22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

దేవాలయానికి వెళితే దేవుని దగ్గరకు వెళ్లి నట్లేనా.

 ఉగ్ర వాదుల దుశ్చర్యలకు అమాయకులు బలి అయినందుకు విచారిస్తూ ,22..02.  13 న

చనిపోయిన వారి ఆత్మ శాన్తించాలని మనసార కొరుకొంటున్నాను . వారి వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుకొంటున్నాను .   మానవత్వం మంటకలియకుండా మమ్ములను కాపాడు భగవంతుడా                                                                      
            దేవాలయానికి వెళితే దేవుని దగ్గరకు వెళ్లి నట్లేనా. భగవంతుడిని చూచి తిరిగి యింటికి వచ్చే అదృష్టం మనకు లేదా . మతం ఏదైనా మానవత్వంతో ఆలోచించగలిగే మనసేలేదా . మనుషులు యిలా  మృగాలుగా ఎందుకు మారుతున్నారు . ఉదాహరణకి ,  భర్తృహరి గారి ఒక పద్యం చూద్దాం .

     ఉ.  గ్రాసములేక స్రుక్కిన జరా కృశమైన ,నిశీర్ణ మైన ,సా

          యాసము నైన నష్ట రుచియైన మదేభకుమ్భ  .......

అని సింహము యొక్క పరాక్రమాన్ని వర్ణిస్తూ .  అది యెంత ఆకలి వేసిన ఏనుగు కుంభ స్థలాన్ని మాత్రమె చీలుస్తుంది ,తింటుంది ,కాని గడ్డి తినదు అంటాడు . కనుక సామాన్యుల మీదకు రావటం అలాంటిదే .                     మృ గాలకున్న నీతి కూ డా మనకు లేదా . ఎంతో విజ్ఞానుల మంటూ అన్ని లోకాలికి వెళ్లి వస్తున్నాం . కాని ఏ విజ్ఞానము మనలను కాపాడలేక పోవటం దురదృష్ట కరం

హైదరాబాదు మనకు ఒక భాగ్యనగరం . అనుకునే పరిస్తితులు లేవా . ఈనాడు జరిగిన మరణ కాండ ,మారణ కాండ, దిల్శుఖ్నగర్లో జరిగిన్ది. దిల్ షుఖ్ మనిషికి పేరులో మాత్రమె మిగిలిన్ది. మరి ఇలాంటి స్తితిలో మన జీవితాలు గాలిలో దీపాలెనా .  విద్యయా వినయా వాప్తిహి  ,సాచేత్  అవినయావాహ , కిం కుర్మః కిం ప్రతి బ్రూమః  గరదాయా స్వమాతరి.  .విద్య వలన వినయాది సద్గుణాలు రావాలిదానికి బదులు దుర్గుణాలు  వస్తే అది స్వయముగా తల్లే విషం పెట్టినట్లు అవుతుంది అనేది దీని అర్థమ్. మనం ఏ స్తితిలో ఉన్నామో ఏమి అర్థం కావటంలేదు .  ఉగ్రవాదుల మనస్సులు సమగ్ర ప్రేమ ,మానవతా భావాలతోనిండి మనమందరం క్షేమంగా ఉండాలని త్రికరణ శుద్ధిగా కొరుకొన్దాము. తధాస్తు. 

17, ఫిబ్రవరి 2013, ఆదివారం

అతి సర్వత్ర వర్జయేత్

అతి సర్వత్ర వర్జయేత్ .

నమ్మి చెడ్డవాడు .......అనే సామెత భగవంతుని గూర్చి చెప్పింది . నమ్మకం వ్యతిరేక పదం అప నమ్మకం . కాని అమ్మకు వ్యతిరేక పదం నాన్న కాదు . వినియోగం విలువ తక్కువదే అయితే విలువకే విలువ తక్కువ. గుడ్డి తనం (అపనమ్మకం ) ఎక్కువ అయితేనే కదా చూపు మందగించేది .మోసగించి పై చేయి తెచ్చుకొని మోసగింప బడిన వాని ఎదాన బడి , వాడి మానసిక వేదనకు , ( ఒక్కొక్క సారి ) మరణానికి కారకుడైతే మిగిలేది పై చెయ్యి కాదు . పై లోకమే . ఈనాటి సమాజంలో

            . శ్లో ." యేన కేనాప్యుపాయేన .ప్రసిద్ధః పురుషో భవేత్ " . 


               అనే దానిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళుతున్నామని అనుకోని వెనక్కు వెళుతున్నారు. దాని సరైన అర్థం ఏ మంచి పని అయిన చేసి అని తీసుకొంటే మానవ కల్యాణం జరుగుతుంది. అలాగే నమ్మకం ,ఆశ ఉండాలి , కాని గుడ్డి నమ్మకం , అత్యాశ ,అనర్థ దాయకాలు . 

                       " అతి సర్వత్ర వర్జయేత్ " కదా . 

           ఈనాడే  కాదు ఏనాటి మోసాలకైన ,గుడ్డి నమ్మకం , (మానవుని విషయంగా)అత్యాశే కారణం. 

16, ఫిబ్రవరి 2013, శనివారం

\\నమ్మకం //మానవఖర్మం

 \\నమ్మకం // 

నమ్మకం అనేది మనిషికి చాల అవసరం . ఏ నమ్మకం అయితే మనిషికి మేలిమి బంగారం లాగా మేలు చేస్తుందో అదే నమ్మకం గ్రుడ్డిది అయితే   మనిషిని మసి చేస్తుంది. దీనికి తోడుదొంగ ఆశ . నమ్మకం మీదే ఒక ఆశ కలుగుతుంది. అయితే రెండింటిని సాలోచనాత్మకంగా , సమన్వయ పూర్వకంగా , ముందు చూపుతో , కొంత అనుభవం తో , అంతరాత్మ చెప్పే సత్యాలను నమ్ముతు అడుగులు వేస్తె అనర్థాలకి కొంత దూరంగా ఉండవచ్చు. కాని విధి మనలను కర్మానుభవం వైపే నడుపుతుంది. నమ్మకం యెంత బలమైనదో , ఆశ కూడా అంతే  బలమైనది. అందువల్ల మోసగించే వాడిదే నిరంతరం పై చేయి అవుతున్నది. దానికి తార్కాణమే కోట్లను అవలీలగా సంపాదించాలనే ఆశతో,వస్తాయనే గుడ్డి నమ్మకంతో మనం ముందుకు సాగటమే మన పతనానికి నాంది అవుతున్నది. యిలా జీవితం ఎన్ని పాఠాలు నేర్పినా మనకు రోజు కొత్తే .తప్పులను చూస్తూ కూడా తప్పులు చేయడమేనా మానవఖర్మం కాదు,కాదు మానవ ధర్మం .

5, ఫిబ్రవరి 2013, మంగళవారం

ఆహా అమ్మ భాషకు

          ఆహా  అమ్మ భాషకు అందలమట.

ఎవరి అమ్మ వారికి గొప్పే . లంకను చూచి ఆనంద పడుతూ లక్ష్మణుడు , అన్నయ్య  యిక్కడ చాలా బాగుంది , మనం యిక్కడే ఉందామా అన్నప్పుడు శ్రీరామచంద్రుడు చెప్పిన సమాధానమిది .


   శ్లో ." జననీ జన్మ భూమిశ్చ ,స్వర్గాదపి గరీయసీ,"

 అని  .  ఈ  శ్లోకానికి సార్థకత కల్పించటానికిన్నాళ్ళకు , కాదిన్నేళ్ళకి   ప్రభుత్వమే పూనుకుంటే తెలుగు భాషాభిమాను లందరకు కలిగే సంతోషం వర్ణనా తీతమే, అందరం అమ్మ ఒడిలో ఉన్నఆనందం అనుభవిస్తాము. ఇది ప్రకృతి సహజమేకదా . మనం మనలాగా ఉంటున్నందుకు ఆనందంగా లేదూ . ఈ ప్రయత్నానికి అందరం సహకరించుదాం. 

4, ఫిబ్రవరి 2013, సోమవారం

బంధాలు అనుబంధాలు


బంధాలు అనుబంధాలు 4.02.2013
.
ఇవి మనం ఊహింప గలమా.. . బంధం మనం కల్పించు కొన్నదైతే , అనుబంధం సహజ సిద్ధంగా  ఏర్పడేది . ముందుగ మనం వివాహ పరంగా ఒక బంధం ఏర్పాటు చేసుకొంటాము . సంతానం కలగటం వలన వారికొక అనుబంధం ఏర్పడుతుంది . అనుబంధానికి సంకేతమే ప్రేమ .బన్ధానిది ఒక ప్రేమ .అనుబందాని కి మరొక ప్రేమ .ఈ ప్రేమలు మానవత్వానికి ప్రతీకలుగా ఉంటె, పస్పరం అనుబంధం బలపడి, అవి  కుటుంబానికి ,సమాజానికి , దేశానికి మేలుని చేకూరుస్తాయి . అయితే సమాజంలో ఎక్కువమంది   అసూయా, ద్వేషం, అహంభావం , అనే స్వార్థభావాలు  మూలాలుగా  కలిగియుండుట చేత మనం అనుకునే అనుబంధాలు ,బంధాలు . వ్యర్థ పదాలుగా కేవలం కధలలో, కవితలలో, ఉహలలో  మిగిలి పోతున్నాయి . విడిపోతున్న బంధాలకు , అనుబంధాలకు నిస్స్వార్ధవర్తనమే సరి అయిన పరిష్కారం . జీవితం మనమూహించినంత సుదీర్ఘమైనది కాదు . కనుక యిద్దరి మనసులలో నిస్వార్థంగా , సాంఘిక మర్యాదలతో కలిగే ప్రేమ, అనేక బంధాలకు , అనుబంధాలకు సంకేతమై నిలుస్తుంది. అందుకనే హిందూ ధర్మానుసారం , ఒక వ్యక్తి తల్లి గాని, తండ్రి గాని మరణించి నప్పుడు  పేగు బంధం తెగి పోయినది అనుదానికి సంకేతం గ దీక్షా వస్త్రంలో ఒక భాగాన్ని  చింపి అతని మెడలో వేస్తారు , కార్య క్రమాలు పూర్తి   కాగానే తీసివేస్తారు . మనం వాటిని నిలబెట్టుకోకపోతే మానవత్వానికి , హిందుత్వానికి విలువ ఏముంటుంది . 

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...