1. సీ. సీనియర్ సిటిజన్సు శ్రేయంబు కాంక్షించి
నాగోలు ప్రాంతాన జ్ఞానులంత
ఒకరికినొకరౌచు నొద్దిక మీరంగ
సాయంబునందించు సరసులగుచు
సంగీత సాహిత్య సమ్మేళనంబులన్
సత్కళల్ జొనిపించి చక్కబరచి
ప్రాచీన యోగంబు పరమౌషధమ్మని
యమలుజరుపునట్టి యార్యులున్న
ఇట్టి సంస్థ యెదిగె ఈశుని సత్కృపన్
ఆరు వత్సరాల యవధిదాటె
స్వాగ తాంజలులివె సజ్జన వరులార!
సంస్థ జయముగోరు సౌమ్యులార!
2. ఆటల పాటలంగలసి యందరు సభ్యులు బాలబాలురై
నేటికి షష్టిపూర్తియయి నిశ్చల నిర్భయ దేహకాంతితో
ధాటిని జూపగోరెదరు ధార్మిక పూర్ణులు సత్యవర్తనుల్
మేటిగుణాఢ్యులౌ సరస మిత్రులు పల్కెడు స్వాగతంబిదే.
3. కొమరు రాజు వారి కూర్మి సాయమునంది
పరిఢవిల్లె సంస్థ ప్రాభవంబు
శిరమువంచి వారి శ్రేయంబుగోరుచు
పలుక వలెను శుభము ప్రాంజలించి.
4. భారముకాదులే వయసు భక్తిని నింపిన డెందమంతయున్,
భారముకాదులే మనసు పర్వతమంతటి ఆత్మశక్తితోన్ ,
భారముకాదులే తనువు బంధిత స్నేహసమావృతంబునన్
చేరుడి సభ్యులౌచుమన చేరువనున్నవి శాలసంస్థలోన్.
5. నాగోలుసభ్యులెల్లరు
భూగోళపుటెల్లలెల్ల పుష్కల రీతిన్
క్రీగంటజూడ నేర్చిరి
వేగంబుగజేరియిచట విజ్ఞులుగారే.