అనన్వయ అబ్దుల్ కలామ్.
అనన్వయము నూరు అలంకారములలో నొకటి. అన్వయము అంటే సాదృశ్యము, పోలిక, ఒక వ్యక్తి గాని, వస్తువు గాని , వేరొక దానిలా ఉంటే ఆ యిద్దరు వ్యక్తులనో, వస్తువులనో పోల్చవచ్చు . ఆ మనీషిని గురించి పోలిక చెప్పాలంటే ఎక్కడా దొరకక పొతే వారిని అనన్వయ వ్యక్తులుగా చెప్పవచ్చు. సాగరం ఎలా ఉంటుందని ఎవరైనా అడిగితే ఇలానే సమాధానం చెబుతారు. అందుకే సాహితీ వేత్తలు, సాగరః సాగరోపమా అన్నారు రామ రావణ యోర్యుద్ధం రామ రావణ వత్. అటువంటి పోలిక లేనందు వలన అలా అన్నారు.
ఆ కోవకు చెందిన ఒక మహోన్నత వ్యక్తి , జాతి రత్నం రాలిపోయింది భారతావనినే కాక సర్వ ప్రపంచాన్ని కన్నీటి లో ముంచి. అనిర్వచనీయ ప్రతిభాశాలి , సుగుణ శీలి , సమున్నత మానవీయ సత్కార్యాచరణ సుమములను , యువకుల హృదయ మధు వనంలో పూయించు తోట మాలి. నింగి దురాన్ని చెరిపి, మనం శాస్త్ర విజ్ఞానం తో దానిని సులువుగా తొంగి చూడవచ్చునని నిరూపించిన సాంకేతిక శాస్త్ర విజ్ఞాని , కీర్తి శేషులు అబ్దుల్ కలాం గారు.
ఆలోచన, ఆచరణ , ఆత్మీయత, ఆరాధనా భావం, అంకిత భావం, అందరిని అలరించే అమృత హృదయం , సేవాతత్వం, బంధు ప్రీతి , మా తృ ప్రేమ , భ్రా తృ ప్రేమ , చిరు నవ్వు చెరగని మోము , పని చేయుటలో ఆనందాన్ని అనుభవించటం , యెంత ఎదిగిన ఒదిగి ఉండటం , ధనార్జన పట్ల నిరాదరణ , విజ్ఞాన ధనార్జన పట్ల మిక్కిలి ఆసక్తి, ఇటువంటి కోట్ల గుణములు రాసి పోస్తే ఒక అబ్దుల్ కలామ్.
పదవులకు మనిషి వలన గౌరవం రావటం , తేవటం కొందరి వలననే జరుగుతుంది . రాష్ట్ర పతి పదవికి అందాన్ని , హుందా తనాన్ని , తెచ్చిన మహనీయులలో అబ్దుల్ కలాం ఒకరు .
సమాజంలో ఏ క్రొత్త మార్పు రావాలన్నా , అది తప్పక బాలలనుంది, యువకుల నుండి వస్తుందని నమ్మి వారిని నిరంతరం , తన మృదు మధుర భావ గంగా జాలం తో తడిపి వారి మనసులను , ఆలోచనలను , పరమ పవిత్రం జేసి ఆచరణ వైపు అడుగులు వేయించిన స్పూర్తి దాత అబ్దుల్ కలామ్.
సాగర తీరం లో జన్మించి విద్యా విజ్ఞాన సాగరం మధించి, అందు అమృతాన్ని సాధించి , దానిలో రామ ఈశ్వర తత్వాన్ని రంగరించి, రస రమ్యం చేసి , ఆ అమృతాన్ని సర్వ ప్రపంచానికి పంచి న మోహనాకారుడు కలాం ;దైవం ఎక్కడో లేడని, పసి హృదయాలలో , వారి బోసి నవ్వులలో , ఉన్నాడని నమ్మిన మానవతావాది , మా నవతా వాది, కలాం . హిందూ మతమైన , మహమ్మదీయ మతమైన , మరే మతమైన , సర్వ జన సమ్మత మైనదే మతమని నమ్మి మానవ శ్రేయస్సుకు మకుటాయమానం గా నిల్చిన మానవతావాది కలాం. తన దేశం ఆధ్యాత్మికం గానే కాకుండా , వైజ్ఞానికంగా కుడా , హిమోన్నత శిఖరాలను , దేశాంతరాలను దాటాలని , కలలు కని, ఆ కలలను సాకారం చేసి , పృథ్వి , అగ్ని, వంటి క్షిపణుల ద్వారా , నిరూపించిన స్రష్ట కలామ్.
మనం కలలు కనటం గురించి చెబుతూ ఒక ఉన్నత లక్ష్యాన్ని కలగా కని, దానిని నిజం చేసుకోవటానికి , అహోరాత్రులు కృషి చేయుమని, కలలు కల్లలు కాకుండా ,నిజాలు కావాలనే తపస్సు , చేయుమని తపన బడ్డాడు కలాం . త్యాగానికి మరో రూపు ఆయన . ఇన్ని సుగుణాల కలబోత , కలనేత, కలల నేత , మన డాక్టర్ అబ్దుల్ కలాం గారు కాక మరెవరు ఉంటారు చెప్పన్ది. మనం వారి ఆశయాలకు రూపు దిద్దుదాం .
కలలు కనుమన్న మాన్యుండు ఘను డె వండు
నింగి దూరియు కనిపించు భ్రుంగి ఎవడు
భారత రత్నంబు నాబడు భవ్యు డె వడు
అతడె అబ్దుల్ కలాము విఖ్యాత యశుడు.

జలధి మించిన విజ్ఞాన శాస్త్రమున్న
వినయము చిరునవ్వు వెలయు వేత్తయగుచు
బాలబాలుర హృదయాల పరమగురువు
ఆకలామును మించిన యమరుడెవడు?