
అమ్మ పాట
అమ్మ కరుణ నాకుంటే అవలీలగ పాటలొచ్చు , అమ్మ కరుణ నాకుంటే అలవోకగ మాటలొచ్చు , అమ్మ దయయె నాకుంటే ఆశువుగా పద్యమొచ్చు .అమ్మ కృపయె నాకుంటే అనగరాని దేముందీ , అమ్మ చూపు నాకుంటే జగమంతట జయమే ,అమ్మ మనసు నావెంటే నాకెందుకు భయము , అమ్మ మదిని తడివి చూడ అమృతంపు ధారలే . కమ్మగ అవి త్రాగితే అసహాయపు ధీరులే , ఆ అమ్మే వీణ పాణి , ఆ అమ్మే నలువ రాణి . మరువబోకు ,మరువబోకు ,మహిమలన్నీ ఆమేవే . పాదకమల సేవజీసి ప్రాంజలించు భక్తి తోడ.