అవధాని వర్యులకు స్తుతి గీతమ్. ..... రచన . పొన్నెకంటి సూర్య నారాయణ రావు .
నాగఫణీ ! మా యనురాగ మణీ ! సుగుణ ధీ మణీ !
అవధానము పారించు అద్వితీయ నాక ధునీ .!!
కరములంటి వాణి ని , సత్పదముల గూర్చుచు
కరములంటి నలువను , కమనీయత పంచుచు
ఆశు కవిత నలవోకగ నవధానిగ గురిపించి
పద్యమన్నహృద్యమంచు పలుమారులు రూపించి ... నాగఫణీ !
తెలు(గు తేట నిండించి ,తెలు(గు పూలు పూయించి
భరత దేశ పరిధి దాటి పలు దేశాల్ విస్తరించి
సౌరభ్యము పెంచినావు స్వారస్యము నుంచినావు
తెలు(గు తోట మాలిగా వెలుగు జ్ఞాన శీలిగా ..... నాగఫణీ !
మీ సంస్కృత శ్లోకాలు అత్యున్నత లోకాలు
విహరించిన పండితాళి వివరించును వేదాలు
గంధర్వుని దలపించును గాన రాగ మాధుర్యము
సార్థకంబు మీ జన్మ సరస హృదయ దయామయా ... నాగఫణీ !
మొక్కవోని మీ ప్రతిభకు మ్రొక్కుచుందు నేనెప్పుడు
అమ్మ పాల మాధుర్యము నణువణువున చూపించి
తెలు(గు వాడి వాడిని నల్దిశలను మెరిపించిన
సార్థకంబు మీ జన్మ సరస హృదయ దయామయా .. .. నాగఫణీ !