1. పృచ్చకులు . పొన్నెకంటి సూర్య నారాయణ రావు .
విషయము :-వేద గాయత్రీ అగ్రహారమునకు ఆశీ స్సులు ( సర్వ లఘు కందము , చివరి గణం లో గురువు రావచ్చు )
కం . వరములు సిరియయి వెసవెస
సరస ముఖ మనగ జల జల జనముల కొలుపన్
త్రి రమా హితమై సహస్ర రీతుల బ్రోచున్ .
2. పృచ్చకులు:- శివశ్రీ శర్మ .
విషయము :- కాళి , లక్ష్మి , వాణి . పదములను వాడకుండ అమ్మవారి వర్ణన .
శ్లో . ఐశ్వర్యామృత వర్షిణీ , మహానందాను సంధాయినీ ,
వాచీ శ్రీ మధురాత్త ధారిణి , జగజ్జే తృత్వ సంపాదినీ ,
పద్మాలంబిత నిత్య గేహిని , సదా పద్మాక్ష హృద్వాసినీ ,
దేవీం త్వాం చ సరస్వతీం , హృది భజే గౌరీం ,రమామ్ సర్వదామ్ . !
3. పృచ్చకులు:- డా . అమళ్ళ దిన్నె వెంకట రమణ ప్రసాద్ .
విషయము :- నాగఫణి శర్మ గారి తండ్రిగారిని ( నాగభూషణ శర్మ ) గురించి
కం . ఆనందమతియు దాతయు
తానై, శివుడై, భజింతు తత్త్వ విదుండై ,
ఆ నాగభూష ణు, సుశీ
లా నుత సఫలైక జన్ము ప్రణుతింతు మదిన్ .
4. పృచ్చకులు:- మావుడూరి సూర్య నారాయణ మూర్తి .
విషయము :- అ, ప, వర్గ నిషిద్ధం గ .
కం . ఆవృత్తి రహిత సుస్థితి
ఏ వృత్తుల నున్నవా రికేనిన్ కలుగున్
జీవుల కైశ్వర్యములై
తానై నెలకొను నితాంత తాత్విక కళ లై .
5. పృచ్చకులు:- సత్య ప్రసాద్ గారు .
విషయము :- తిరుపతి వేంకటేశ్వరుని నిత్య పెండ్లి కొడుకుగా
కం . మంగాధీశా ! జనహిత
అంగాంగా నందన రూఢ అక్షత సుఖ లీ
లంగా !కల్యాణ విభవ
మంగళ శ్రీ శ్రీ నివాస మాగోవిందా .
మంగళ శ్రీ శ్రీ నివాస మాగోవిందా .
6. పృచ్చకులు:- మాన్య శ్రీ వసంత గాడ్గిల్ గారు .( హస్తిన నుండి వచ్చిన గొప్ప సంస్కృత పండితులు )
విషయము :-భారతే పాతు భారతీ ( ప కార నిషిద్ధం )
శ్లొ. శ్రీ భారతేషు వసతాం జన మానసేషు ,
సంస్కార దివ్య విభవా విదధాతు వాణీం
మాంగల్య మేవ సతతం బహు లోక రుచ్యమ్ .
7. పృచ్చకులు:- డా . బలదేవానంద సాగరః ( హస్తిన ఆకాశవాణి లో సంస్కృత వార్తలను చిరకాలము గ చదువుచున్నవారు )
శ్లో . సిద్ధ్యంతి సర్వ కార్యాణి ,యస్యైవం మతిరన్వహం ,
శివే శివార్చనే ప్రీతా , ధర్మార్దౌ కామ మోక్షదౌ
ధర్మార్ధ కామ మోక్షాశ్చ యిహంతు పరయేవ చ
యస్య దేవీ వశం చిత్తం తస్య భాన్తి సుసాన్తితః .
8. పృచ్చకులు:- ఆర్ . అనంత పద్మ నాభరావు గారు . ( అసిస్టెంట్ డైరెక్టర్ , ఆకాశవాణి , హైదరాబాద్ )
విషయము :- పుత్ర మమకారం . ( మ కార నిషిద్ధం )
కం . కొడుకుపయి ప్రీతి ధారలు ,
అడుగడుగున కురియుచుండు నయ్యది సబబే
కొడుకనిన సుశీలామ్బకు
ఎడదను కడు తీపి హెచ్చు నేను నుతింతున్ .
సశేషం .
సశేషం .