రామాయణ మహామాలా స్పందన.కం. గణపతి యనంతకృష్ణుడు
గుణయుత పట్వర్ధనుండు గురువులుకాగా
గుణముల ప్రోవౌ రామా
యణ ఘట్టమొకటి రచింప హ్లాదముగాదే!
ఉ:వ్రాసితి యుద్ధ కాండమున వాలిసునందను రాయబారిగా
జేసి రఘూత్తముండలఘు శ్రేయముగోరుచు రావణాధిపున్
భూసుతజానకిన్ సుగుణపూత చరిత్రనుబంపుమన్న,నా
వాసిగలట్టి ఘట్టమును వైనముగా నవ పద్యసంఖ్య గా.