శైవ పీఠాధిపతి,మహా మహో పాధ్యాయ , సద్గురు డా . శ్రీ శివానంద మూర్తి గారికి పద్య నీరాజనమ్. ( వేద గాయత్రీ అగ్రహారం తరఫున ) ది.02.03. 2014 .
లలితకళా మండపం లో .
కందుకూరి వంశోద్భవ కాంతిరేఖా , మంగళ స్వరూపా .......
1.సీ. సర్వమంగళాఖ్యత సాధ్వీమతల్లికి , ముద్దుల పట్టి యౌ మోహనుండు .
వీర బసవరాజ వేదాంత సారంబు , కోరి జుఱ్ఱినయట్టి వారసుండు .
భీముని పట్నాన ప్రేమను పంచగా , ఆశ్రయమంబిడి నట్టి యమృత మూర్తి .
చిన్నతనము నుండి చిన్ముద్ర పట్టిన , చిద్రూపి , సద్యోగ చిన్మయుండు .
తే.గీ. తల్లి దండ్రుల విఖ్యాతి ధరణి బెంచ , సవ్య సాచిగా నిల్చిన సత్త్వ మూర్తి .
కందుకూరి వంశోద్భవ కాంతి రేఖ , నవ్య ధార్మికాత్ముడు శివానందమూర్తి .
ఆర్ష ధర్మ ప్రచారకా , అమల యోగీ . ......
2. సీ. సంగీత నాటక సారస్వతంబులన్ , వృద్ధి పరుపగా జూచు సిద్ధ యోగి
ఉద్ద్యోగ ధర్మాన నున్నత లక్ష్యాల చెక్కు చెదరనీని చిద్విలాసి.
ఆర్ష ధర్మంబుల నద్వితీయపు రీతి , పంచి పెట్టిన యట్టి పరమ గురువు .
సంస్కృతీ విభవాల సాటి దేశములందు , చాటి చెప్పు మన చిచ్ఛక్తి యితడు ..
తే.గీ. వాణి కరుణకు పాత్రుడౌ వందనీయ , సాధు సన్మూర్తి సద్ధర్మ సాధకుండు .
శ్రీ శివానంద వర్యుండు శ్రేయమంద కాంక్ష సేయుదు నిరతంబు గరళ కంఠు .
ఆనంద నిలయా . శివానంద సదయా ,.........
3. సీ. యజ్ఞ యాగములందు ప్రజ్ఞా ధురీణ తన్ , ఆర్షము పండించు కర్షకుండు
భారతీయత పేర భవ్యసంస్కృ తులెల్ల , విశ్వాన పంచెడు విబుధ వరుడు .
అద్వైత జ్ఞానంబు నహరహంబున పంచి , విజ్ఞాన తెజుడై వెల్గు నతడు
యోగ శాస్త్రంబన రాగంబు జూపుచు , ఋషి తుల్యు లైనట్టి రుత్విజుండు .
తే.గీ. భరత భూమికి దిగినట్టి ప్రణవ మూర్తి , భక్తి తత్త్వంబు పండిన ప్రాక్తనుండు
పరమ పుణ్యుం డు సద్దయా భరణుడతడు , శ్రీ శివానంద వర్యుండు శ్రేయధనుడు .
బహు గ్రంథ రచనా దురీణా . పూజ్య మహర్షీ ........
4. సీ. కఠ యోగ గ్రంథంబు కంచి స్వాముల చేత , మన్ననలందుట మరువలేము .
పూజ్య మహర్షుల పుణ్య చరిత్రలు , మాల గూర్చుటదియ మరువలేము .
గౌతమ చరితంబు స్తుత్యమై రాజిల్ల , శిల్ప నైపుణ్యంబు చెదరలేదు .
శ్రీ కృష్ణ పేరున చిద్విలాసము గాగ , భావ రమ్యంబది భద్రమగును .
తే.గీ. కావ్య మెట్టిదియైనను ఖ్యాతిగాంచి , సారవంతంపుటర్ధాల సరసి యగుచు
ధర్మ వేదాంత శాస్త్రాల దారి జూపి , మూర్తి వర్యులు ధన్యులై మురిసినారు.
చరద్వి జ్ఞాన సర్వస్వమా . పీఠాధిపతీ ...........
5. ఉ. మానవ జీవితంబెతుల మాన్యత గల్గెడు రీతి నుండునో .
తానుగ చేసి చూపుచును ధర్మ ప్రర్తన ఎంత ముఖ్యమో ,
వేనకు వేలుగా పరమా వేదిక లందు వచించి చూపు .. నా
ధ్యాన నిమగ్న మూర్తి గుణ దామునకున్ కుసుమామ్జలిత్తు ..నే . .
కలం, గళం , పొన్నె కంటి సూర్య నారాయణ రావు . సమర్పణ . యల్లాప్రగడ ప్రభాకర శర్మ .