29, ఫిబ్రవరి 2012, బుధవారం

చిరునవ్వు

చిరునవ్వు  ...చిరునవ్వు , 

నవ్వులన్నిటిలో ఆకర్షణీయ మైనది. నవ్వులలో చాలా రకాలున్నాయి. హాసము, మంద హాసము, వికటాట్ట హాసము. హాసము అంటే దంతములు కనబడేటట్లు , నవ్వటం . మంద హాసమంటే దంతములు కూడా కనబడ కుండా నవ్వటము.యిదే చిరునవ్వు . శరీరమంతా చలించే టట్లు  నవ్వ టము .మన సాహిత్య లోకంలో నవ్వు నాలుగందాల చేటు అంటారు . దీనికి కారణం రామాయణంలో రామ పట్టాభిషేక  సమయానలక్ష్మన స్వామి , నవ్వటం . ( లక్ష్మణుడు తన పదునాలుగేండ్ల రామసేవా సమయంలో రాని నిద్రాదేవత యిప్పుడు ,పట్టాభి షేక  సమయంలో వచ్చిందనే భావనతో నవ్వాడు .,) అది అందరికి అన్యార్థం తోచి మనసులలోనే ఆశ్చర్యం వ్యక్తం చేసారు . మంద హాసం చేసి ఉంటె అలాంటి భావం వచ్చేదే  కాదేమో . కనుక మనం మంద హాసం (చిరునవ్వు ) చేయటం ఎంతైనా మంచిది . నవ్వు నాలుగందాల అనర్థం అంటే, వికటాట్ట హాసం విపరీతార్థం యిస్తుంది. అందుకే నవ్వాలి , కానీ పరిధి దాట కుండా. నవ్వటం, యోగం, నవ్వలేక పోవటం రోగం , నవ్వించడం భోగం .

22, ఫిబ్రవరి 2012, బుధవారం

వాక్ శుద్ధి

వాక్  శుద్ధి . 


భావనా పటిమ కలవాడే వాక్ శుద్ధి కలవాడు. భావానికి ప్రేరణ మనస్సు . త్రికరణ శుద్దులలో మనసు మొదటిది .  రెండవది వాక్కు  ,మూడవది కాయము . స్వచ్చమైన ఆలోచన సరళి , అంతే స్వచ్ఛతతో అలోచిన్చినదే 
వాక్కు రూపంలో వెలువరించడం , ఏ రెండిటికి సమాన   స్థాయిలో శరీరంతో పని చేయించడం . ఈ మూడింటి సమన్వయమే త్రికరణ శుద్ధి అనవచ్చును . త్రికరణ శుద్ధి కలిగి ఉండటమే దైవత్వము. సత్యవచనాన్ని పన్నెండు సంవత్సరాలు  విధి గ పాటిస్తే దైవత్వం వస్తుందని ఆర్యోక్తి . మరి నిరంతరం సత్య వాక్ పాలనా నియమం ఉంటె వారు దైవమే. దైవం అంటే ఆనంద నిలయం . అలాంటప్పుడు త్రికరణ శుద్ధితో ఆనంద నిలయ ప్రవేశ అర్హత సాధించటానికి ఎందుకు కృషి చేయ కూడదు ? అందరికి ఆనందం కావాలి . ప్రవేశ అర్హత కావాలి . అందుకే అందరం ప్రయత్నిద్దాం. రండి .

1, ఫిబ్రవరి 2012, బుధవారం

పరిశీలించడం ,

చూడటం , వీక్షించడం , పరికించడం , పరిశీలించడం , 

ఈ నాలుగు పదాలు  భిన్నమైన అర్ధాలు కలిగి ఉంటాయి .

చూడటం ..... ఏ ఆలోచన లేక కన్నులకు మాత్రమే పని అప్పచెప్పటం .

వీక్షించడం ...కన్నులకు , బుద్ధి కి , మాత్రమె పని అప్పచెప్పటం .

పరికించడం . కన్నులకు ,బుద్దికి ,మనస్సుకి ,మాత్రమే పని చెప్పటం .

పరిశీలించటం  ..కన్నులకు ,మనస్సుకు , అంతరాత్మకు , సాక్షిగా ,
                           ఆలొచనాసహితంగా  స్పందించడం
వస్తువులను , చూస్తే సరిపోతుంది .ప్రకృతిని వీక్షిస్తే సరిపోతుంది . లౌకిక
విషయాలను పరికిస్తే సరిపోతుంది . కాని పార లౌకిక విషయాలను
పరిశీలించినా, ఒక పట్టాన అర్థం కావు.
వానిని సద్గురు ముఖముగా మాత్రమే అధ్యయనం చేయాలి . అప్పుడు కూడావారి వారి పూర్వ జన్మ పుణ్య ఫలం గ ఆద్యాత్మిక విషయాలు అబ్బుతాయి .

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...