31, డిసెంబర్ 2012, సోమవారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు

                                శుభాకాంక్షలు 


2012  సంవత్సరము కన్నా 2013 లో అధిక సంతోషాలు. భోగ . భాగ్యాలు .శాంతి సౌఖ్యాలు ఎల్లరు 

అనుభవించాలని నా ఆకాంక్ష . 

    పొన్నెకంటి  సూర్య నారాయణ రావు 

జ్ఞాన వృ ద్ధులకు

జ్ఞాన వృ ద్ధులకు 

మీరుసూదితో బాదితే కష్టం కానీ ( శరీరానికి  ) సుకుమారమైన శ్లోకంతో బాదితే యిష్టమే. సంతోషమే. కోపం వచ్చే అవసరం . అవకాశము లేదు. అయితే వయసును బట్టి చిన్న కనుక ఆశిస్సులు ,జ్ఞానాన్ని  బట్టి ( జ్ఞాన వృ ద్ధుడే వృద్ధుడు ) కనుక నమస్సుమాంజలి .

మీరుదహరించిన భగవద్గీత 6 వ .అ . 34.శ్లో . తర్వాత , 7వ .అ .10వ శ్లో . నందు   " బీజం మాం సర్వ భూతానాం , విద్ధి పార్థ సనాతనం ,  బుద్ధిర్బుద్ధి మతామస్మి తేజస్తేజస్వినామహం "..

7వ అ .12వశ్లో .  ఏ చైవ సత్వికాభావా , రాజసాస్తామసాశ్చ ఏ ....మత్త ఏవేతి తాన్విద్ధి  న త్వహం తేషు తే మయి ...

నేను సర్వ స్వతంత్రుడనని ప్రకృతి  త్రిగుణములు నాకు మాత్రమే లోబడి యుండుననియు పల్కినాడు. కనుక జీవులకు భావ ప్రేరణ మతడే . కర్త కర్మ క్రియ అతడే . అందువలన తానె అంతరాత్మయై నిలిచినాడు . ఆత్మ కూడా అంతరాత్మకు లోబడియే యుండును .
 15వ .అ . 15వ శ్లో .. సర్వస్యచాహం  హృది సన్నివిస్టో  ,  మత్తః స్మృతిర్ జ్ఞాన మపోహనం చ , వేదైశ్చ సర్వై రహమేవ వేద్యో ,   వేదాంత కృత్ వేద విదేవ చాహం.    అంటారు పరమాత్మ.

15వ. అ . 17వ శ్లో .నందు కూడా యిదే భావం కలదు . ఆలోచన ,బుద్ధి , ఆత్మా సహిత శరీర శకటమును పూర్వ జన్మ సుకృత ,దుష్కృత , శేషముల ననుభవిన్చుటకేర్పాటు చేయబడినదనునది సత్యము. వాటిని పోషించుచు కర్మానుసారి ఐ భొగానుభవమునకు అవకాశము  నొసగు దేవదేవుడగు శ్రేష్ట పురుషుడే అంతరాత్మ.

స్వామి  వివేకానంద మొదట అత్మాలోచనాపరుడై రామ కృష్ణ పరమ హంసను సామాన్యుడని భావించి అనంతరము అంతరాత్మ ప్రబోదితుడై ఆతని మాహాత్మ్యము గ్రహించి తన గురువుగా స్వీకరించెను .

          కనుక బుద్ధి రధ సారధి ఐనను ,జీవుడు ప్రయాణీకుడైనను  , అంతరాత్మ ననుసరించియే పయనించును .

   బ్రహ్మజిజ్ఞాస యందు మాత్రము బుద్ధిని జడ పదార్థము గాను ,ఆలోచనా  కేంద్రముగాను చూపినారు .
వేదము మూలజ్ఞానమైనను వారి వారి జ్ఞాన సామర్త్యమును బట్టి వ్యాఖ్యానము లున్డుననుట నిస్సందేహము .

శ్లోక బాదుడు

     శ్లోక బాదుడును నేను ఆనందంగా స్వీకరిస్తున్నాను .కోపాన్ని ఏ కారణంగా పొందాలి.

శ్లో . విద్యయా వినయా వ్యాప్తిహి .


     సాచేత్ అవినయావహ ,

    కిం కుర్మః కిం ప్రతి బ్రూమః ,

   గరదాయా స్వమాతురి .

అందువలన నాకు నేర్పిన చదువు నాకు అకారణంగా కోపం తెప్పించదు . అయితే పట్టుదల మీరు నేర్పినదే .  

25, డిసెంబర్ 2012, మంగళవారం

ఆత్మ విచా రము .

                                                      ఆత్మ విచా రము .

     బుద్ధి .          శ్లో .. అధిష్టానం చిదాభాసో , బుద్ధి రేత త్రయం యదా .
   ....                                        అఙ్ఞానాదేకవత్ భాతి , జీవ యిత్యుచ్యతే  తదా .
                           భావం ...  అధిస్టా నమగు కూటస్తుడు, చిదాభాసుడు , బుద్ధి , ఈ మూడును , అజ్ఞానము                   వలన ఒకటిగ తోచినప్పుడు జీవ సంజ్ఞ తోచుచున్నది . 1) కూట స్తుడు ... నిర్వికారుడగుట వలన జీవుడు కాదు.  2) చిదాభాసుడు ... మిధ్య యగుట వలన జీవుడు కాదు . 3) బుద్ధి ... యిది జడ మైనది,                                    ఆశ్ర యించునది .  ఈ మూడును కలసియే జీవుడైనాడు .  ( బ్రహ్మ జిజ్ఞాస .2 వ , ప్ర .,, స్వాత్మ ..36. ) 

ఆత్మ....            జీవుడు , శ రీరాదులు
అంతరాత్మ ......బ్రహ్మ పదార్దము. 

వేదాంత పంచ దశి యందు .....బ్రహ్మమే శరీర మందు ప్రవేశించి జీవరూపు డాయెనని , ప్రాణాదులను   ప్రేరేచుట వలన జీవుని పేరు కలిగె నందురు.  ఆత్మయే శరీరాదులు తాన నుకొనుట వలన జీవ భావము కలిగె నని చెప్పిరి .  

బుద్ధి , లింగ దేహము ,ఈ రెండు , అవిద్యా పరిణామములు... ( శంకర విద్యారణ్యులు )


విచార దృష్టి తో జూచిన   జీవేశ్వర భేదమే లేదు . జీవుడు ఆలోచిందే దానినే బ్రహ్మ పదార్థము నిశితం గ ఆలోచిస్తుంది . అందు వలన ఆలోచనలకు అది నికష . 


మనో వాక్ కాయ  కర్మలే  త్రికరణములు . త్రికరణ శుద్ధి కలిగితే దైవత్వమే .

24, డిసెంబర్ 2012, సోమవారం

గోపూజ .

                             గోపూజ
 గవాం అన్గేషు స్థితః  సర్వే దేవతః అహం పూజ యామి

ఇది వేద గాయత్రీ అగ్రహారమందలి పవిత్ర గో పూజ

గోవును పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లే . .గోవులు బ్రాహ్మణులు, మహిళలు ,ఎచట పూజింప బడతారో అచట సమస్త శుభాలు జరుగుతాయి.
  










                ఆటవెలది 

గంగి గోవు పాలు గరిటెడైనను చాలు
కడివె డైన నేమి ఖరము పాలు 
భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు 
విశ్వదాభి రామ వినుర వేమ.

ఈ వేమన గారి పద్యం అందరి యెడల సార్థకం కావాలని కోరుకుందాం . సర్వే జనాః సుఖినో భవంతు .సర్వే భద్రాణి పశ్యంతు. 

                                        

            ప్రేమికుల దినోత్సవ సందర్భంగా. గో కౌగిలి. 
         14.02.2023.

అమ్మపాల రుచిని నందలేనటువంటి
           మందభాగ్యునకిది మాతృమూర్తి
కర్షక జీవుల కాడికి కోడెల
           నందించి కాపాడు నమృతమూర్తి
భూసారముంబెంచి ముక్కారు పంటల
             సంపదల్ నింపెడు సాధుమూర్తి
పుణ్య గోమాతయై ముట్టుకొన్ననె చాలు
             స్వర్గమందించు నిస్స్వార్ధమూర్తి
  ఆమె యెవ్వరో యననేల యమలదివ్య
  కామధేనువు సంతతి కరుణనిలయ
  పరమ ప్రేమామృతంబను వర్షమిచ్చి
  తనియజేసెడు శ్రీలక్ష్మి ధన్యురాలు
  కౌగిలింతల మునుగంగ కదలిరండు!                                          

22, డిసెంబర్ 2012, శనివారం

మనసు ,బుద్ది , అంతరాత్మ.

మనసు ,బుద్ది , అంతరాత్మ.

మనసు ...ఇది చంచలమైనది . చురుకైనది. కానీ దీనిని  ఒక చోట కట్టి వేయడం మానవ మాత్రులము గ మనం చేయలేము. కొంత దైవ శక్తి కావాలి. అప్పుడు మన మసును కట్టి వేయగల సూత్రాలు దొరుకుతాయి.  ఆ నాడు
మనం మనవా తీతులము అవుతాము.

బుద్ధి ... ఇది ప్రళ యాన్తకమైనది . ఆ  మనసుని అనుసరిస్తుంది అనాలోచితంగా . అందుకే , అంతరాత్మ నిశితంగా

ఆలోచించి చేయదగిన పనినే సూచిస్తుంది .అదే చేయాలి .

అంతరాత్మ.  అనంతమైన శక్తి కల దైవ వరం . దీనిని ఆధారం చేసుకొనే మనం నిర్ణయాలు  చేసుకోవాలి. ఆనాడే మనం మనవా తీతులుగా ప్రసిద్ధి కెక్కు.తాము


ఈ మూడు శక్తుల కలయికే అనంత త్రికరణ శుద్ధి . యిదే దైవశక్తి. 

21, డిసెంబర్ 2012, శుక్రవారం

పరిమళించిన కవితా హృదయం

పరిమళించిన కవితా  హృదయం     తేది 21.12.2012. రంగారెడ్డి జిల్లా ఈనాడు పేపర్ లో పడింది .ప్రపంచ తెలుగు మహా సభల సందర్భముగా మాబోటి వారికి ఒక నూలుపోగు .అంటే చిన్నపరిచయం ..యింటికి వెతుక్కొంటూ వచ్చిన సాహిత్యాభిమానం . వ్యాస కర్త  ఈ నాడు విలేఖరి చిరంజీవి నంద కిషోర్ 

19, డిసెంబర్ 2012, బుధవారం

అమ్మ

తెలుగు బాసల యాసలు తెలుపుచుండు, తెలుగు బంగారు తీగను తెంపి తెంపి ,ఎన్ని నగలను జేసిన ఎట్టులైన ,     విలువ మారదు తగ్గదు విభవమందు .

                                                              అమ్మ పాట 

అమ్మ కరుణ నాకుంటే అవలీలగ  పాటలొచ్చు  ,    అమ్మ కరుణ నాకుంటే అలవోకగ    మాటలొచ్చు  ,   అమ్మ దయయె   నాకుంటే ఆశువుగా పద్యమొచ్చు .అమ్మ కృపయె   నాకుంటే  అనగరాని దేముందీ  , అమ్మ చూపు  నాకుంటే జగమంతట జయమే ,అమ్మ మనసు నావెంటే  నాకెందుకు భయము  , అమ్మ మదిని తడివి చూడ  అమృతంపు ధారలే  . కమ్మగ అవి  త్రాగితే అసహాయపు ధీరులే    , ఆ అమ్మే వీణ పాణి , ఆ అమ్మే నలువ రాణి . మరువబోకు ,మరువబోకు  ,మహిమలన్నీ ఆమేవే . పాదకమల సేవజీసి ప్రాంజలించు భక్తి తోడ. 

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...