘటనొ తిరిగెడు వానిన్
ఎప్పట్టుననైన నె దురుచు , తప్పక సమరమును జేయదగుగా నరయన్ .
20. కం. తప్పది తనపై మోపుచు, ముప్పును కలుగంగజేయు మేరకు మిత్రున్
ఒప్పు నిరూపింప సతము , తప్పక సమరమును జేయదగుగా నరయన్ .