21, జనవరి 2013, సోమవారం

మనోహర మున్నారు . మా అనుభవాలు

 మనోహర మున్నారు . మా అనుభవాలు

నిరంతరం శ్రమపడే విద్యార్ధి జీవితంలో కాని , ఉద్యోగ జీవితంలో కానీ , కొన్ని

రోజులు మానసిక ప్రశాంతత చాల అవసరము. వృద్ధులు, భక్తులు, తీర్థ
 యాత్రలుచేసి ప్రశాంతత పొందినట్లే పిల్లలు ప్రకృతిని చూసి పరవశించి ,సేద తీరుతారు. ముఖ్యంగా సెలవులను సద్వినియోగ పరచుకుంటారు. .

       బెంగుళూరు లో నున్న మా అమ్మాయి , పిల్లలు ఎక్కడికైనా , వెళదామని ఆలోచించి సుందర , మనోహర, ప్రకృతి సంపదకల కేరళను సూచించారు .మేము ( సూర్యనారాయణరావు , ఇందిర ) కూడా చాలా

కాలంగా ఆ మనోహర ప్రాంతాన్ని చూడాలని ఉత్సాహ పడుతున్నాము .

కాగల కార్యము గంధర్వులు తీర్చారన్నట్లు సంక్రాంతి సెలవులొచ్చాయి .

      జనవరి 13,14,15,16,తేదీలు మాకు ఆనందానుభూతులనిచ్చాయి .
     ఆనందం అనేక రకాలు . కొందరికి ప్రకృతి  దర్శనం ,కొందరికి  మృస్టాన్న భోజనం, .యింకొందరికి చిత్రకళానురక్తి. సహజంగా మా కుటుంబ సభ్యులందరకు కళ లపై మక్కువ ఎక్కువ. అందరకు అన్ని కళలలోప్రవేశమే  కాని ప్రావీణ్యం లేక పోవటందురదృష్టం అదృష్టమేమంటే అన్ని కళలను ఆస్వాదిస్తాము. .
                కేరళ ప్రయాణం ఖాయం చేసుకున్నాము. ( మున్నారు, అలెప్పి ).వెంటనే దుర్గా ట్రావెల్స్ ను సంప్రదించి మున్నారు, అలెప్పి లలో గదులు బుక్ చేయిన్చుకున్నాము . 12.01.2013. న రాత్రి 10. గం.లకు బెంగుళూరు నుండి బయలుదేరి 13.01.2013 ఉ. 6.గం. లకు ఎర్నాకులం చేరాము .అచ్చట మమ్ములను తీసికొని వెళ్లి ప్రదేశాలను చూపించటానికి ఒక కారు,డ్రైవర్ని ఏర్పాటు చేసారు .ఆ డ్రైవర్ కి ఒక్క మళయాళ భాష మాత్రమె వచ్చు .మిగిలిన భాషలన్నీ యస్,నో ,ఆల్ రైట్ .అనే పాండిత్యమే .మాకు మళయాళ భాషలో ఆ మూడు ముక్కలు కూడా రావు .కొంత అనాగరిక సౌజ్ఞలతో  నున్న మా పాండిత్యం అక్కరకు వచ్చింది .అప్పుడు మాకు మన మాజీ ప్రధాన మంత్రి గారైన శ్రీ పాములపర్తి  వెంకట నరసింహా రావు గారు ( బహు భాషా కోవిదులు ) గుర్తుకు వచ్చారు . బహు భాషా పాండిత్యమెందు కవసరమో మా అందరికి తెలియ వచ్చింది.కనుక మన భాషా సామర్థ్యం పెరగటానికి , పర భాషలు నేర్చుకోవటం యెంత అవసరమో తెసింది.    

                      మున్నార్:- కేరళ రాష్ట్రంలో  పశ్చిమ కనుమల మీదనున్న యిదుక్కి జిల్లాలో ,ఎర్నాకులాషుమారు 110 కి.మీ .దూరం లో నున్న దేవీకుళం బ్లాకులో నున్న పంచాయతి .దీని వైశాల్యం 557.కి.మీ .దీనికి 105 కి.మీ .దూరం లో కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నదినికి  .
                      వాతావరణం :-  సముద్ర మట్టం నుండి 2000 మీ. నుండి 2600 మీ ఎత్తు నున్నది .గత సంవత్సరం ఉష్లోగ్రత -4 డిగ్రీలున్నది .అదృష్ట వశాత్తీసంవత్సరం + 8 డిగ్రీలున్నదని అచటి హోటల్ మానేజర్ చెప్పారు . దీనికి కేరళ ప్రభుత్వం 2000 సంవత్సరం లో పర్యాటక కేంద్రంగా అనుమతి చ్చింది.   మేము హోటల్ కి
వెళ్ళగానే      మాకు త్రాగటానికి గోరు వెచ్చని  నీరు టేబుల్ మీద పెట్టారు .అవికొంత మూలికలతో కాచినట్లున్నాయి. .
అంద చందాల ప్రకృతి కేంద్రం :- మున్నార్ పట్టణానికి 10 కి.మీ .దూరంలో గల " డీప్ ఉడ్ పులిమోటిల్ ఎస్టేట్ " మాకు బసగా ఏర్పాటు చేసారు .మాకొరకు 2 గదులు కేటాయించారు . మా డ్రైవర్ పాము మెలికలు తిరిగినట్లు తిరుగుతూ పోయే  ఘాట్ రోడ్లో డ్రైవింగ్ మొదలు పెట్టాడు . ఘాటు రోడ్ ఎక్కేటప్పుడుపాము పడగెత్తి బుసలు కొట్టినట్లు పెద్ద శబ్దము మరల క్రిందికి దిగేటప్పుడు కలుగులోనికి వెళుతున్న సరసర సవ్వడి ,భయము ,భ్రాంతి ,ఆశ్చర్యము .కలిగి మన మన యిస్ట  దైవాలని తలచు కుంటాము . డ్రైవర్ కి భాషలో పాండిత్యం లేక పోయినా మా అదృష్టం కొద్ది చాల అనుభవం ,నైపుణ్యం కలదు .పచ్చదనానికి పరాకా స్థ   ఆప్రాంతమంతా .సాక్షాత్ భరతమాత తెల్లని రత్నాలు పొదిగిన పచ్చని పట్టు చీరతో, పూలద్దిన రవికతో,నీలపు పరదాలలో దాగి చిరు నవ్వులు చిన్దిస్తుందా అన్నట్లున్నది .అక్కడక్కడా టీ తోటలలో పనిచేసే శ్రామికులు , వారి నివాసాలు కనిపిస్తుంటాయి .మున్నారు ప్రాంతాన్ని చూస్తున్నప్పుడు మా భావనిలా ఉన్నది.
 సీ .మున్నారు ప్రాంతంబు మోహన రూపంబు ,తేయాకు తోటల తీరు వలన .
      మున్నారు గిరులెల్ల ముచ్చట గూర్చును , పచ్చని పాదప పంక్తి వలన .
      మున్నారు లోయలు మ్రోగుచునుండును ,జలపాత పరవళ్ల జారువలన ,
   మున్నారుసూర్యుడు ముసుగుదుప్పటివీడి, లేశమాత్రమురాడు లేచికూడ,
 ఆ.వె.ఎన్న మున్నారు ప్రాంతంబు కన్నమీద , చెన్ను మీరగ పచ్చల చీరగట్టి .నీలి మేఘంపు ముసుగున నిల్చియున్న,భరతమాతగ కనిపించె  భ్రాంతికాదు.






   టీ తోటల చరిత్ర :-మున్నార్ అనునది మళయాల పదము .మును   మూడు ) ఆర (నది)మున్నారు అయినది. ఇది 1.ముతిరప్పుజ ,2. నల్ల తన్ని 3. కుండలి అనే మూడునదుల సంగమం వద్దగల ప
 ప్రాంతము .  మధువనులు తమిళనాడు , మదురై ,నుండి వచ్చి మున్నార్ ప్రాంతంలో  నివసించారు . తిరువాన్కూరు మహారాజుల దగ్గరున్న పున్జార్ వంశీకులు వారికీ సామంత రాజులు . మిస్టర్ జాన్ డానియల్ మున్రో  అనునతడు పున్జార్ వంశీకుల ద్వార 1877 నుండి 1879 వరకు 588. చ.కి.మీ. భూమిని  రు .5000/- లకు లీజు కి తీసుకున్నాడు .తేయాకు మొక్కలను మొదట గ  ఏ .హెచ్ . షార్ప్ .అనునతడు పెంచాడు .ఆతోట లు 20.హెక్టార్లలో 1910.లో సాగు మొద లైనది . ఆర్ధిక భారంతో ఆ తోటలు అమ్మాల్సి  వ చ్చింది .బారన్ వోటో మైకేల్ ఓన్ రోజన్ బెరి    వానిని కొని 26.ఎస్టేట్లు గ వృద్ధి పరిచాడు . జోన్ మైకేల్ వృద్ధి చేసిన తరువాత ఇంగ్లాండ్ వారీ ప్రాంతాన్ని స్వాధీన పరచుకొని మరి కొన్ని ఎస్టేట్లు గ వృద్ధి పరిచారు .
మనకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆ ఎస్టేట్లను ( 1,14,000 హేక్టార్లను .)  కేరళ ప్రభుత్వానికి  స్వాధీన పరచి వెళ్లారు . ప్రస్తుతం టాటా టీ వే వారి స్వాధీనం లో ఉన్నది.

     టీ ఆకుల గుర్తింపును గూర్చి ఒక  సంఘటన చెబుతారు .  అది , ఒక గొర్రెలకాపరి గొర్రెలనా ప్రాంతంలో మేపుతుండగా  ఒక మేక పిల్ల  ప్రతి రోజు ఒకే చోట ఒకే  చెట్టు ఆకు  తిని  ఎక్కువ  ఉత్సాహం గ కనిపిస్తున్దట . దానినిఆ కాపరి గమనించి  ఆ ఆకులను నీటిలో కాచి రసాన్నిత్రాగటం మొదలు పెట్టాడట .  చాల చురుకు తనం తనలో  గమనించాడు .
తేయాకు ప్రదర్శనశాల :-
కొన్ని సంవత్సరాల క్రితం టాటా టీ వె ప్రత్యేకం  గ   తేయాకు కొరకు  మున్నార్ లో  నల్ల తన్ని ఎస్టేట్ ఆఫ్ టాటా టీ వద్ద ఒక ప్రదర్శన శాల  ఆరంభించ బడింది . దీనిలో అసాధారణ మైన  ఛాయా  చిత్రాలు, యంత్ర  పరికరాలు న్నాయి . టీ తోటల లోని శ్రామికులు రోజుకి 25కిలో ల  ఆకును సేకరిస్తారు . మంచి సీజను  లో 50.కిలో లు సేకరించ గలుగు తారు . టీ తోటలు 120.సంవత్సముల వరకు ఉంచుతారు . అంతకు  మించిన వయసున్న  తోటలను  తొలగిస్తారు .

మట్టుపెట్టి డాం :-     ఇదిమున్నార్కి 13.కి.మీ దూరంలోనున్నది.సముద్ర మట్టం నుండి 1700మీ .ఎత్తునున్న ఆనకట్ట .ఇదొక  అందమైన సరస్సు .బోటు షికార్ చేస్తారు పర్యాటకులు .ఇండో స్విస్ లైవ్ స్టాక్ ప్రాజెక్ట్ చే నడుపబడుచున్న పాల ఉత్పత్తుల కేంద్రం ఇచట ప్రాముఖ్యం పొందింది .ఇచట అత్యధిక పాల దిగుబడి నిచ్చే గోమాతలను చూడ వచ్చు . ఇది అనేక పక్షి జాతులకు నిలయం .మట్టుపెట్టు డాం కి వెళ్ళే త్రోవలో ఒక పుష్ప ప్రదర్శన శాల ఉన్నది .ఇందులోని పూలు నోరులేని శీతాకొక  చిలుకలనే కాక మనసున్న మానవులనందరిని సాదరంగా శిరస్సులు వంచి ఆహ్వానం పలుకుతున్నాయి .భగవంతుని కళా తృష్ణ ,కళా హృదయం వాటి ద్వారా మనకు అవగతమౌతుంది .ప్రదర్శన నుండి మనం బలవంతంగా రావలసిందే .    
     

 

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...