14, ఏప్రిల్ 2019, ఆదివారం

ప్రజ పద్యం సమావేశము.

  ప్రజ, పద్యం.  సమావేశం.ది14.04.219..

 భాగ్యనగరం, ఉస్మానియా యూనివర్సిటీ లోని, సురభారతి సమితి గ్రంథాలయములో ప్రజ,పద్యం నిర్వాకులచేత కవి సమ్మేళనము, గ్రంథావిష్కరణలు ది.14.04.19. శ్రీరామ నవమి న ఘనంగాజరిగాయి. 4గ్రంథాలు ఆవిష్కరించారు. నేను వృక్షోరక్షతి రక్షితః అను పద్య పంచకం చదివాను. అందరి పద్యాలు అలరించాయి.
ప్రజపద్యం హృద్యంబయె,
నిజముగనవ్వాణివచ్చి నిల్చినరీతిన్
విజయమునందె వేదిక
అజరామరమౌనుగాత!హాయిగకవితల్.
      ప్రతి కవి నోట పద్యం, శ్లోకం, ఆనందతాండవం చేసింది. సాంస్కృతిక కార్యక్రమాలు రక్తికట్టాయి.  ముఖ్యంగా పట్వర్ధన్ గారి జిలేబి రుచి,పద్యాలకో పద్యాల రుచి జిలేబికో అర్థం కాలేదు. కాని రుచి ఒకదానిని ఒకటి మించింది. నమః .
         

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...