26, ఆగస్టు 2011, శుక్రవారం

బూతు బొమ్మల గురించి.

సూర్య దేవాలయం మీద బూతు బొమ్మల గురించి.

 ౭.తే.గి. బౌద్ధ  ధర్మంబు  లానాడు భరత భూమి, 

            ప్రజ్వ లింపగా సంతాన ప్రాప్తి లేమి ,

           బూతు బొమ్మలే ముఖ్యంపు నీతులగుచు , 

           దేవలంబున  జెక్కిరి దివ్య ప్రేమ .

౮..తే.గి. స్వచ్చ  నిర్మల ప్రేమకు స్వాగతమ్ము ,

            పల్కి శిల్పులు తమదైన ప్రజ్ఞ జూపి,

          కామకళలకు క్రొంగ్రొత్త ఖ్యాతి బెంచి ,

         వాసి గల్గు వాత్సాయన వారసులుగ.

౯.తే.గి. విశ్వ విఖ్యాతి గాంచిన విబుదు లెల్ల ,

           భరత కళలకు, కవులకు భద్ర మనుచు
 
         వేద భారత శక్తికి విస్తు పోయి ,

         అన్జలింతురు మనముల హత్తు కొనుచు.
        

కోణార్క శిల్పి



1.తే.గీ.సూర్య దేవాలయంబు సంస్తూయమాన 
          సుప్రభా భాసితంబు సుశ్లోక భరిత 
          శ్లాఖ్యదంబు, దాని గనిన సమయమందు
          జన్మ సఫలమన్ దలతురు జగమునందు.

2.కం.  కోణార్క శిల్పి యులి పా
          షాణంబుల బుజ్జగించి సరసత మెరయన్ 
          కోణాలెన్నిట జూచిన 
          ప్రాణంబుల బోసి నింపె బ్రహ్మకు దీటై.

3.కం.  ఉలి కోపమూని శిల చెవి 
          మెలివెట్టుచు కోర్కె దీర మేలిమి శిల్పాల్  
          మలచెను నర్కుని సాక్షిన్ 
          తరమే శిల్పుల బొగడ! విధాతకు నైనన్.

4.తే.గీ సూర్య తేజానకానాడు స్రుక్కిపోయి 
          తెల్లమొగముల వేసిరి తెల్లవారు 
          కొల్లగొట్టుచు శిల్పాల నెల్లవేళ
          తస్కరించి రహస్కరు ముష్కరతను.

5.తే.గీ. భాస్కర రహిత కోణార్క భాగమంత
           వెల్గుకోల్పోయి  చీకటుల్ విస్తరింప 
           కోరి చేసిరి నైచ్యంబు కూళలగుచు
           తుచ్ఛమైనట్టి యాగ్లేయ మ్లేచ్చులకట!.

6.తే.గీ. అంధకారంబు నచ్చట నణచివేసి
           శిల్పి చరితను ఘనముగా నిల్పునట్టి
           యశపుకాంతులు సతతంబు దిశలునిండె
           ఇంత కన్ననుశిల్పుల కేమివలయు?

7.తే.గీ. ఏడుగుఱ్ఱాల రథముపై నెక్కి కరుణ
           బ్రోచుచుండెడు నాభానుమూర్తి సతము
           తనదు కిరణాల ప్రసరించి ధరణినెల్ల
           కోటికాంతుల విరజిమ్ము కోర్కె దీర!



భువనేశ్వర్ కోణార్క

భువనేశ్వర్ లో లింగరాజు ఆలయం గూర్చి ..మా భావాలు.
 ౧. తే.గీ. స్నేహ బంధంబు పెరిగి మనోహరత ,  ఒరిస రాష్ట్రాన సద్భక్తి యోర్మి కలసి ,
   కాంచగల్గితి మేమప్డు కాంక్ష దీర , లింగ రాజుని సద్దయా లీల వలన .
౨.తే.గీ . శ్రీ భువనేశ్వరీ దేవి చిర్నగవున, పత్తనంబెల్ల సద్భక్తి పరవశించే                                                        లింగ రాజ దయామృత లేశమునను.మోక్ష మబ్బును నిచ్చటి పుణ్యులకును

కోణార్క సూర్య దేవాలయం గూర్చి. ....
౩. తే.గీ ..సూర్య దేవాలయంబు సంస్తూయమాన , సుప్రభా భాసితంబు సుశ్లోక భరిత ,
శ్లాఖ్యదంబు ,దాని గనిన సర్వ జనులు , జన్మ సఫలముగా దలతురు జగమునందు . 

కాశి యాత్ర అనుభవాలు.

యాత్ర కు బయలుదేరుటకు ముందు ప్రార్థన.


౧.సీ..శ్రీ రఘు రాము సంసేవనము సతము ,పాపౌఘములనెల్ల పారద్రోలు.
        శ్రీ రమకరుణ చే సిరులెల్ల నిత్యమై ,తనివార శోభిల్లు తరములెల్ల.
        భరతుని సంస్తుతిన్ భవ బంధముల్ బాసి , అహరహమ్బుల  నెల్ల ఆర్తి దొలగు. 
       లక్ష్మను ప్రేమచే లాలిత్య మొందుచు , నిలువెల్ల నెయ్యంబు నిల్చియుండు.

తే.గీ. ఆంజనేయుని సత్కృపన్ హ్లాద  మెపుడు , భక్త జనులకు కలుగంగ పాదు కొల్పి .
      యాత్ర సఫలంబుజేయంగ.నభయ మీయ.ప్రార్ధనంబును నే జేతు ప్రామ్జలిన్ఛి 
.
 యాత్రకి మార్గ దర్శి అయిన నాయుడమ్మ ని గురించి.

౨. తే.గీ .నాయుడమ్మ యనెడు నాయక రత్నమ్ము ,  యాత్ర జేయ నన్ను పాత్రు జేసే  
         వెంక టేశ్వరుండు,విజ్ఞాన  మానిసి,  మాలకొండయార్యు మమత తోడ.

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...