5, ఏప్రిల్ 2019, శుక్రవారం

2024.క్రోధి. 23. శోభకృద్రాణి. ప్లవ ఉగాది, 2021..13.4.21.వికారి, ఉగాది శుభాకాంక్షలు.2019-20.

                     క్రోధికాహ్వానం 2024-25.
"శ్రీక్రోధి" వత్సరంబిది
చక్రభ్రమణంబు వలన షష్ఠిన నొకటై
విక్రాంతిగూర్ప పుడమికి
చక్రాయుధు క్రీడవలన చక్కగ వచ్చెన్. 1

క్రొత్తవత్సరాన కొమ్మలదాగిన 
కోయిలమ్మ కోరె క్రోధినిపుడు
"తలలు ద్రుంచుమమ్మ!దౌష్ట్యంపు నరులకు
తలను వంచుమమ్మ ధార్మికులకు!.2. 

నామము "క్రోధి"యైనను, జనైక హితాంతర రాగమూర్తివై
ప్రేమను బంచుమమ్మ!కరరేఖలు మార్చుచు జీవితమ్మునన్
సేమము గూర్చ రమ్మిటకు శ్రీవరదాయినియై శుభంబుగన్
వేమరు పంచమాన నిను వేడెద కోయను సుస్వరాంజలిన్.3.

క్రోధము జూపుమమ్మ!మదికూరిమి దప్పిన రక్కసాత్ముపై
క్రోధము జూపుమమ్మ!సుమకోమలి శీల విఘాతనీచుపై
క్రోధము జూపుమమ్మ!పలుఘోరములన్ సృజియించు నేతపై
క్రోధముజూపుమమ్మ! జనఘోషకు కారణమైన వారిపై.4.

పేదసాదల హృదయాలు ప్రియముగూర్ప
కవులసౌజన్య సౌహితీ కడలిపొంగ
మమత సమతలు సదమల మానవతులు 
ఘనత జనతను పండింప కదలు క్రోధి. 5.

ఆయురారోగ్య భాగ్యాల నమరజేసి
భావి జీవనమందున ప్రగతి నిడుమ!
చింతలేనట్టి యోగంబు నంతజూపి
క్రోధి వత్సర! నినుగొల్తు కూర్మిదనర. 6.



  

        
                  

                                     
వికారి నామ ఉగాదికి స్వాగతం.

ఉ: కమ్మని గున్నమావిన వికారకషాయిత లేజిగుళ్ళనున్
     ఇమ్ముగ మెక్కి చొక్కి తనచిత్తముకుత్తుక రాగబంధమై
     నెమ్మిని జేరుచున్ సతిని నేర్పుగ లాలనజేసి కో యనిన్
     రమ్మనె శ్రీవికారిని ధరాతలమంతయు స్వాగతమ్మనన్.
ఉ: వేకువలేచి పర్వమున వీధిని గేహము శుభ్రపర్చి-యే
     వ్యాకులపాటులేక సిరివర్థిల స్నానమొనర్చి లక్ష్మియై
     తా కులదైవముంగొలిచి ధైర్యముగా పతిచెంతకేగి-యో
     శ్రీకర రామ!లెమ్మనును సిగ్గులమొగ్గ, యుగాదివేళలన్.
ఆ.వె:వేపపూతదెచ్చి వెండి గిన్నెనునుంచి
         తీపి పులుపు రుచియు తిక్తమెల్ల
         చెఱకురసమునందు చేడియ కలుపంగ
         నా వికారి వచ్చె నవ్య రుచుల.
ఆ.వె: ఓ వికారి!భావి జీవన గమనాల
         నీ వికారచేష్టలేవి చూప
         వలదు, నీదు దయను వర్థిల్లజేయుమా!
         నిత్యపూజసేతు నీమమలర!
తే.గీ: పుడమిదేవత నీరాక పులకరించి
         పొంగిపోవును నీ స్పర్శ స్ఫూర్తి తోడ
         పచ్చదనమును నిలువెల్ల పఱచుకొనుచు
         సర్వశుభములగల్గించు శర్వుపగిది.
తే.గీ: ఆరు రుతువులబోలిన నారు రుచులు
         వేరువేరుగ ననిపించు, తేరిచూడ
         నన్ని పరమాత్మ సృష్టిగా నలరుచుండి
         నొక్కటౌగాదె నాధ్యాత్మ దృక్కులకును.
తే.గీ: వేలప్రాణుల మదనుడు వింటితోడ
         పుష్పబాణాల సంధించి మోహతతిని
         రగులజేయును మోదంబు మిగులగలుగ
         విశ్వప్రేమయె జగమంత వెలుగులీన!
ఆమని వర్ణన...ప్లవ నామ ఉగాది.
     
        భూమికి  బుల్కరింతలయి భూజములన్నియు సిగ్గుమొగ్గలై
        రామదృగంచలంబులను రమ్య సుశోభిత హాసభాసమై
        ఆమని వచ్చెనోయనగ నంచిత పంచమ సుస్వరంబునన్
        గోముగ మావికొమ్మలను కోయిల బృందముగూసె తీయగా!

        ప్లవనామ వత్సర పరిచిత నారియై
                  వనమెల్ల పులకింప వసుధ నడచె
        కోకిల కంఠమై కుహుకుహు ధ్వానాల
                  పంచమస్వరమున పాటబాడె
        పువ్వు పువ్వునజేరి పొంగు సుధలయట్లు
                   రసరమ్య రుచులను రసనకొదవె
        పువ్వువిల్కాని కామోదయోగ్యంబగు
                    శృంగారభావాల చెలగిచూపె
          ప్రాణికోటికి కొంగ్రొత్త పరిమళాల
          చిగురుటాశల దొడుగంగ చేరెనిపుడు
          గాది యాయురా రోగ్య భాగ్యాలు నిండ
          జేయ మానవాళి మదికి చింతదీర్చ.
          వన్నెలొల్కెడు వాసంత సన్నుతాంగి
          షడ్రసంబుల లేహ్యంబు సంతరించి
          నవ్య శోభలు పంచగ నడచివచ్చె
          నీ యుగాది పర్వమున మహేశుకృపను.
          వన్నెలొల్కెడు వాసంత సన్నుతాంగి
          షడ్రసంబుల లేహ్యంబు సంతరించి
          నవ్య శోభలు పంచగ నడచివచ్చె
          నీ యుగాది పర్వమున మహేశుకృపను.

ఈనాటి నవ వసంతలక్ష్మి "శుభకృత్త"నే పచ్చని చీరతో శోభాయమానంగా
వచ్చింది. తుమ్మెద రెక్కల కురులలో తురిమిన మల్లెచెండుతో. కలువకన్నుల
కాంతి రేఖతో , చెలువము పంచాలని పెంచాలని ప్రకృతిని పరవశింప చేయాలని.....            
వసంత లక్ష్మీ స్తుతి.2.04.22.
అమ్మా! వసంత లక్ష్మీ!
ఇమ్మా! మమ్మాదరించి యీప్సితతతులన్
లెమ్మా! "శుభకృతు"నీవై
కొమ్మా! మావందనముల కువలయనేత్రా!.1
పచ్చదనమెల్ల ప్రకృతింబరచి పరచి
నూతనోత్సాహమంతయు నూరిపోసి
క్రొత్త యాశల చిగురుల గూర్చికూర్చి
శోభలందించరావె మా "శుభకృతనగ".2
మాకు సతతంబు కాపువై మసలుమమ్మ!
సర్వగ్రహశాంతి లోకాల సలుపుమమ్మ!
వేప పచ్చడి షడ్రుచుల్ చూపుమమ్మ!
తీయ తీయని సుఖముల దేల్చుమమ్మ!.3

అందరికి ఉగాది శుభాకాంక్షలు. 2023.
     శోభకృద్రాణి (వసంతలక్ష్మి)కి స్వాగతం.
  చం. శుభక‌‌ృతు వత్సరంబు తన సుందర డెందము జూపి ప్రేమమై
        శుభముల నీనె, నీవటులె ‘‘శోభక‌‌ృతాఖ్య’’వు గాన మాతవై
        అభయము నీయుమమ్మ; దరహాస ప్రకాశ విలోకనాత్మవై
        విభవములెల్ల మేము గని విజ్ఞతనుండ ‘‘వసంతలక్ష్మిరో !’’
  చం.  కవులకు చిత్రకారులకు కమ్మని భావ పరంపరల్ సదా
        నవరసపూర్ణమై విరిసి నాణెపు గారవమందుటయ్యదే
        తవ ఘన పాదపద్మముల దాకిన సత్ఫలమందు నేనిటన్
        భువనమనోహరీ! సుగుణభూషణ భాస! ‘‘వసంతలక్ష్మిరో! ’’
  ఆ.వె. గున్నమావి చెట్టు గుబురులందున దాగి
        కొమ్మ లేతచివురు కొరికె పికము
        స్వరము మారిపోయి పంచమస్వరముగా
        శుభము బల్కుచుండె ‘‘శోభకృతుకు’’.
 ఆ.వె.  చేదు తీపి వగరు చింత పులుపులోన
        కారముప్పు వేసి కలియగలిపి
        కంకణాల కాంత క్రమముగ వడ్డింప
        దీటురాదు సుధయు దీనిముందు. 
 ఆ.వె.  గ్రహములెల్ల మాకు రక్షణ గల్పింప
        భావి జీవితాలు తావులలరు.
        శుభము సౌఖ్యమీయ ‘‘ శోభకృద్రాణిరో!’’
        దీవనాళి నిమ్ము తిరముగాను. 
              సర్వే జనా; సుఖినో భవన్తు!
        భాగ్యనగరం.                     పొన్నెకంటి సూర్యనారాయణ రావు. 
        మల్కాజ్గిరి.                       భాషాప్రవీణ, ఎం,ఏ. (తెలుగు)
        6300985169.                     విశ్రాంతాంధ్రోపాధ్యాయుడు.

 అందరికి ఉగాది శుభాకాంక్షలు.
             ‘‘ శోభకృన్నామ వత్సరా! శుభములిమ్ము!
 1. రాజకీయాల రచ్చలే రగులుచుండి., బుద్ధిహీనులు నాగులై బుసలుగొట్ట
   సంఘమందున సజ్జనుల్ సమయకుండ., శోభకృన్నామ వత్సరా! శుభములిమ్ము.
 2. మానవత్వాలు ప్రేమలు మంటగలసి., దానవత్వాల జృంభణల్ ధరణి బెరిగె.
   ధర్మబద్ధపు బంధాల దారిజూపి.,  శోభకృన్నామ వత్సరా! శుభములిమ్ము.
 3. సకల సద్గుణభాసిత సౌమ్యులెల్ల., అణగియుండిరి కొందఱి యాగడాల
   సాధువుల గాచు భారమ్ము సరిగనీదె., శోభకృన్నామ వత్సరా! శుభములిమ్ము.
 4. వాయుకాలుష్యముంజేయు ప్రల్లదులను., నీటికాలుష్యముంజేయు నీచజనుల
   శిక్షపాల్జేసి సంఘాన శ్రేయమలర., శోభకృన్నామ వత్సరా! శుభములిమ్ము.
 5. రక్ష గూర్చు మహోన్నత వృక్షములను., ప్రాణ వాయువునిచ్చెడు పాదపాల
   గూల్చి సంపదల్ పొందెడు క్రూరజనుల., శోభకృన్నామ వత్సరా! శుభములిమ్ము.

 6. రాచరికమైన పోకడల్ రమ్యమనుచు., సాగుచుండిరి పాలకుల్ సాహపాన
   ప్రజల స్వేచ్ఛను కాపాడి పాడిసేసి., శోభకృన్నామ వత్సరా! శుభములిమ్ము.

 7. న్యాయమార్గాన పయనించు నరుని యునికి., కత్తి మీదను సాముగా మిత్తిజూపు
  ధర్మబలమును సమకూర్చు తల్లివౌచు., శోభకృన్నామ వత్సరా! శుభములిమ్ము.
 8. అభము శుభముల నెఱుగని యబల భవిత., చిదుము చుండె కామాంధులు సిగ్గుమాలి
   వారి యాటలు కట్టించి తీరుమార్చి., శోభకృన్నామ వత్సరా! శుభములిమ్ము.
 9. షడ్రసంబుల నొక్కచో సంతరించి., భక్తి భావాన నద్దాని పంచుకొనుచు
   ఈ ‘‘యుగాది’’ని హృద్వీధి నింపుగూర్ప., తలచుకొనుచున్న మమ్ముల దయనుజూచి,
   శోభకృన్నామ వత్సరా! శుభములిమ్ము.
10. అన్ని రాశుల ఫలితముల్ హ్లాదమొదవ., రాజ పూజ్యంబె యధికమై రాణకెక్క
   భాగ్యలక్ష్మియె సత్క‌ృపన్ పరిఢవిల్ల., శోభకృన్నామ వత్సరా! శుభములిమ్ము.
   
                    సర్వే జనా; సుఖినో భవన్తు!
        భాగ్యనగరం.                     పొన్నెకంటి సూర్యనారాయణ రావు. 
        మల్కాజ్గిరి.                       భాషాప్రవీణ, ఎం,ఏ. (తెలుగు)
        6300985169.                     విశ్రాంతాంధ్రోపాధ్యాయుడు.      
                            క్రోధికాహ్వానం 2024-25.
"శ్రీక్రోధి" వత్సరంబిది
చక్రభ్రమణంబు వలన షష్ఠిన నొకటై
విక్రాంతిగూర్ప పుడమికి
చక్రాయుధు క్రీడవలన చక్కగ వచ్చెన్. 1

నామము "క్రోధి"యైనను, జనైక హితాంతర రాగమూర్తివై
ప్రేమను బంచుమమ్మ!కరరేఖలు మార్చుచు జీవితమ్మునన్
సేమము గూర్చ రమ్మిటకు శ్రీవరదాయినియై శుభంబుగన్
వేమరు ప్రస్తుతింతు నిను విజ్ఞులు మెచ్చ కృతజ్ఞతాంజలుల్.2.

క్రోధము జూపుమమ్మ!మదికూరిమి దప్పిన రక్కసాత్ముపై
క్రోధము జూపుమమ్మ!సుమకోమలి శీల విఘాతనీచుపై
క్రోధము జూపుమమ్మ!పలుఘోరములన్ సృజియించు నేతపై
క్రోధముజూపుమమ్మ! జనఘోషకు కారణమైన వారిపై. 3.

క్రొత్తవత్సరాన కొమ్మలదాగిన 
కోయిలమ్మ కూసె క్రోధమెలర
తనను బాలగణము దర్పాన రెట్టింప
మితముగల్గు స్పర్ధ మేలుగాదె!.4. 

పేదసాదల హృదయాలు ప్రియముగూర్ప
కవులసౌజన్య సౌహితీ కడలిపొంగ
మమత సమతలు సదమల మానవతులు 
ఘనత జనతను పండింప కదలు క్రోధి. 5.

ఆయురారోగ్య భాగ్యాల నమరజేసి
భావి జీవనమందున ప్రగతి నిడుమ!
చింతలేనట్టి యోగంబు నంతజూపి
క్రోధి వత్సర! నినుగొల్తు కూర్మిదనర. 6.



  

        
                  


పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...