విశ్వగురుపీఠాధిపతి భగవాన్శ్రీ శ్రీశ్రీవిశ్వయోగి విశ్వంజీ మహరాజ్ పద్యాలతోరణం సామాజిక శతకపద్యహేల కు..చక్కని..ప్రేరణాత్మక సందేశం ఆశీస్సులనందించారు. ఇది.ప్రతి ఒక్కరికి ప్రేరణ.
సీ: పద్యాలతోరణ పండిత కవులెల్ల
విశ్వంజిదీవనన్ వెల్గుగాత!
సాంఘిక పరమైన సంస్కృతి రక్షింప
శతక సాహిత్యాల సౌరువెలయు
విశ్వభారతియొక విజ్ఞానసారమై
అణువణువు మహిని హర్షమొదవు
యోగిపుంగవుల మహోదాత్త కామమనన్
కవులహృత్కమలాలు క్రాలుగాత!
తే.గీ.సార రసయుత సద్గ్రంధ సరళిబెరిగి
దుష్టభావాల మూలాల తొలచివైచి
తుష్టి యొనరించి పద్యాల తోరణాన
వెల్లివిరియును శుభముల జల్లుకురిసి.