తెలుపు భాష . తెలుగు భాష
1. విశ్వ మంత కాంతి విరజుమ్ము నాభాష ,
వేద విదులు మెచ్చు విబుధ భాష
పాల తెల్ల దనము , పసిపాప నవ్వులు,
కలిపి తెలుపు భాష తెలుగు భాష .
2. తెలుప గల్గు నన్ని తేటతెల్లము గాగ,
నిలుప గల్గు నిన్ను నింగి కంట ,
తులువ లెన్ని మనల దుర్భాష లాడిన ,
తూచ నలవి కాని తూర్పు కొండ .
3.. దాని గుండె తెలుపు , ధర్మసూక్ష్మము లెన్నొ
, దాని మోము తెలుపు ధైర్యమెంతొ
దాని పనులు తెలుపు దార్శ నికంబని ,
తెలుగు భాష యదియె వెలుగు భాష .
1. విశ్వ మంత కాంతి విరజుమ్ము నాభాష ,
వేద విదులు మెచ్చు విబుధ భాష
పాల తెల్ల దనము , పసిపాప నవ్వులు,
కలిపి తెలుపు భాష తెలుగు భాష .
2. తెలుప గల్గు నన్ని తేటతెల్లము గాగ,
నిలుప గల్గు నిన్ను నింగి కంట ,
తులువ లెన్ని మనల దుర్భాష లాడిన ,
తూచ నలవి కాని తూర్పు కొండ .
3.. దాని గుండె తెలుపు , ధర్మసూక్ష్మము లెన్నొ
, దాని మోము తెలుపు ధైర్యమెంతొ
దాని పనులు తెలుపు దార్శ నికంబని ,
తెలుగు భాష యదియె వెలుగు భాష .