దత్తపదులు . (అవధానిగారికి 4 పదములిచ్చి , పృచ్ఛకుని కోరిక మేరకు విషయమిచ్చి పదములకు వేరే అర్ధము వచ్చునట్లు పద్యము చెప్పవలసినది గా కోరడమే దీని ప్రత్యేకత . )
1. పృ :- చి. మాడుగుల రేణుక .
వి :- మహా సరస్వతి స్తుతి.
. పదములు . 1. నాగ పల్లవి 2. శ్రావణి 3. లక్ష్మీ సౌజన్య .4. శుక ప్రియ .
తే .గీ. " నాగ పల్లవి" ఋగ్వేద నాద మొదవ .
" శ్రావ\ణీ " సామ గానమై సన్నుతింప
యాజుషీ " లక్ష్మి సౌజన్య"మై ఘటింప
వర "శుకప్రియ" వేదమై వాని కొలిచె .
2. పృ :- శ్రీమతి , కె. విమలా రాణి .
వి :- పసిడి గురించి . పదములు 1. అట్లాంటిక్ . 2. ఆర్కిటిక్ . 3. అంటార్కిటిక్ . 4. ఇంటర్ నెట్ .
తే .గీ. అతుల" మట్లాంటిక"ము దాటి అట్లు మీటి
పసిడి పది దిక్కుల దాటి పసిమి బెంచి
"ఆర్కి టిక్కు"ను దాటి "అంటార్కి టిక్కు "
మించే ఇంటరు నెట్టు తా మేదినందు .
3. పృ :- శ్రీమతి , కె. గిరిజా కుమారి .
వి :- భారతార్ధం . పదములు . 1. చైనా .2. జపాన్ . 3. ఇరాన్ . 4. ఇరాక్ .
తే .గీ. ఎచటి నుం" చైన" శుభ లాభ మొంద వచ్చు
శాంతి సు "జపాను "రక్తి తో సరళుడైన
పో" యిరాను"న్నదింక మహోన్నత దశ
చే"యి రాకు"న్నె దీవింప వాయుపుత్ర .
4. పృ :- మాడుగుల శుక ప్రియ .
వి :- అమ్మవారి వర్ణన . పదములు . 1. హకూన . 2. మఠాట . 3. తొట్టి మాన్ .
తే .గీ. శ్రీ "మఠాట"వీ చరితార్ధ చిత్ర శైల
దివ్య మంగళ సౌరభ్య దే "హకూన"
తామరల "తొట్టిమ"న్నించు ధన్య చింత
వెలిగి పుంభావ వాణి లో వెలసె నిపుడు .
5. పృ :- ?. వి :- అమ్మవారి వర్ణన . శ్లోకం
పదములు. 1. సచిన్ , 2. ధోని . 3. సెహవాగ్ . 4. లక్ష్మణ్
శ్లో . వ్యా"స చ్చి"న్వంతి శ్రీ కావ్య వల్లరీషు
వ్యర్ధ కై" స్సహవాగు"రాన్ తాన్ విధూయ
లక్ష్మణా గ్రజ సత్ కృపామ్ తాం విధృత్య
తత్త్వ మేధో నివాసినీం తాం భజామి .
6. పృ :- ?. వి :- తెలుగును గూర్చి . పదములు . 1. తెగులు .2. తగులు . 3. పగలు . 4. పగులు.
తే .గీ. తెగులు కలవారు తెలుగన్న రాగులుచుంద్రు
తగులు నిక భాష పై ప్రేమ తర తరములు
పగలు రేలును తెలుగు పై మిగులు వెలుగు
పగులు గుండెలు రసవార్ది పయన మందు .