29, అక్టోబర్ 2011, శనివారం

విమర్శ .

విమర్శ సాహిత్యానికి గాని, సౌహిత్యనికి గాని, క్రియకి గాని , కర్తకి గాని  మనోభావాలకు అనుగుణంగా నడచుకోవటానికి ఒక మార్గదర్శకం. విమర్శ చేసేవారికి కనిపించే కోణాల సరళి రచయితకి కనిపించక పోవచ్చు . రచయితకి కొన్ని కోణాలు తప్పు కాకపోవచ్చు . దానిని విమర్శకుడు చాల సున్నితంగా సూచిస్తాడు, నొప్పించకుండా ఒప్పిస్తాడు. కదా . అతడే నిజమైన విమర్శక  చక్రవర్తి . అందుకే  కవికి విమర్శకునికి ఎల్లప్పుడు                  అవినాభావసంబంధం ఉంటుంది.   అలాఉంటేనే కవితకుఒక మనోహరత, మనోజ్ఞత,  సుకుమారత, పరిమళత  అబ్బుతాయి .ఆనాడే సాహితీవనంలో ప్రతి చిరులత,కొమ్మ విరబూస్తుంది.అది బృందావనం అయి  మాధవ మురళికి పని కల్పిస్తుంది.

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...