జీవన సమరం...తెలుగాట...
ఆట పాటలతో చిన్నతనంలో, ఆటు పోట్లతో మధ్య వయస్సులో, ఆ రెండింటి సమన్వయం కుదరక ఆపోటు ఈపోటుతో వృద్ధాప్యం గడుస్తు నాటక చివరి అంకానికి వచ్చి పాత్ర ముగింపు పలుకుతుంది. ఇదే జీవన సమరం. పుష్కలంగా సిరి సంపదలు ,అనురాగాలు , రాగాలు లభిస్తుంటే సమరం అక్కరలేదు, వాటి మధ్య సమన్వయం కావాలి. నిత్యజీవితావసరాలు కరువై నప్పుడే అసలు సమరం., చూపే త్యాగాలు, సాహసాలు, తెలివి, సమయస్ఫూర్తి అవసరమౌతాయి.
జన్మ , ఆరాటంతో కూడిన పోరాటం నుండే ప్రారంభమౌతుందని నా ప్రగాఢ విశ్వాసం. ఈ ఆరాట పోరాటాలు ముందు జీవితావసరముల కొరకైతే, తదుపరి విలాసాల కొరకు. ఏది యేమైన పోరాటం లేని గెలుపు లేదు. పోరాడకుండ వచ్చే గెలుపు గెలుపు కాదు. అవసరాల మేరకే పోరాట పటిమ ఉంటుంది. పెరుగుతుంది. మన శరీర అవయవాలలో దేనికి ఎక్కువ శ్రమ ఇస్తామో అదే బాగ ఆరోగ్యంగా వృద్ధిచెందుతుంది.
ఇక తెలుగాట విషయానికి వస్తే......
తెలుగు భాషాభివృద్ధికి ఇదొక చక్కని మానసిక వికాసాన్ని, దృఢత్వాన్ని కలిగించే ఆట. ఈ ఆట దాదాపు రెండేళ్ల నుండి సాగుతున్నది. దీనిని సిలికానాంధ్ర, టి.వి.9 సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ ఆటలో మీట ఉన్నది. మీట సమయానికి నొక్కటంపై ఆధారపడి ఆట ఉన్నది. ( నిర్వాహకులు శ్రీ కూచిభొట్ల ఆనంద్ గారు) ఆయన ప్రశ్నించిన వెంటనే మీట నొక్కాలి , అప్పుడది కంప్యూటర్ లో నమోదు చేయబడి సభ్యుని పేరు తెలుపుతుంది. వారే సమాధానం చెప్పాలి. మొదటి తిరకాటం, లో ప్రశ్నలకు 100, గుణాలైతే రెండవ తిరకాటంలో 200గా అవుతాయి. చివర పందెం కాచే అంకం. సంపాదించిన గుణాలను పందెంలో పెట్టి తెలివి సమయస్ఫూర్తి నిరూపించుకోవడం. మన పెద్దవాళ్లు మనకు నేర్పింది " న్యాయంగా సంపాదించు, దానిని సద్వినియోగం చెయ్యి "అని. అది ఈ ఆటలో బాగా పనికి వస్తుంది. ఎంత పందెం కాస్తే అక్కడివారు వారి వద్ద ఉన్న మొత్తం కన్నా మనదే యెక్కువ అవుతుందో అవగాహన కావాలి. అప్పుడే విజయలక్ష్మి మనలను వరిస్తుంది. "ధైర్యే సాహసే లక్ష్మీ" అనే సూక్తి సార్థకం అవుతుంది.
17.10.2016న జరిగిన ఆట, పందెం పోటీలో సాహిత్యం, పాండిత్యం కన్నా, సాహసం, తెగింపు, సమయస్ఫూర్తే విజయం సాధించింది. జయరామశర్శ గారి గుణాలు..4౩00. ప్రత్యర్థి గుణాలు. 2700. (పందెం గెలిస్తే పెట్టిన ధనం రెట్టింపు అవుతుంది.)
అందరు జయరామశర్శగారిదే విజయమని దృఢంగా నిర్ణయం చుకొన్నారు. అయినా ఆయన స్వభావాన్ని బట్టి, అతి జాగ్రత్త , పొదుపరి కనుక ఎక్కువ పందెం కాయడు అని స్వభావం తెలిసినవారి నిర్ణయం. ప్రత్యర్థికి మరో మార్గం లేదు. విజయమో వీర స్వర్గమో. అందుకే సర్వం పందెంలో ఒడ్డింది. అందరికీ ఉత్కంఠ.... పందెం ఎవరెంత పెట్టారో సమాధానం తరువాత కాని చెప్పరు. .... అయిపోయింది ....సాహసమే గెలిచింది. పాతాళ భైరవిలో యస్. వి. రంగారావు "సాహసము సేయరా డింభక", "ధైర్యే సాహసే లక్ష్మీ"" అన్నీ ఋజువు చేస్తూ ప్రత్యర్థి గెలిచింది..
సాహిత్యపు గెలుపు ఒకరిది, సాహసపు గెలుపు మరొకరిది. తుది గెలుపే లెక్క....
నిర్వాహకులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకులు ఔరా!!!! అనుకున్నారు.