అభి నవ వ్యాస , సవ్య సాచి . బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి . యల్లాప్రగడ ప్రభాకర శర్మ గారి చేత
20. 10. 2013 న సన్మాన కార్య క్రమము . ( సువర్ణ పుష్పసహిత రజత
కిరీట ధారణ )
అక్షర నీరాజనం
1. సి. కృష్ణా జలంబు లు తృష్ణ దీరగ ద్రావి ,
వేద సారము పంచు విజ్ఞు లెవరు
వైదిక జ్ఞానియై వాదనన్ గెలువంగ
తాత చైనుల మేధ తరచే నెవరు
కమ్మని స్వరమున కవితా ఝరులిల
ధారలై పొంగించు దాత ఎవరు
తే . గీ . వారలెవ్వరొ కాదుసు వసుధ యందు
చంద్ర శేఖర శాస్త్రి నాన్ చదువులయ్య
బ్రాహ్మి పుంభావ రూపంబు వాస్తవముగ
పాద పద్మంబు లర్పించి ప్రణతు లిడుదు