28, నవంబర్ 2014, శుక్రవారం

తెలుగు పలుకు, ఘనతకు కారణాలు.

 తెలుగు వెలుగులోకి రావాలంటే తెలుగు వచ్చిన ప్రతివారు మౌనం విడనాడాలి . తెలుగుకు వెన్నుదన్నుగా నిలవాలి. తమ వంతు సహాయం చేయాలి .

 తెలుగు పలుకు పలికి దేశాల  వినిపించి 
 తెలుగు పద్య మనుచు తేనె లొలికి 
 తెలుగు వారి ధీర తేజంబు జూపుచు 
 వెలుగు మోయి సతము వేయి నాళ్ళు 

 
మన మాతృభాష గొప్పదనుటకు ౠ. బావగారు(సత్యనారాయణ గారు) పంపిన ఆంగ్లమునకాంధ్రానువాదం.1. క్రీ.శ. 400సం.ల.నుండి తెలుగు ఉన్నట్లు తెలుస్తున్నది. 2. తెలుగు లిపి అంతర్జాతీయ అక్షర మాలా సంఘముచేత 2012లో ఉత్తమ రెండవ లిపిగా ఎన్నుకో బడినది.(కొరియా కు 1వ స్థానం)3. తెలుగు భాషోచ్చారణ వలన 72000నాడులు స్పందిస్తాయని విజ్ఞానశాస్త్రం నిరూపించింది. 4. శ్రీలంకలో ని జిప్సీ అను తెగవారు ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు. 5. మయన్మార్ లో తెలుగు సంఘాలు చాలా ఉన్నాయి.6. ఈభాష ఇటాలియన్ భాష వలె అచ్చులు చివరగా ఉండుటచే భాషాపరిషోధకుడైన "నికోలో డి కాంటి" తెలుగు ను "ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్" అన్నారు. 7. ప్రపంచ మానవజాతి విషయ సేకరణ శాస్త్రవేత్తల జాబితా ప్రకారం దేశ పరిధిలో 3వ దిగా , ప్రపంచ పరిధిలో 15 వదిగా లెక్కించారు. 8. భారతదేశంలో ని నిజాం లోని కాళేశ్వరం, రాయలసీమలో ని శ్రీశైలం, కోస్తాలో ని భీమేశ్వరంలోని మూడు శివలింగముల మధ్య వారు మాట్లాడే భాష కనుక దీనిని త్రిలింగ,తెలుగు, అని పిలువబడుతున్నది..9. తూర్పు దేశ ప్రాంతంలో అజంతంగా మాట్లాడే భాష తెలుగు.10. ఎక్కువ సామెతలు న్న భాష తెలుగు. 11.పూర్వము కూడ తెలుగు,తెనుగు,తెనుంగు అని పిలిచేవారు. 12. రవీంద్రనాధ్ఠాగూర్ కూడ దేశభాషలందు తెలుగు తీయనిదన్నారు. 13. 200 సం.ల క్రితం 400 మంది మారిషస్ కు బానిసలుగా పంపబడితే వారి వారసులలో ఒకరు ఇప్పటి ప్రధాని. 14. 40 సంస్కృత శ్లోకాలు (రామకృష్ణ విలోమకావ్యం) మొదటినుంచి చివరకు రామాయణం, చివరినుండి మొదటికి భారతం ఉంటుంది. ఇలా మరే భాషలో లేదు. 15. శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకాకుళములోని ఆంధ్రమహా విష్ణువు ను భక్తి శ్రద్ధలతో ధ్యానించి వారి ఆదేశానుసారం "ఆముక్తమాల్యద"ను వ్రాసి, "దేశభాషలందు తెలుగు లెస్స" అని తెలిపి ఆ భాషను ఆధికారికం చేశారు. 16. తెలుగు భాషలో మాత్రమే ఏకాక్షరి పద్యములున్నవి. .....జై తెలుగు, జైజై తెలుగు భాషాభిమానులారా! నమస్సుమాంజలులు.... పొన్నెకంటి.

19, నవంబర్ 2014, బుధవారం

అవధాన రాజధానీ ,నిషిద్ధాక్షరి, గీతం.

        ది. 2. 11. 14 నుండి 9. 11. 2014 వరకు . అవధాన రాజధానీ 

.           ఈ కార్యక్రమం మహోన్నతంగ  భారత దేశ రాజధాని అయిన డిల్లి మహానగరం లో  ద్వి సహస్రావధాని ,డా . మాడుగుల నాగ ఫణి శర్మ గారి చే నిర్వహించబడింది . పృచ్చకులసంఖ్య 250.  ఉత్తర,దక్షిణ  ప్రాంత సంస్కృత కవులు , పండిత ప్రకాండులు కళాకారులు , రాజకీయ నాయకులు  ఎందరో పాలుపంచుకొన్నారు ఎందరో మహాను భావులు . అందరికి వందనాలు .  . 
   
  దీనిలో ముఖ్యముగా 1. సమస్య . 2. దత్త పది . 3. నిషిద్ధాక్షరి 
4. వర్ణన  5 . అశువు   6. మీమాట ..నా పాట . 7. నృత్య పది . 
8. స్వర పది . 9. చిత్ర పది.అనే  అంశాలు ఉన్నాయి. 

అన్ని అంశాలు మనోహరం గ మనో రంజకం గ సాగినవి. నేను 

నిషిద్ధాక్షరి లో పాలు పంచుకొన్నాను నిషిద్ధాక్షరి అవధాని గారికి  పృచ్చకునకు మధ్యన జరిగే సాహిత్య (తో )రణం.  దీనిని 
పద్య రచన చేయగలిగిన వారు మాత్రమే ఆనందించ గలుగు తారు. 
తదన్యులు ప్రయత్న పూర్వకముగా ఆనందించగలరు . 

   సాధారణం గ అవధాని పద భాండాగారము . పదకొశమును యెదలో నిత్యం మననము చేస్తూఉంటారు  అందువలన  పై చేయి వారిదే నిస్సందేహంగా . ఇందు  పృ చ్చకుని పద, పద్య , భావ పాండిత్యము , కూడా పని చేస్తుంది . దాని వలన అవధాని గారిని కొంత వరకు యిబ్బంది పెట్ట వచ్చు . 

విషయము .     సంగీతము . రొగనిర్మూలన కారిణి . 


 కంద పద్యము .  ( పాద ప్రారంభములో యతి ఉంటుంది కనుక అవధాని గారే ప్రారమ్భిస్తారు. )

కం    (అవధాని గారు ) భో గా () ( నిషేధం) ( ఆవ  ) ( నిషేధం) ( ఆవ ) సం ( నిషేధం ) మీ ( ఆవ)రా (నిషేధం ) గా ( ఆవ) త్రం ( నిషేధం ) నం ( ఆవ)

    (ఆవ) బాగా  న (నిషేధం )ధం ( ఆవ) తె ( నిషేదం  ) జె ( ఆవ) వి ( నిషేధం) ప్ప ( ఆవ) వి (నిషే )రో ( ఆవ )
       గా (నిషేధం ) (ఆవ) సాం  ( ఆవ) యతి స్థానం కనుక వారె ప్రయోగం . ( నిషేధం ) ( ఆవ) ము (నిషే)
       ర ( ఆవ) స్థి (నిషే) ( ఆవ) (నిషే) తి ( ఆవ) గా (నిషే ) యౌ (అవధాని )

కం .భోగాయతమీ గానం , బా గాధం జెప్ప రోధసాంతరదతియౌ

 (ఈ రీతిగా రెండు పాదములు నిషేధ, నిక్షిప్తాలతో సాగినది.  మిగిలిన రెండు పాదములు ఈ విధం గ ఊహించి వ్రాయడమైనది . )

   రాగార్చితంపు దైవము , సాగున్ వైద్యంబు పగిది స్వాస్త్యము  గూర్పన్

అవధాన   రాజధాని బ్రహ్మశ్రీ నాగ ఫణి శర్మగారి చేత విజయవంతమ్ చేయబడినది. నేను నిషిద్ధాక్షరిలో పాల్గొన్నాను . చాలా  చక్కని  పద్యం  వచ్చింది . 

విషయం ..  సంగీతం .  రోగ నిరోధకం . 

కం .  భోగాయతమీ గానం 
        బాగాధం జెప్ప రోధసాంతర దతియౌ . ( ఈ రెండు పాదములు నాగఫణి గారు చెప్పినవి )
        రాగార్చితంపు దైవము , 
        సాగున్ వైద్యంబు పగిది సౌమ్యత గూర్పన్. ( ఈ రెండు పాదాలు నేను ఊహించి వ్రాసినవి )

నాగఫణిశర్మ గారిని అభినందిస్తూ వ్రాసిన గీతమ్.

పల్లవి ..  నలువ రాణి పాదమణి   , నాగఫణి  మీరు  . 
             పలుకులమ్మ పనుపున , నిల దిగిన సౌరు. 

చరణమ్ .రాజధాని నంత రస రమ్యం జీసి  
             కళల సారమెంతెంతో కలగలుపుగ నేసి
             అసమానపుటనురాగం అందరకు పంచి 
             కవి, పండిత, చిత్రకార,గాయకాళి రప్పించి .               
                                      
                                     నలువ రాణి పాదమణి, నాగఫణి  మీరు.

ప.         దిల్లి ప్రభుత కవితకున్న ప్రాముఖ్యం దలచి 
            తల్లివోలె తపన తోడ తనవద్దకు పిలచి 
             వినిపించెను వినువీధిని విమల తెలుగు కవిత 
             వ్యాపించును తరతరముల జిలుగు వెలుగు భవిత .
      
                                   నలువ రాణి పాదమణి, నాగఫణి  మీరు.  

చ.        క్రొత్త పుంత  త్రొక్కుట క్రొత్త మీకు కాదు . 
            అవధానము , ధారణంబు  వింతేమి కాదు . 
            కుంచె వెంట కూర్చుపదము కోరుకున్న కూర్మిపధము 
            నృత్త పదము , నృత్య పదము నవ్య పధం మీకు .      
                       
                                నలువ రాణి పాదమణి, నాగఫణి  మీరు.  

ప.       సంస్కృతంబు , రాజ భాష  సవరించిన గళము 
           ప్రకటించును స్వారస్యము మీదు పొన్ను కలము 
           కవిత మీకు బలము , రసము మాకు ఫలము 
           నవ రసాలు చిలుకుటే నవ్య వరము మాకు .

                                నలువ రాణి పాదమణి, నాగఫణి  మీరు.  

                              
     




       





15, అక్టోబర్ 2014, బుధవారం

విశ్వ ప్రయత్నమే విజయ హేతువు .

                                విశ్వ ప్రయత్నమే  విజయ హేతువు .                                                                                      ఈ రోజు నాకు చాలా  సంతోషం గా ఉన్నది . రాధి వాళ్ళ టాబ్ నుండి తెలుగులో టైప్ చేస్తున్నాను . సాధనే సర్వతో ముఖ విజయ హేతువు . కిరణ్ పుట్టిన రోజు సందర్భం గా ఒక ఫోటో మీద వాడికి  శుభాకాంక్షలు పంపా ను . అది  వాడికి చాలా బాగా నచ్చింది . ఈ టాబ్ లో చాలా సమయం వరకు తెలుగులో టైపు చేయటానికి రాలేదు . అయినా నా ప్రయత్నం వదల లేదు . విశ్వ ప్రయత్నమే
 విజయ హేతువు . 

30, సెప్టెంబర్ 2014, మంగళవారం

బీదర్ లోని లక్ష్మీనరసింహ స్వామీ ఆలయ దర్శనం . ది 30.. 14

             బీదర్ లోని లక్ష్మీనరసింహ స్వామి  ఆలయ దర్శనం .ది 30.09 . 14 

లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రవేశం ఒక ప్రత్యేక మైనది . తాండూరు లోని 
ద్వాదశ శివ క్షేత్రం సుప్రసిద్ధము  . ఎందుకనగా పరమ శివుని దర్శించటానికి 
భక్తులు కొంత దూరం నీటి లో నడవాలి . ఆ నీరు షుమారు రొమ్ముబంటి ఉంటాయి . ఇష్టమైన  వారు నీటిలో వెళ్ళుట , అలా వీలుకాని వారు వేరే విధం గ వెళ్ళుట జరిగి మొత్తానికి శివ దర్శనము చేసికొన వచ్చును, 
               
కాని బీదర్ లో మాత్రం తప్పక నీటిలో వెళ్లి మరల నీటిలో నుంచే రావాలి. ఆ నీరు మొలబంటి ఉన్నాయి .వయసు యెంత అయిన ఎవరికి వారికి రొమ్ము బంటే నీరు వస్తాయట . అదే నరసింహ స్వామి మాహాత్మ్యమట . కాని ఈ రోజు మాత్రం నీరు కటి బంటి  మాత్రమె ఉన్నాయి .  ఏ రకమైన యిబ్బంది లేకుండా మేమందరము  స్వామిని దర్శించుకొని వచ్చాము . చాల ఆనందం గ ఉన్నది. 101 అంటి గారి భర్త గారిని కూడా జాగ్రత గ తీసికొని వెళ్లి తీసికొని వచ్చాను. ఆయన ఉబ్బసము తో బాధ పడుతున్నారు . కాని వెళ్లి రావటం లో ఏ యిబ్బంది పడలేదు . 

26, సెప్టెంబర్ 2014, శుక్రవారం

అన్నమయ్య సంకీర్తనల కార్య క్రమం

ది. 26..09. 14. న అన్నమయ్య సంకీర్తనల కార్య క్రమం చాల బాగా జరిగింది . కీర్తనలకు చేసిన వివరణ అందరికి నచ్చింది . 

25, సెప్టెంబర్ 2014, గురువారం

దసరా ది. 26..09 . 14 న కార్యక్రమము .

           శరన్నవ రాత్రి ఉత్సవముల సందర్భముగా .( దసరా) ది. 26..09 . 14 న కార్యక్రమము .

               శ్రీమాన్ మరింగంటి రాఘవాచార్యుల  వారితో ( అష్ట లక్ష్మి దేవాలయ ప్రధాన అర్చకులు ) పరిచయం.  (ది. 24. 09. 14 న )

   దేవాలయ ప్రాంగణం లో ది. 26. 09. 14. ఉదయము 8. గం .లకు శ్రీమతి  వి. వి. యస్. కృష్ణ  కుమారి , మరియు  శ్రీమతి  పద్మ లత గారు  అన్నమాచార్యుల వారి కీర్తనలు  పాడుటకు  అనుమతి లభించింది . కృష్ణ కుమారి గారు కీర్తన లకు వ్యాఖ్యానం ఉంటే  బాగుంటుందనే ఆలోచన వచ్చి నన్ను చెప్పమని అడిగారు . నేను

అంగీకరించాను . వారి కీర్తనలకు అనుగుణం గ విషయం వ్రాసుకొన్నాను . ఈ రోజు ఆచార్యుల వారి దగ్గర కొంత అభ్యాసం చేయాలని విషయం వారికీ చూపించాలని అంటే వారి యింటికి వెళ్ళాము . నేను వ్రాసిన దానిలో అన్నమయ్య గారిని గురించి కొంచెం తగ్గించి చెప్పమన్నారు . మిగిలినది అంతా బాగున్నది అని అన్నారు . చాలఆనందం గ ఉన్నది. కార్య క్రమం 
విజయవంతమైతే యింకా ఆనందం . క్రొత్త క్రొత్త అనుభవాలు వస్తున్నాయి . 
అయాచితం గ వచ్చే అవకాశాలే మధురానుభూతులను యిస్తాయి . విలువలను పెంచుతాయి. 

.

5, సెప్టెంబర్ 2014, శుక్రవారం

గురు పూజోత్సవము సందర్భముగా 5.09.2014.

 (గురు పూజోత్సవము సందర్భముగా


శ్లో.  గురుర్ బ్రహ్మ , గురుర్ విష్ణుః , గురుదేవో మహేశ్వరః
       గురుస్సక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః . )

  శ్లో. అజ్ఞాన తిమిరాన్ధస్య జ్ఞానాం జన శాలాకయా
      చక్షు రున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః .

     మాతృ దేవో భవ, పితృ దేవో భవ ,ఆచార్య దేవో భవ, అతిధి దేవో భవ .

     జన్మ నిచ్చిన తల్లి ప్రధమ గురువు . నడక నేర్పిన తండ్రి ద్వితీయ గురువు .నడత నెర్పుతూ , జ్ఞాన భిక్ష పెట్టె వారు త్రి గుణ రూపులైన వారు తృతీయ  గురువులు. భగవత్ స్వరూపులైన  వారు , హిందూ సంప్రదాయానికి ప్రతీకలైన వారు, తురీయ గురువులు .                         ఎందరో మహాను భావులు అందరికి వందనములు .

  అకలంకంబగు నక్షరంబులను , సర్వార్ధ్హార్ధ సిద్ధం బుగాన్ ,
  సుకరం బయ్యెడి రీతిగా  మదికి సంస్తూయాత్మ పాండిత్యమున్,
  సకలంబున్ దయ జూపి నేర్పిన గురుస్స్వాముల్ విచారింప ..నా
  కొకరా యిద్దర ముగ్గురా నలుగురా ఉన్నార లెందెందరో  .

28, ఆగస్టు 2014, గురువారం

శారద నీరదేందు





శారద నీరదేందు ....పద్య ప్రతి పదార్ధం.  శారద = శరత్కాలమన్దలి, నీరద =మేఘము , ఇందు=చంద్రుడు , ఘనసార =కర్పూరము , పటీర =పటిక, మరాళ=హంస , మల్లికాహార =మల్లెల దండ , తుషార =నీటి తుంపర , ఫేన =నురుగు , రజత +అచల = వెండికొండ , కాశ=రెల్లుగడ్డి ,ఫణీశ =నాగేంద్రుడు , కుంద=మల్లె , మందార =తెల్ల మందార ,సుధా పయోధి = పాల సముద్రము , సిత=తెల్లని , తామరస =తామరపువ్వు , అమర వాహిని = గంగానది , వలె, శుభ ఆకారతన్= ఆకారముతో , ఒప్పు =ప్రకాశించు , నిన్ను, మదిన్ =మనసులో , ఎప్పుడు , కాన గల్గుదు , భారతీ .

 పోతనామాత్యులు అన్ని తెల్లని రంగు గలిగి వానితో సరస్వతిని పోలుస్తూ మనోహరంగా వర్నిచిన పద్య రత్నము .  

24, ఆగస్టు 2014, ఆదివారం

అమ్మను నాన్నలో .....ది. 24. 08. 14.

                           శివాయ గురవే నమః

                     అమ్మను నాన్నలో .....ది. 24. 08. 14.
         ( వైష్ణవీ మాత ను గంగాధరునిలో )

శ్లొ. వాగార్దావివ సంపృక్తౌ ,వాగర్ధః  ప్రతిపత్త యే ,
    జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ

వాక్కును అర్ధము కలసి యున్న రీతి గా
పార్వతీ పరమేశ్వరులు కలసియే ఉంటారు .

అమ్మను నాన్నలో , నాన్నను అమ్మలో
చూడవచ్చు .

 నేను హిమాలయాల్లో ఉన్న వైష్ణవీ మాతను
 చూద్దామని అనుకున్నా . కాని నా శ్రేయోభిలాషులైన
 భిష గ్వర్యులు మీరామెను ప్రత్యక్షంగా నేత్రాలతో చూడటం శ్రేయస్కరం కాదని , సముద్ర మట్టానికి దాదాపు 5000 మీటర్ల  ఎత్తున ఉండటం వలన , మామూలు
 గుండెలకే ఊపిరి అందదని , మీ గుండె రిపేరు చేయ బడింది కనుక అసలు కూడదని వారించారు . నిషేధించారు .
నేత్రాలతో చూడలేనివి  ఎన్నో మనో నేత్రముతో  చూడవచ్చు కదా. అందుకని గంగాధరుని వామ భాగం
మనో నేత్రం తో చూచి , అమ్మ వైష్ణవీ దేవిని దర్శించిన మానసిక తృప్తిని ,ఆనందాన్ని , పొన్దాను పైసా ఖర్చు
లేకుండా . కళ్ళ తో చూచినవి ఎప్పటికైనా మరచే  అవకాశం లేక పోలేదు . ఇలా మనసు తో దర్శిస్తే  ఇలలో
నున్నంత  కాలం  మరువలేము . ఈ భావన చ్చన్దస్సులో  ఎలా ఉంటుందో నని ఆలోచన వచ్చి అమలు పరిచానంతే .
1. వాసవి, వైష్ణవీ సతి నవారిత భక్తిని దర్శనార్ధమై
   దోసిలి యొగ్గి కోరితిని తోయజ నేత్రుడు గంగధారినిన్
   దోసము గల్గు మీ యెడద దుస్తర పర్వత శ్రేణి మీదటన్
  మోసము చేయవచ్చనుచు మోదము తెల్పరు ఖండితంబుగాన్ .

2. చక్కని యోచనన్ సలుప సాగితి నిట్టుల మానసంబునన్
   ఎక్కడ జూచినన్ గలుగు నీశ్వరి రూపము భక్తి  నిన్డినన్ .
   మక్కువ మీర కాంచెదనుమాపతి   కాయపు వామభాగమున్
  దక్కును నాకు వైష్ణవి సు దర్శనమాత్రపు భవ్య భాగ్యముల్.

3 అమ్మకు మారు రూపమగు నాశ్రిత వత్సల తత్త్వ మెంతయున్ ,
  చెమ్మగు కన్నులం గలిగి చిత్తము మొత్తము నామె వేడినన్
  రమ్మని కౌగిలించి తనరారెడు ప్రేమను వృష్టి సేయు .. మా
  యమ్మగు వైష్ణవమ్మ నిల హార్దిక భక్తిని నంజలించెదన్.

4. ఎంత చేసికొన్న నంతనె ఫలమిచ్చు , నదికమంచు కోర నర్హమగునె ,
   చేయునపుడె  మనము చిత్తంబు రంజిల్ల . భక్తి తత్త్వములను పరగ వలయు. .

5. చానగు వైష్ణవిన్, పరమ సాధ్విని, అంబను , విశ్వ శక్తినిన్ ,
   మానస దర్శనంబు కడు మాన్యత, ధన్యత, సత్ఫలంబిడన్,
   నేనటు జేసితిన్ మదిని నిల్కడ యైన సభక్తి ప్రేరణన్ .
   వేనకు వేలు జోతలివె  వేడ్కను నర్పణ జేతు  మాతకున్ .
 

18, ఆగస్టు 2014, సోమవారం

కృష్ణాష్టమి

కృష్ణాష్టమి

కంజ దళాక్షుని , కన్జాతముల బోలు ఈ చిన్ని పాదముద్రలు మధురా నాధుని , మధుర మనోహర 
మనోజ్ఞ , మంజుల, మాననీయ సౌందర్య విలసితాలు . చిన్ని కృష్ణుని చిరునవ్వులు చిద్విలాసపు 
భువనైక మోహనాలు, అమాయకత్వపు అద్వితీయ నటనా సౌందర్య సారస్యానికి సమగ్ర స్వరూపాలు .ఆ మురళీ నాధుని జన్మాష్టమి సకల భువనములకు పుణ్యా స్టమి. శ్రీ కృష్ణ కృపా కటాక్ష వీక్షణ మహత్ భాగ్యం సర్వులకు కలగాలని మనాసా ఆసిస్తూ. మా యింటికి వచ్చిన జాడలు మీకు చుపిస్తూ .

4, ఆగస్టు 2014, సోమవారం

మానవత్వం

                                                                              మానవత్వం
                                                                         
ఎవరన్న కష్టం లో ఉంటే వారికివారే  కష్టంలో ఉన్నట్లు యితరులకు తెలియజేస్తేనే తెలుస్తుంది. కానీ ఆ సమయంలో అది అందరికి అందించలేక పోవచ్చు . మానవత్వం ఏమంటే ఆ విషయం ఎవరి ద్వారా తెలిసిన వెళ్లి ఓదార్చాలి. అలా ఓదార్చి నా మానసిక బాధని పంచుకొన్నవాడు స్వయంగ నా బావ మరది కీ .శే . గంగరాజు వాసుదేవ మూర్తి . మరొకరు మా కుటుంబ వైద్య శిఖామణి . వారికి కృతఙ్ఞతలు .ఇది 8 సంవత్సరముల నాటి మాట. హృదయాని కలిగిన కోత ఫలితంగా , మానసిక వికారాలు. ( ఊహలు, వగైరాలు ) చెబుతుంటే  అందరు విసుక్కునే వారు. వారు  మాత్రం మీ భావాలన్నీ కాగితం మీద చమత్కారాలు కలిపి పెట్టండి అని సలహా యిచ్చారు . దాని ఫలితమే  ఈ నాటిక. ఇప్పుదేంటి 8 సంవత్సరాలనాటి  సోది అంటారేమో. మొన్ననే దానిని కంప్యుటర్ లో బంధించాను. క్షమించండి.  అందుకని. 

19, మే 2014, సోమవారం

శిరిడి సాయినాధుని దర్శించుకొనే భాగ్యం

కర్నూల్ కు సుమారు 30 కి మీ. దూరంలో ఉన్న ఐదవ శక్తి పీఠమైన , జోగులాంబా దేవిని మొదటగా  చూచే అదృష్టం కలిగింది. ఆ తరువాత భక్త ప్రహ్లాదుని  అవతారమైన రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకోవటం జరిగింది . ఇది ఒక మనోహరానుభూతి .రెండు రోజుల వ్యవధానములోనే శిరిడి సాయినాధుని దర్శించుకొనే భాగ్యం కలిగింది. అనుకోని దర్శనమే సాయి బాబా ఇస్తారని అది వారి ప్రత్యేకత  అని అంటారు. నేనలానే పొందాను .  శిరిడి కి 90 కి . మీ  దూరం లో ఉన్న నాసిక్ తరువాత త్రయంబకేశ్వరుని దర్శించటం జరిగింది . గోదావరి జన్మఆపర్వత శ్రేణుల  సమీపం లోనే జరిగింది. పునీతమైన ఆ ప్రదేశాలు తిరుగుతుంటే మధుర మనోహర భావన ఎవరికైన తప్పక కలుగుతుందని నా భావన . అవకాశాలు చెప్పి రావనేది సత్యం.  చిత్రాలు మనోహరం. చూడండి భక్తి తో  మైమరచి . ఈ అవకాశానికి కారకుడు యల్లాప్రగడ సాయి తేజో భరద్వాజ. . వాడి శిరిడి మ్రొక్కు కారణం . 8 మందిమి కలసి మహదానందం పొందాము .































11, మే 2014, ఆదివారం

చాలదు భావం అమ్మ గూర్చి చెప్పటానికి .

చాలదు భావం అమ్మ గూర్చి చెప్పటానికి .
చాలవు పదాలు అమ్మ గూర్చి చెప్పటానికి .
చాలవు శబ్దాలు అమ్మ గూర్చి చెప్పటానికి .
చాలవు లేఖినులు అమ్మ గూర్చి వ్రాయటానికి .
చాలదు యెంత సేవైన అమ్మకు చేయటానికి .
చాలదు యెంత ధనమైన మాత్రూణము తీర్చటానికి .
చాలవు ఎన్ని జన్మలైనా అమ్మ ప్రేమకు బదులివ్వటానికి
చాలరు ఎందరున్న అమ్మ పదవి తీర్చటానికి .
ప్ర కృ తే  అమ్మ , అమ్మయే ప్ర కృ తి .
 పురుషుడు నాన్న ప్రకృతి తోడుగా  నాకు మమతల మల్లెలు పంచారు
అందుకు చాలిన ఆలోచన నాకొకటి వచ్చింది . అదే నిరంతరంప్రేమగా  మాతాపితృభ్యో నమహ అనటం.
తన జన్మకు కారకులైన వారికి చెరగని చిరునవ్వుతో ప్రేమను పంచటం,పెంచటం
చాలు చాలు చాలు అంటుంది చల్లని తల్లి ఎవరైనా ఎక్కడున్నా .

        మాతృ దినోత్సవం సందర్భంగా . నమస్సులతొ.  సూర్యనారాయణ రావు . 11. 05. 14

11, ఏప్రిల్ 2014, శుక్రవారం

బెండపూడి లక్ష్మి కుమారి గారికి అభినందన పద్యము

   శ్రీమతి బెండపూడి లక్ష్మి కుమారి  గారికి అభినందన పద్యము. ( వల్లీ  కల్యాణం ) 9.04.2014.



సీ.  సంగీత సాధనన్ సం స్తూ యమానినై 
                        వాణి కి రూపుగా వరలె  నెవరు 
      సాహితీ పాతవ సమ్స్కారముల్ జూపి 
                           పలుకుల రాణి గ పండె నెవరు 
     చిరు నాట్య విన్యాస చిన్ముద్ర లం జూపి 
                        భంగిమల్ జూపెడు భామ యెవరు  
    దేశ దేశాలెల్ల  తెల్గు వైభవమ్ము 
                              హరి కదా రూపాన అందజేసి 
తే.గీ. బెండ పూ డి వంశ ప్రేమార్ద్ర రాశి యౌ 
        లక్ష్మి కొమరిత గుణ రత్న భావ 
       విలషిత మమతాల వాలమౌ గృ హిణి 
       భావి కాలమందు భద్ర మగుత . 

గుంటూరు . 
శ్రీ రామ్ నగర్  


కీ.శే . యల్లాప్రగడ శ్రీరామ మూర్తి గారి ప్రాంగణం (గుంటూరు ) లో శ్రీ సీతారామ కల్యాణమహోత్సవము  . చిత్రపటాలు . 














 
 




 


విజయవాడ దుర్గ అమ్మవారి ఆలయంలో చిత్రం . 







        

పద్యపరీమళము. యశస్వినీ సాహితీ సమితి. 12.06.25

 1. రాజనరేంద్రు కాలమున రాజిలె పద్యము నన్నపార్యుచే     సాజము సుందరంబయిన సంస్కృతభారతి తెల్గువెల్గుగా     భాజనమంచు పండితులు భారతమున్ శిరసావహించ...