29, మార్చి 2014, శనివారం

మధుమాస మకరందం. ది. 31.03. 2014.

 సాక్షి పత్రిక కొఱకు వ్రాసిన ఉగాది కవిత . 

రాజకీయ విషయాలను అద్ది  కవిత 
వ్రాయాలని ప్రకటితము. 29. 03. 2014. 

నవ రాజకీయ సహజీవనానికి 
నాంది పలికింది మధుమాసం . 
ప్రజలను అణుమాత్రం పట్టించుకోక పోయినా 
రాజకీయ ఉనికిని జూపి, రామ రాజ్యాన్ని స్థాపించే 
సర్వ సమర్ధతలు జయ ఉగాది కల్పిస్తుందని 
ప్రతి ఒక్క (అ ) రాజకీయ నాయకుని దురాశ . 

మధు మాసం లో చిగురాకులు , ఆశా కుసుమాలు ,
పుంస్కోకిలల గాన లహరులు , రాజకీయానికి 
పనికి వచ్చే వస్తు సామగ్రి. 

 పార్టి ఏదైనా , వారిదైన పరమార్ధం . 
పర్వతమంత ఆశ ను చూపించి 
పరమాణు వంత  ప్రయోగాలు చేసి 
కంటికి కానరాని ప్రయోజనాలను 
ప్రజలకు పంచటమే (వి) నాయకుల పరమావధి 

ఉగాది పచ్చడిలో షడ్రుచులుంటాయి , కాని 
(అ ) రాజకీయ నాయకుని పలుకులలో 
ఒక్క మధువే ఉంటుంది . 

విజ్ఞత కల్గిన  ఓటరు మహాశయ పుంస్కోకిలలు 
డబ్బుకు ఓటు , ఉహూ , ఉహూ. అంటూ 
గున్న మావి లాంటి గృహం నుండే రెట్టించి పల్కితే 
ఏ అరాచక శక్తులు విజ్రుంభించి , మన 
వ్యక్తిత్వాన్ని చంపి , సమాజాన్ని సమయించి, ప్రభుతను  కొనసాగించలేవు . 

సగటు మానవ జీవనానికి , మన నవ జీవనానికి 
వసంత లక్ష్మి వంటి నాయకురాలు , 
వసంతుని వంటి రారాజు . కావాలి . 
ప్రతి పల్లె , పట్టణం , పచ్చదనం తో, స్వచ్చ దనం తో ,
మధు మాసం కావాలంటే 
రాజకీయ నాయకులు ,స్వార్ధం అనే నలుపు వదలి ,
పచ్చదనాన్ని ఆశ్రయించాలి . 
నిస్స్వార్ధ రాజకీయ నాయకుల అడుగు జాడలలో నడవాలి. 
ఆనాడే మనకు నిజమైన మధు మాసం ,మధుర మాసం . 

  
            మధుమాస మకరందం . 31. 03. 2014 

        జయ నామ సంవత్సర ఉగాది శుభా కాంక్షలతో  

నవజీవనానికి  నాంది మధుమాసం . 
వన జీవనానికి వసంతం సుమ దరహాసం , సుమధుర హాసం , 
మానవ జీవన శైలికిది  సన్మార్గ సూచిక . 
మానస పరిణతి కిది మహనీయ రోచిక 

షడ్రుచుల యుగాది దేవతకు సాష్టాంగ ప్రణామం . 
ఏ రుచైనా ప్రకృతి మాత  ప్రసాదంగా చేద్దాం ప్రమాణం 
తీపి సుఖాలు కోరుతూ , చేదు కష్టాల పరాకాష్ట ల నధిగమించి 
గెలుపు పులుపు రసమూరిస్తే , ఉప్పు కారాల జయం ఊపందు కొంటే 
వగరు పొగరుతో జీవనం సాగించే 
మానవ రూపానికి మధు మాసం ఒక వరం . 
శుభోదయంతో సుందరి యిచ్చిన ఉగాది పచ్చడి లో 
కొంచెం చేదు  ఎక్కువైన, చిరు నవ్వులు చిందిస్తూ 
 శ్రీమతి మనసు తీపి చేయటానికి 
 ఏమోయ్, ఉగాది పచ్చడి అచ్చంగా పటిక  బెల్లం తో చేశావా అనే 
భర్తల నటనా విన్యాసం అద్భుతం వేప పూత సాక్షిగా . 
( ఉగాది రోజు మనసు బాధపెడితే సంవత్సరమంతా బాధ పడతారని ) 
చేదెక్కువైనా , తక్కువైనా , అది నింబ పుష్పాది సమ్మిశ్రితం 
ఆయురారోగ్య ప్రదాయకం . 
నవ జీవన కుసుమానికి , నవ్య పరిమళ విలసితం 
సర్వ రుచుల సమ్మేళనం తో సౌభాగ్య భోగ భాగ్యాలను 
జయ నామ ఉగాదికి పంచుకుందాం . అవకాశమిమ్మని దేవుని వేడుకొందాం ,


పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...