
2005.వ.సం. భట్టిప్రోలు లో ప్రధానోపాధ్యాయిని పదవీ విరమణ చేసిన సందర్భంగ భువన విజయము శ్రీ కృష్ణ దేవరాయలుగ పొన్నెకంటి సూర్య నారాయణరావు .తిమ్మరుసు గ ముద్దాలీలా మోహన రావు.ఉన్నాము . సన్మాన గ్రహీత సూర్య నారాయణ రావు. సన్మాన కర్త, విద్యాలయ వ్యవస్థాపకులు పులికొండ రాదా కృష్ణ గుప్తగారు . .
1971వ. సం లో . విద్యాలయంలో చేరినప్పటినుండి నా సోదరుడు మద్దా లీలా మోహనరావు తోబాటు. అనేక భువనవిజయములు ,ఇందిరా మందిర సభలు, అవధానాలలో పాల్గొనటం జరిగింది .లీలా మోహనరావు తిమ్మరు పాత్రనెంతో రక్తి కట్టిస్తూ తనకి తనే సాటి యనిపించుకున్నాడు . నేను రామరాజ భూషణుని గ ,ముక్కు తిమ్మనగ, పింగళి సూరనగా పాలు పంచుకోనటం జరిగింది .రేపల్లెలో పండిత పరిషత్కార్యక్రమాలు జరిగినంత కాలం అదొక స్వర్ణ యుగంగా ఉన్నది. లీలామోహనరావు ,నేను ఒకే కళాశాలలో కలసి చదువుకొన్నందుకు , దగ్గర,దగ్గర విద్యాలయాలలో( ఒకరు భట్టిప్రోలు ,మరొకరు ధూళిపూడి) చేరాము. దాని ఫలితంగా 36.సం .కళాశాల లోనే ఉన్నట్లు అనిపించింది .