5, మార్చి 2012, సోమవారం

భయం

భయం ...భయం ...భయం ...


మనసును బాధపెట్టే దేనిని చూచిన భయమే. సంతోషాని కి వ్యతిరేక పదమే ఈ భయం . ముఖ్యంగా ప్రతి జీవికి మరణం అంటే( మృత్యువు) భయం . మనం సహజంగా దేన్ని చూచి భయపడతామో  అదే నిరంతరం మనలను చూచి కవ్విస్తుంది. మన వెంట పడుతుంది ఆంటాడు ఒక మహా కవి . నిజమేమరి సమాజం లో కూడా అదే జరుగుతున్నది . ఎవరు    ( ధర్మ అధర్మ విచక్షణతో ) భయపడతారో వారినే ఎదుటివారు భయపెడతారు . ఎదురు తిరిగేవారిని ఎవరు భయపెట్టలేరు. ఉదాహరణకు మన వెంట ఒక శునకం వెంట పడితే ....మనం భయపడి పరుగిడితే అది వెంటపడుతుంది. అది భయపడి పరుగిడితే మనం వెంట పడతాము .

    మరి ఏసంగతి అయిన యింతే అనుకుంటే పనులు చాల సులువు అవుతవి . మన భయం మరణం గురించి కనుక మనమే దానికి ఎదురు తిరిగితే సరి. అంటే ఆధ్యాత్మకముగా మనసును ధైర్యం చేస్తే మరణం అంటే భయం ఉండదు. యిది ఏనాటికైనా నిత్య సత్యము. కనుక  ఒంటరిదానినని మనసు భావించకుండా దానికి ఏదో ఒక దైవ శక్తిని జోడిస్తే అది ధైర్యం పుంజుకొని మరణాన్ని సైతం జయిస్తుంది. వేదాంతం కాదిది నిజంగా నిజం.  

1, మార్చి 2012, గురువారం

వృక్షో రక్షతి రక్షితః

వృక్షో రక్షతి రక్షితః ...

వృక్షములను మనము రక్షిస్తే అవి మనలను రక్షిస్తాయి. అవి  నిస్వార్థ జీవులు. త్యాగ జీవులు. మన మనుగడ, శ్వాస పైనే ఆధారపడి 
యున్నది. అలాంటి శ్వాసను ( ఆక్సిజన్ ) ప్రతి ఫలాపేక్ష లేకనే  యిచ్చి వాటి త్యాగమయ జీవితాన్ని రుజువు చేసుకొంటున్నాయి వృక్షాలు. అందుకనే ఒక మహాకవి , 

           పరోపకారాయ వహంతి నద్యః , పరోపకారాయ  దుహన్తి గావః ,
           పరోపకారాయ  ఫలంతి వృక్షః . పరోపకారార్థం  యిదం శరీరం.

(పరోపకారం కొరకే నదులు , ఆవులు , వృక్షాలు , మహాత్ములు .పాటు పడుతున్నారు ) అన్నాడు . మహాత్ములావిధం గానే ఉంటారు. వారు  మేలు చేసి మరచి పోతారు. వారిని  మరచి పోయినచొ  వారిపట్ల మనం కృతఘ్నులమే .  కొందరు చెట్టంత పెరుగుతారు కాని చెట్టుకున్నంత  జ్ఞానాన్ని , త్యాగ గుణమును   పొందలేరు. 
అది వారి వారి జన్మ సంస్కారం. అంతేకదా మరి.మనందరం అలా కాకుండా ఉందామా . 

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...